shanthi swaroop : ముద్దులతో రెచ్చిపోయిన శాంతి స్వరూప్.. షోలోంచి వెళ్లిపోయిన కెవ్వు కార్తీక్

 Authored By prabhas | The Telugu News | Updated on :20 November 2021,5:00 pm

shanthi swaroop : జబర్దస్త్ టీమ్ లీడర్ కెవ్వు కార్తీక్ ఇటీవల తనదైన దూకుడుతో ముందుకు వెళ్తున్నాడు. స్కిట్స్‌లో కామెడీ పండిస్తున్నాడు. అతని టీమ్‌కు షెబీనా మరింత గ్లామర్ నింపుతోంది. తాజాగా కార్తీక్ టీమ్‌లో కనిపించిన శాంతి స్వరూప్.. ముద్దులతో రెచ్చిపోయింది. తొలుత.. కార్తీక్, లేడి గెటప్‌లో ఉండే శాంతి స్వరూప్ ఇద్దరు కలిసి రొమాంటిక్ సాంగ్‌కు డ్యాన్స్‌ చేశారు. అప్పుడు కార్తీక్‌కు శాంతి స్వరూప్ ముద్దు పెడతాడు. మొత్తం ముద్దులతోనే నింపేశారు.

దీంతో రోజా.. శాంతి గాడు సరదాలు అన్ని తీర్చుకున్నాడు అంటూ కామెంట్ చేసింది. సెట్‌లో ఉన్నవారంతా.. సూపర్ వన్స్‌మోర్ అంటూ కామెంట్స్ చేస్తారు. దీంతో మరోసారి కార్తీక్, శాంతి స్వరూప్ అదే పాటకు డ్యాన్స్ చేస్తారు. అప్పుడు కూడా శాంతి స్వరూప్ మరోసారి కార్తీక్‌కు ముద్దు పెడతాడు. దీంతో కార్తీక్ అక్కడి నుంచి బయటకు పరుగులు తీస్తాడు. తర్వాత కార్తీక్ స్టేజ్‌పైకి రాగానే.. గోక్కొవాలని అనిపించే దురద.. అందరితో పంచుకోవాలనిపించే సరదా.. ఇది అసలైన ప్రేమ.. ప్రేమ కారింది వరద.. అంటూ రోజా, మనో, రష్మీ డైలాగ్ చెబతారు.

jabardasth shanthi swaroop kisses kevvu karthik in skit

jabardasth shanthi swaroop kisses kevvu karthik in skit

shanthi swaroop : ముద్దులతో విసిగెత్తిన కార్తీక్..

ఇక, మరోసారి కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. దీంతో ఇక చాలు స్కిట్ కార్తీక్ అని అనగానే.. ఇక కామెంట్స్ తీసుకుందాం అంటూ రష్మీ కూడా వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే శాంతి స్వరూప్.. ఓపిక లేదు మేడమ్.. ముద్దు పెట్టి నా లిపిస్టిక్ పోయింది.. అని కామెంట్ చేస్తాడు. కార్తీక్ మాత్రం.. చాలా షార్ట్‌గా స్కిట్ కంప్లీట్ చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత ఇమాన్యుయేల్, వర్ష ట్రాక్‌ను ఇమిటేట్ చేశారు. ఫస్ట్ టైమ్ స్టేజ్ మీదే స్కిట్ అలచ్చని నాకు అర్థమైంది అని కార్తీక్ అంటాడు. ప్రస్తుతం ఈ స్కిట్ వీడియో వైరల్‌గా మారింది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి