Pooja Hegde : పూజా హెగ్డే అరాచకం.. ఈ అందాల‌ని త‌ట్టుకునేదెలా?

Authored By Sam C | The Telugu News | Updated on : 5 March 2022, 8:30 pm

Pooja Hegde : అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో బుట్ట‌బొమ్మ‌గా మారిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మ‌డి అంద‌చందాల‌కు ప‌ర‌వ‌శించ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో సందడి చేస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. సాదాసీదా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. అదే సమయంలో ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో దక్కించుకుంది. పూజా న‌టించిన ఆచార్య‌, రాధే శ్యామ్ చిత్రాలు విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి.

పూజా కెరీర్ జోరు మీదుంది.ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు రాధాకృష్ణ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. రాధే శ్యామ్ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల ఉండగా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. మార్చ్ 11న రాధే శ్యామ్ విడుదల కానుంది. ఈ క్ర‌మంలో పూజా హెగ్డే తెగ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటుంది. అంతేకాదు అందాల ఆర‌బోత‌తో తెగ ర‌చ్చ చేస్తుంది. పూజా స్ట‌న్నింగ్ పిక్స్ కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు.

Pooja Hegde New pics

Pooja Hegde New pics

Pooja Hegde  : ఆ అందాల‌కు ఫిదా కావ‌ల్సిందే..!

పూజా హెగ్డే తాజాగా స్టైలిష్ డ్రెస్‌లో అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేసింది. ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ఈ అందాల‌కు ఎవ‌రైన మైమ‌ర‌చిపోకుండా ఉంటారా అని క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పూజా హెగ్డే మెస్మరైజింగ్ లుక్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. పూజా న‌టించిన రాధే శ్యామ్ చిత్రం చాలా సార్లు వాయిదా ప‌డింది. ఇక మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ గా తెరకెక్కుతుంది ఆచార్య . విడుదలకు సిద్దమైన ఈ మూవీ ఏప్రిల్ 29 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆచార్య మూవీలో పూజా హెగ్డే చరణ్ కి జంటగా నటిస్తున్నారు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రించ‌నుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి