Anchor Suma: మీ కళ్లు పోయాయా?.. యాంకర్ సుమ పరువుతీసిన జబర్దస్త్ యోధ

Authored By Sam C | The Telugu News | Published on: March 8, 2022, 12:30 pm

Anchor Suma : ఒక‌ప్పుడు జూనియ‌ర్స్‌గా సంద‌డి చేసిన ప‌లువురు ఆర్టిస్ట్స్ పెరిగి పెద్ద‌య్యాక కూడా సంద‌డి చేస్తున్నారు. అలాంటి వారిలో యోధ ఒక‌రు. ఆమెకు చిన్న‌ప్పుడే ఎంత గుర్తింపు వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాను ఫ‌స్ట్ క్లాస్ చదువుతున్న స‌మ‌యంలో ఫ్రెండ్ రమ్యతో అత్త కోడలు ఆట ఆడుకుంటుంటే చిన్నారి నాన్న వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టారు. మంచి రెస్పాన్స్ రావడంతో అలాగే వరుసగా వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.. టైలర్ అయిన రమ్య వాళ్ల నాన్న మాకు కాస్ట్యుమ్స్ డిజైన్ చేస్తే, డ్యాన్సరైన మా నాన్న మేకప్ చేస్తారు.

ఒక లైలా కోసం, సూర్యా వర్సెస్ సూర్యా, గోవిందుడు అందరివాడేలే, సుబ్రమణ్యం ఫర్ సేల్, బెంగాల్ టైగర్, గబ్బర్ సింగ్-2.. ఇలా 48 సినిమాల్లో నటించాను అని యోధ ఓ సారి చెప్పుకొచ్చింది.ఇప్పుడు యోధ ప‌లు టీవీ షోల‌లో కూడా తెగ సంద‌డి చేస్తుంది. ఈ చిన్నారి తాజాగా క్యాష్ ప్రోగ్రాంకి హాజ‌రు కాగా, అందులో చేసిన సంద‌డి మాములుగా లేదు. ఫైమా, బ‌షీర్ జంట‌ని సుమ అంద‌మైన జంట అన‌గానే వెంట‌నే యోధ‌.. మీ కళ్లు పోయాయా ఏంటి సుమ‌పైనే పంచ్ వేసింది. దీంతో అంద‌రు అవాక్క‌య్యారు.

Jabardasth Yodha  fun with Anchor Suma

Jabardasth Yodha  fun with Anchor Suma

బాబోయ్ యోధ ఏంటి ఇలా అనేసింది అంటూ అంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం యోధ‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.యోధ త‌న చిన్న‌ప్పుడు చాలా సంద‌డి చేసింది. అత్త‌, కోడ‌ళ్లుగా యోధ‌, ర‌మ్య చేసిన సంద‌డి మాములుగా లేదు. వీరిద్ద‌రు ఏ షో చేసిన కూడా అది చాలా హిట్టే. చాలా షోలలో క‌నిపించిన వీరిద్ద‌రు అశేష ప్రేక్ష‌కాద‌రణ పొందారు. యోధ వీడియోలు నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంటాయి. అంతేకాకుండా ఆమెకు సంబంధించి చిన్న వీడియో కూడా సోష‌ల్ మీడియాని షేక్ చేయ‌డం ఖాయం.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp