Jabardasth Varsha Emotional Comments on Emmanuel in Sridevi Drama Company Promo
Jabardasth Varsha : జబర్దస్త్ స్టేజ్ మీద మెరిసిన తారల్లో వర్ష ఒకరు. బుల్లితెరపై అంతకు ముందు ఎన్నో ఏళ్ల నుంచి సీరియల్స్ చేస్తూ వచ్చింది. కానీ అంతగా గుర్తింపు అయితే రాలేదు. వర్షకు బుల్లితెరపై ఓ స్థానాన్ని, గుర్తింపు వచ్చేలా చేసింది జబర్దస్త్ షో. ఈ షోతో వర్ష ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. ఓవర్ నైట్‌లో వర్ష స్టార్‌గా నిలిచింది. అలా జబర్దస్త్ షోతో వర్ష నిలదొక్కుకుంది. ఆమెకు అంతగా నటన రాకపోయినా, స్కిట్లు చేయడం రాకపోయినా కూడా తన అందం, గ్లామర్‌తో నెట్టుకొచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం వర్ష తన కామెడీ టైమింగ్, యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇలా అన్నింట్లోనూ ఇంప్రూవ్ చేసుకుంది.
మొత్తానికి వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ మాత్రం బుల్లితెర మీద హాట్ టాపిక్‌గా నిలిచింది. వర్ష ఎప్పుడైతే ఇమాన్యుయేల్ ట్రాక్‌తో సెట్ అయిందే.. బుల్లితెరపై షోలు, పండుగ ఈవెంట్లు అని అన్నీ వారిద్దరి మీదే ప్లాన్ చేశారు. సందు దొరికినప్పుడల్లా రోజా సైతం ఈ ట్రాక్‌ను లవ్ స్టోరీని పైకి లేపేది. మల్లెలవ్మాల కూడా ఈ జోడిని బాగానే ఎంకరేజ్ చేసింది. ఎన్నో ఈవెంట్లు వీరి లవ్ స్టోరీ మీద చేసింది. అయితే అవి కాస్త మీతి మీరుతుండటంతో జనాలకు చిర్రెత్తుకొచ్చింది. అలా కొన్ని రోజులు మధ్యలో ట్రాక్ జోలికి వెళ్లలేదు. అన్నా చెల్లెళ్లుగానూ స్కిట్లో నటించేశారు. భాస్కర్, ఫైమా, వర్ష, ఇమాన్యుయేల్ కలిసి బాగానే సందడి చేశారు.
Jabardasth Varsha Emotional Comments on Emmanuel in Sridevi Drama Company Promo
ఇక ఇప్పుడు ఫైమా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిపోయింది. వర్ష తాజాగా కొన్ని కామెంట్లు చేసింది. వచ్చే ఆదివారం నాడు ప్రసారం కానున్న శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు సంబంధించిన ప్రోమోను వదిలారు. ఇందులో వర్ష ఎమోషనల్ అయింది. తన ప్రేమ గురించి చెప్పకనే చెప్పేసింది. కానీ ఆ వ్యక్తి ఎవరన్నది సస్పెన్స్‌గా మెయింటైన్ చేయించారు. గత కొన్ని రోజులుగా నాతో మాట్లాడటం లేదు.. నా తప్పు ఏమైనా ఉంటే క్షమించు అని వర్ష ఎమోషనల్ అయింది. మరి ఆ కామెంట్లు ఇమాన్యుయేల్ గురించా? కాదా? తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.