Jabardasth Varsha : నా ఎక్స్‌బాయ్ ఫ్రెండ్ పేరు ప్ర‌భ అని చెప్పిన వ‌ర్ష‌.. ఇమ్మాన్యుయేల్ మొహం మాడిపోయిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jabardasth Varsha : నా ఎక్స్‌బాయ్ ఫ్రెండ్ పేరు ప్ర‌భ అని చెప్పిన వ‌ర్ష‌.. ఇమ్మాన్యుయేల్ మొహం మాడిపోయిందిగా..!

Jabardasth Varsha : బుల్లితెర క్రేజీ జంట‌ల‌లో వ‌ర్ష‌- ఇమ్యాన్యుయేల్ ఒక‌రు. ఈ జంట చేసే సంద‌డి మాములుగా ఉండ‌దు. వీరు చేసే స్కిట్స్ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతుంటుంది. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో లవ్ స్టోరీ అంటే వెంటనే గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ జోడీ. ఇప్పుడు వాళ్లను మించిపోయేలా మరో ప్రేమకథ కూడా పురుడు పోసుకుంటుంది. వారే ఇమ్మాన్యుయేల్,వ‌ర్ష జంట‌. రియ‌ల్ లైఫ్‌లో కాక‌పోయిన రీల్ లైఫ్‌లోఈ ఇద్ద‌రు చేసే ర‌చ్చ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :27 February 2022,7:30 pm

Jabardasth Varsha : బుల్లితెర క్రేజీ జంట‌ల‌లో వ‌ర్ష‌- ఇమ్యాన్యుయేల్ ఒక‌రు. ఈ జంట చేసే సంద‌డి మాములుగా ఉండ‌దు. వీరు చేసే స్కిట్స్ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతుంటుంది. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో లవ్ స్టోరీ అంటే వెంటనే గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ జోడీ. ఇప్పుడు వాళ్లను మించిపోయేలా మరో ప్రేమకథ కూడా పురుడు పోసుకుంటుంది. వారే ఇమ్మాన్యుయేల్,వ‌ర్ష జంట‌. రియ‌ల్ లైఫ్‌లో కాక‌పోయిన రీల్ లైఫ్‌లోఈ ఇద్ద‌రు చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న వ‌ర్ష‌ ఇప్పుడు జబర్దస్త్ షోలో తెగ సంద‌డి చేస్తుంది. ఈ మధ్య వరసగా స్కిట్స్‌లో ఇమ్మాన్యుయేల్‌తో కలిసి రొమాన్స్ చేస్తుంది. ఈ ఇద్దరిపై రాసిన స్కిట్స్ కూడా బాగానే పేలుతున్నాయి.

దానికితోడు అదిరిపోయే అందాల షోతో పిచ్చెక్కిస్తుంది ఈమె.తాజాగా ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్‌లో ఈ జంట చేసే రోమాన్స్ కేక పెట్టిస్తుంది. ఇద్ద‌రు మంచం మీద కూర్చొని ఉండ‌గా, వ‌ర్ష.. ప్ర‌భ అంటుంది.దానికి ఇమ్మూ .. ప్ర‌భ ఎవ‌రని అడ‌గగా, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెబుతుంది. దానికి ఇమ్మూ.. నీ మ‌న‌సులో ఎలా అయిన స్థానం సంపాదిస్తా. అప్పుడే నీ మీద చేయేస్తా అని అంటాడు. అయితే భాస్క‌ర్, ఇమ్మూ ఇద్ద‌రు శోభ‌నం చేయ‌లేద‌ని అనుమానం రాకుండా క‌వ‌ర్ చేస్తుంటారు. వీరు చెప్పే డైలాగులు క‌డుపుబ్బ న‌వ్విస్తాయి.ఆ మ‌ధ్య ఇమ్మూకి డైరెక్ట్ గా ప్రపోజ్ చేసింది వర్ష. నా ప్రాణం పోయేవరకూ నా హృదయంలో నువ్వు ఉంటావు అంటూ హార్ట్ సింబల్ ..తో ఇమ్మాన్యుయేల్ కు ప్రపోజ్ చేసేసింది.

Jabardasth Varsha says about her boy friend

Jabardasth Varsha says about her boy friend

Jabardasth Varsha : ఆ ప్ర‌భ ఎవ‌ర‌మ్మా…!

నువ్వు నాకు ఎంతో స్పెషల్ అంటూ వర్ష ప్రపోజ్ చేయడంతో దిల్ ఖుష్ అయ్యాడు ఇమ్మాన్యూయేల్. వర్ష ఇలా ప్రపోజ్ చేయడంతో ఆనందం తట్టుకోలేకపోయాడు ఇమ్మాన్యయేల్. వెంటనే తాను కూడా ప్రపోజ్ చేవాడు. ఓ చిన్న డైలాగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు ఇమ్మూ. అందకే అంటుంటారు ప్రేమించడం కాదు.. ప్రేమించబడటం గొప్పా అంటూ.. మోకాళ్ళ మీద నించుని..నువ్వు నాకు దొరకడంతో నేను చాలా లక్కీ అంటూ ప్రపోజ్ చేశాడు ఇమ్మాన్యుయేల్. ఆఫ్ స్క్రీన్ సంగ‌తేమో కాని, ఆన్ స్క్రీన్‌లో మాత్రం వ‌ర్ష- ఇమ్మూ మాత్రం చెల‌రేగిపోతున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది