Anchor Suma : మా చేతుల్లో అద్భుతం ఉంది.. యాంకర్ సుమ వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor Suma : మా చేతుల్లో అద్భుతం ఉంది.. యాంకర్ సుమ వీడియో వైరల్

Anchor Suma : యాంకర్ సుమ‌.. తెలుగు రాష్ట్రాల‌లో ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈవిడ షో మొద‌లు పెట్టిందంటే టీఆర్పీలు ద‌ద్ద‌రిల్లాల్సిందే. సుమ షోస్‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంటుంది. యాంకర్ సుమ సోషల్ మీడియాలో తన అమ్మ గురించి అప్పుడప్పు చెబుతూ ఉంటారు. ఆమెతో కలిసి ఫన్నీ వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు. తన అమ్మ ఇప్పటికీ వ్యాయామాలు, యోగాలు చేస్తుందని, ఎంతో యాక్టివ్‌గా ఉంటారని […]

 Authored By sandeep | The Telugu News | Updated on :5 March 2022,8:00 pm

Anchor Suma : యాంకర్ సుమ‌.. తెలుగు రాష్ట్రాల‌లో ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈవిడ షో మొద‌లు పెట్టిందంటే టీఆర్పీలు ద‌ద్ద‌రిల్లాల్సిందే. సుమ షోస్‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంటుంది. యాంకర్ సుమ సోషల్ మీడియాలో తన అమ్మ గురించి అప్పుడప్పు చెబుతూ ఉంటారు. ఆమెతో కలిసి ఫన్నీ వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు. తన అమ్మ ఇప్పటికీ వ్యాయామాలు, యోగాలు చేస్తుందని, ఎంతో యాక్టివ్‌గా ఉంటారని సుమ ఆ మధ్య ఓ వీడియోను షేర్ చేశారు. అందులో సుమ అమ్మ గారి ఎనర్జీకి అందరూ ఫిదా అయ్యారు. ఇక తాజాగా సుమ తెనాలి డబుల్ హార్స్ ప్రమోష‌న్స్ లో భాగంగా ఓ వీడియో షేర్ చేసింది.

ఇందులోభాగంగా సుమ తాను ఒక యాంక‌ర్ ని మాత్ర‌మే కాదు యాంకర్, ప్రోడ్యూస‌ర్, తల్లిని అని చెబుతూ త‌ల్లి చేతుల‌లో ఎంత మ్యాజిక్ ఉంటుందో తెలియ‌జేసింది. తెనాలి డ‌బుల్ హార్స్ గుడీస్ నుండి మంచి గిఫ్ట్స్ అందుకోవాలి అంటే ఓ వీడియో కాని ఫోటోస్ కాని అప్ లోడ్ చేయాల‌ని కోరింది. ఇందుకు సంబంధించి ప‌లు విష‌యాలు కూడా చెప్పుకొచ్చింది సుమ‌. ఈ అమ్మ‌డు చెప్పిన స్ట‌న్నింగ్ విష‌యాల‌కి ప్రేక్ష‌కులు తెగ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ప్ర‌స్తుతం సుమ షేర్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది.యాంకర్ సుమ.. ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. గత రెండు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్‌లో తనకి తానే సాటి, ఎవరు లేరు పోటీ అన్నట్టుగా దూసుకుపోతుంది.

Anchor suma gives surprises to fans

Anchor suma gives surprises to fans

Anchor Suma  : సుమ స‌ల‌హాలు..

యాంకర్ సుమ తన స్పాంటన్యుటితో అంచెలంచెలుగా ఎదిగింది. తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకుంది. కొత్త గా ఏ షో స్టార్టైయినా ముందుగా తన పేరును పరిశీలించిగానే ప్రారంభించరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పటి వరకు తెలుగు టెలివిజన్ కార్య క్రమాలు, గేమ్ షోలకు పరిమితమైన సుమ ఉన్నట్టుండి కొత్త అవతారం ఎత్తారు. ఇప్పుడు జ‌య‌మ్మ పంచాయ‌తీ సినిమా కోసం న‌టి అవ‌తారం కూడా ఎత్తింది. విజయ్ కుమార్ కలివరపు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎంఎం కీరవాణి మంచి సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల కానుంది.

 

View this post on Instagram

 

A post shared by Suma K (@kanakalasuma)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది