Naga Babu : నాగబాబుని మంచి రోజా రెమ్యునరేషన్ అందుకుందా.. అసలు విషయం చెప్పిన జబర్ధస్త్ మాజీ మేనేజర్
Naga Babu : ఎప్పుడు కామెడీ స్కిట్స్‌తో ప్రేక్షకులకి వినోదం పంచే జబర్ధస్త్ కార్యక్రమం ఇటీవల వివాదాలతో హాట్ టాపిక్ అవుతుంది. ఒకప్పుడు కలిసి మెలిసి స్కిట్స్ చేసిన కమెడీయన్స్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ముఖ్యంగా కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్‌తో జబర్ధస్త్ లో అలజడి మొదలైంది. దీంతో కిర్రాక్ ఆర్పీ చెప్పే విషయంలో ఎలాంటి నిజాలు లేవు అని అతనికి కౌంటర్స్ అయితే ఇచ్చారు కొందరు కమెడీయన్స్. రీసెంట్ గా మాజీ జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు కూడా అతనికి కౌంటర్ ఇచ్చారు. పలు విషయాలపై ఆయన మాట్లాడుతూ అందరిలో ఉన్న అనుమానాలకు చెక్ పెట్టారు.
జబర్ధస్త్ లొల్లి…2013లో మొదలైన జబర్దస్త్ షో ఏ స్థాయిలో గుర్తింపు అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అతికొద్ది కాలంలోనే టాప్ రేటింగ్స్ తో దూసుకుపోయిన జబర్దస్త్ ఆ తర్వాత ప్రొడక్షన్ నిర్మాతలకు కూడా భారీ స్థాయిలో లాభాలను అందించింది. ఇక ఈ కామెడీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నవారు చాలావరకు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. కమెడియన్ల సంగతి అటుంచితే యాంకర్లుగా అనసూయ, రష్మీ.. అదేవిధంగా జడ్జ్ లుగా నాగబాబు, రోజా తెగ అట్రాక్ట్ చేశారు. ఈ క్రమంలో అటు కమెడియన్లకు ఇటు యాంకర్లు, జడ్జ్ లను రెమ్మ్యూనరేషన్ పరంగా మెప్పిస్తూ వస్తోంది జబర్దస్త్ యాజమాన్యం. అయితే జబర్దస్త్ లో చాలా మోసాలు జరుగుతున్నాయని అక్కడ కనీసం తిండి కూడా సరిగ్గా పెట్టరు అని మల్లెమాల సంస్థలో ఎవరు కూడా కరెక్ట్ గా లేరు అని యాజమాన్యం మొత్తం జబర్దస్త్ కమెడియన్స్ వల్లనే ఎంతో సంపాదించినట్లుగా కిరాక్ ఆర్పీ విమర్శలు చేశారు.
ఈ క్రమంలో నాగబాబుకు కూడా రోజా కంటే ఎక్కువ ఇచ్చే వాళ్ళని కూడా వార్తలు వచ్చాయి. కానీ నిజానికి నాగబాబు కంటే రోజాకే జబర్దస్త్ లో ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా ఇటీవల కిర్రాక్ ఆర్పీ కామెంట్ చేశాడు. జబర్దస్త్ లో జడ్జిగా ఉన్న నాగబాబుకు రోజా కంటే తక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒక కారణం ఉంది అని ఏడుకొండలు వివరణ ఇచ్చారు. ఎందుకంటే రోజా గారు ముందుగానే సినిమా పరిశ్రమలో ఒక హీరోయిన్ గా ఎంతగానో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి వస్తున్నారు అన్నప్పుడు ఆమె మార్కెట్ ను బట్టి అందరికంటే ఎక్కువ స్థాయిలోనే ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే నాగ బాబు కంటే ఆమెకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.