RRR Movie : ఒకప్పుడు థియేటర్స్‌లో 50 రోజులకి పైగా సినిమాలు ఆడేవి. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంత పెద్ద సినిమా అయిన 10 రోజుల వరకే. తర్వాత కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం జేమ్స్.. ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్లతో సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నెల 17వ తేదీన జేమ్స్ విడుదలైంది. ‘ది క శ్మీర్ ఫైల్స్ తో పాటు మరో భారీ సినిమా కోసం బెంగళూరుతో సహా రాష్ట్రంలో పలు థియేటర్ల నుంచి జేమ్స్ సినిమాను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పరభాష చిత్రాల కోసం కన్నడ చిత్రాలకు అన్యాయం చేయొద్దని పలు కన్నడపర సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
ఇప్పటికే కర్ణాటకలో ‘బాయ్ కాట్ ఆర్ఆర్ఆర్’ అంటూ ట్రెండ్ నడుస్తుంది. కర్ణాటకలో చాలా ప్రాంతాల్లో సినిమా కన్నడలో రిలీజ్ అవ్వట్లేదు. కొన్ని టెక్నికల్ కారణాలతో ప్రస్తుతం కర్ణాటకలో తెలుగు, హిందీ భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారు. దీంతో కన్నడ నాట వ్యతిరేకత ఎదురైంది. అయితే కన్నడ భాషలో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే జేమ్స్ సినిమా రిలీజ్ అయ్యాక వారం రోజుల వరకు కర్ణాటకలో వేరే సినిమా రిలీజ్ చేయకూడదని కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్, సినీ పరిశ్రమ నిర్ణయం తీసుకున్నారు. నేటితో సినిమా రిలీజ్ అయి వారం అయిపోవడంతో రేపట్నుంచి చాలా థియేటర్లలో ఈ సినిమాని తీసేసి ‘ఆర్ఆర్ఆర్’ని ప్రదర్శించనున్నారు.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన జేమ్స్ సినిమాను ది కశ్మీర్ ఫైల్స్ , ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎత్తివేయడం తగదని బీజేపీ ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ అన్నారు. బుధవారం ఆయన మైసూరులో మాట్లాడుతూ కన్నడ సంప్రదాయాలకు నిదర్శనం డాక్టర్ రాజ్‌కుమార్ అన్నారు. అలాంటి వ్యక్తి కుమారుడు పునీత్ అకాల మరణం తరువాత విడుదల అయిన జేమ్స్ చిత్రాన్ని పక్కన పెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో కన్నడ చిత్రాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పునీత్ అభిమానులు, కర్ణాటక రాజకీయ నాయకులు పునీత్ చివరి సినిమాని అప్పుడే థియేటర్లలోంచి తీసేయొద్దు, వేరే భాష సినిమాల కోసం జేమ్స్ సినిమాను పక్కన పెట్టొద్దు అంటూ ర్యాలీలు నిర్వహిస్తూ, మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.