Super Saddam : సద్దాం టీం ని కలవనివ్వని జబర్థస్త్ కామెడీ షో సీనియర్లు

 Authored By prabhas | The Telugu News | Updated on :14 January 2023,7:00 pm

Super Saddam : పటాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న సద్దాం మరియు యాదమ రాజు ప్రస్తుతం జబర్దస్త్ లో సందడి చేస్తున్నారు. హైపర్ ఆది తొలగి పోవడంతో ఆ స్థానంలో మల్లెమాల వారు సద్దాం మరియు యాదమ రాజు టీం తో భర్తీ చేయడం జరిగింది. వీరిద్దరు గతంలో మల్లెమాలతో చేసి వెళ్లి పోయారు. ఒకసారి మల్లెమాల నుండి వెళ్లి పోయిన వారికి మళ్లీ చోటు ఉండదు, కానీ ఈ టీం మాత్రం చాలా స్పెషల్ అన్నట్లుగా నిలుస్తుంది. జబర్దస్త్ కార్యక్రమంలో వీరికి ఎంట్రీ దక్కడం ఒక అద్భుతం

అన్నట్లుగా కొందరు అభిప్రాయం చేస్తున్నారు. వీరి ఎంట్రీ పట్ల ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తుంటే అదే షోకి చెందిన కొందరు మాత్రం సద్దాం టీం ని దూరంపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జబర్దస్త్ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న కొందరు కమెడియన్ సద్దాం మరియు యాదమ రాజు టీం ను పక్కకు పెడుతున్నారు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మల్లెమాల వారు ఎంతగా ప్రయత్నించినా కూడా సద్దాం టీంను వారు కలుపుకొని పోయే పరిస్థితి కనిపించడం లేదు. సద్దాంను వారి టీం లో చేయించుకోవడం లేదు.. అలాగే ఎవరినైనా సద్దాం ఆహ్వానించినా కూడా ఆసక్తి చూపించడం లేదు.

etv jabardasth team leader Super Saddam facing problems with others

etv jabardasth team leader Super Saddam facing problems with others

మొత్తానికి జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ అంతా ఒక్కటై సద్దాం టీం ని ఏకాకిగా మార్చేసారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో సద్దాం ఎంతో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. ఇతర చానల్స్ లో కూడా సద్దాం మంచి కార్యక్రమాల్లో పాల్గొని నవ్వించాడు. కనుక జబర్దస్త్ కార్యక్రమంలో కచ్చితంగా ఆయన ఎంట్రీ అందరికీ షాక్ అనడంలో సందేహం లేదు. పోటీ పెరిగింది అనే ఉద్దేశంతో సద్దాం టీం ని కొందరు సీనియర్స్ విమర్శిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి