Jana Gana Mana : పూజా హెగ్డేని వదలని పూరి జగన్నాథ్.. విజయ్‌తో రొమాన్స్‌కు రెడీ.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jana Gana Mana : పూజా హెగ్డేని వదలని పూరి జగన్నాథ్.. విజయ్‌తో రొమాన్స్‌కు రెడీ..

 Authored By govind | The Telugu News | Updated on :5 June 2022,8:00 pm

Jana Gana Mana : సాధారణంగా పూరి జగన్నాథ్ ఆయన సినిమాలలో ఎక్కువగా కొత్త హీరోయిన్‌నే టాలీవుడ్‌కు పరిచయం చేస్తుంటారు. బద్రి సినిమాతో అమీషా పటేల్, రేణు దేశాయ్, ఇడియట్ సినిమాతో రక్షిత, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమాతో ఆసిన్, సూపర్ సినిమాతో అనుష్క శెట్టి, అయేషా టాకియా, లోఫర్ సినిమాతో దిశా పఠాని..ఇలా ఆయన సినిమాల ద్వారా ఒకరిద్దరు తప్ప అందరూ కొత్తవారే హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఒక్క ఇలియానా దేవదాస్ సినిమాతో పరిచయమైంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాతో కూడా అనన్య పాండే హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

అయితే, చాలాకాలం తర్వాత పూరి జగన్నాథ్ స్టార్ హీరోయిన్‌ను తన సినిమా కోసం ఎంచుకున్నాడు. ఆమెనే మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే. లైగర్ సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తూనే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు పూరి. జనగణమన టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఓ నిర్మాత. శ్రీకర స్టూడియోస్ – పూరి కనెక్ట్స్ కలిసి పాన్ ఇండియన్ సినిమాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. పూరి – ఛార్మి కౌర్ – వంశీ పైడిపల్లి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు.ఇక ఈ సినిమాను 2023 ఆగస్టు 3న ఈ సినిమాని విడుదల చేయనున్నారు.

Jana Gana Mana Puri Jagannadh not to leave Pooja Hegde

Jana Gana Mana Puri Jagannadh not to leave Pooja Hegde

Jana Gana Mana : పూజాకు – విజయ్‌కు సెట్ అవుతుందా..?

ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసినప్పుడే పూరి టీమ్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక ఈ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే జాయిన్ అవుతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. కానీ, పూజాకు – విజయ్‌కు సెట్ అవుతుందా..? అనే సందేహాలు కొందరిలో కలిగాయి. వాటి సంగతి పక్కనపెడితే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నిజం చేస్తూ ఈరోజు సినిమా షూటింగ్ ప్రారంభించారు. దీనికి పూజా హెగ్డే కూడా హాజరైంది. దాంతో జనగణమనలో హీరోయిన్ పూజా హెగ్డే ఫిక్సైందని కన్‌ఫర్మ్ అయింది. చూడాలి మరి పూరి సినిమా అంటే హీరోయిన్ మహా రొమాంటిక్‌గా ఉంటుంది. మరి పూజాను పూరి ఎలా చూపిస్తాడో.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది