Jabardasth Varsha : లేడీ గెటప్ అంటూ హేళన.. వర్ష పరువు తీస్తోన్న ఫైమా

Authored By Sam C | The Telugu News | Published on: March 5, 2022, 9:30 pm

Jabardasth Varsha :  జ‌బ‌ర్ధ‌స్త్ షోతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ వ‌ర్ష‌. ఇంత‌క‌ముందు ప‌లు సీరియ‌ల్స్ లో న‌టించిన‌ప్ప‌టికీ జ‌బ‌ర్ధ‌స్త్‌తో క్రేజ్ విప‌రీతంగా పెరిగింది. అయితే చాలా రోజులుగా వర్ష, ఇమ్మాన్యుయెల్‌ లవర్స్ గా స్కిట్లు చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. అదే సమయంలో వ్యక్తిగత విషయాలను పంచుకునే సమయంలోనే ఇమ్మాన్యుయెల్‌ని లేకుండా తన లైఫ్‌ని ఊహించుకోలేనని చాలా సందర్భాల్లో చెప్పింది. ఇమ్మాన్యుయెల్‌ లేకపోతే చాలా కష్టం అంటూ రియాక్ట్ అయ్యింది. దీంతో వీరిద్దరి మధ్య లవ్‌ స్టోరీ సాగుతుందనే అంచనాని షోలోని మెంబర్‌తోపాటు ఆడియెన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. అయితే ఇటీవ‌ల వ‌ర్ష బుల్లెట్ భాస్క‌ర్ టీంలోను తెగ సంద‌డి చేస్తుంది.

ఫైమాని హాయ్ అక్క వ‌ర్ష ప‌ల‌క‌రించ‌డంతో ఈమెపై ఫైమా ఫైర్ అయింది. కాస్ట్యూమర్ ద‌గ్గ‌ర‌కు వెళుతుంటే నీలా నేను కూడా లేడీ గెట‌ప్ అనుకొని చీర క‌డ‌తా అన్నాడు అని చెప్పుకొచ్చింది ఫైమా. అవ‌న్నీ కాదు కాని నా ముఖం చూస్తే ఎవ‌రైన ఫ్లాట్ అయిపోతారు తెలుసా అంటూ వ‌ర్ష అంది. దీనిక ఫైమా నాలుగు డైలాగులు ఇస్తే నువ్వే ఫిట్స్ వ‌చ్చి పడిపోతావు తెలుసా అంటుంది. ఇక అక్కా చెల్లెళ్లుగా న‌టించిన ఫైమా, వ‌ర్ష త‌మ‌కు రావ‌ల్సిన అబ్బాయి ఎలా ఉండాలో కోర‌కుంటారు. దీనికి ఫైమా త‌న‌కు 4జీ సిమ్ లా కాకుండా 5జీ సిమ్ లా ఉండాల‌ని కోరుకుంటుంది. వ‌ర్ష త‌న‌కు పిండితే లీట‌ర్ పాలు కారేలా వ‌చ్చేఅబ్బాయి కావాలంటుంది.

Jabardasth Varsha full fun entertain the audience

Jabardasth Varsha full fun entertain the audience

Jabardasth Varsha : వర్ష ఇలా బుక్క‌యిందేంటి?

దీనికి ఫైమా బ‌ర్రెను పెళ్లి చేసుకోమ‌ని పంచ్ వేస్తుంది. ఇక బుల్లెట్ భాస్కర్,ఇమ్మాన్యుయేల్ క‌లిసి కొద్ది సేపు త‌మ‌దైన పంచ్‌ల‌తో నానా ర‌చ్చ చేశారు. వీరి కామెడీ ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించింది. ఇద‌లా ఉంటే వ‌ర్ష శ్రీదేవి డ్రామా కంపెనీలోను తెగ సంద‌డి చేస్తుంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేకమైన ప్రోగ్రాం ప్లాన్ చేసింది శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్. ఈ మేరకు కంటిస్టెంట్స్ తల్లులను గెస్టులుగా తీసుకొచ్చి ఈ వేదిపై గౌరవప్రదమైన సత్కారం చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా అందులోని కొన్ని సన్నివేశాలు పలువురి చేత కంటతడి పెట్టిస్తున్నాయి.సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఇమ్మానుయేల్, వర్ష, జోర్దార్ సుజాత సహా పలువురు కంటిస్టెంట్లతో ఈ ప్రోగ్రాం రూపొందించారు. ఇందులో పెళ్ళాం మాట విని ఇమ్మానుయేల్ తన తల్లిని ఇంట్లో నుంచి గెంటివేసిన సీన్ చూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp