Jana Gana Mana : సాధారణంగా పూరి జగన్నాథ్ ఆయన సినిమాలలో ఎక్కువగా కొత్త హీరోయిన్‌నే టాలీవుడ్‌కు పరిచయం చేస్తుంటారు. బద్రి సినిమాతో అమీషా పటేల్, రేణు దేశాయ్, ఇడియట్ సినిమాతో రక్షిత, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమాతో ఆసిన్, సూపర్ సినిమాతో అనుష్క శెట్టి, అయేషా టాకియా, లోఫర్ సినిమాతో దిశా పఠాని..ఇలా ఆయన సినిమాల ద్వారా ఒకరిద్దరు తప్ప అందరూ కొత్తవారే హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఒక్క ఇలియానా దేవదాస్ సినిమాతో పరిచయమైంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాతో కూడా అనన్య పాండే హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.
అయితే, చాలాకాలం తర్వాత పూరి జగన్నాథ్ స్టార్ హీరోయిన్‌ను తన సినిమా కోసం ఎంచుకున్నాడు. ఆమెనే మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే. లైగర్ సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తూనే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు పూరి. జనగణమన టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఓ నిర్మాత. శ్రీకర స్టూడియోస్ – పూరి కనెక్ట్స్ కలిసి పాన్ ఇండియన్ సినిమాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. పూరి – ఛార్మి కౌర్ – వంశీ పైడిపల్లి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు.ఇక ఈ సినిమాను 2023 ఆగస్టు 3న ఈ సినిమాని విడుదల చేయనున్నారు.
Jana Gana Mana Puri Jagannadh not to leave Pooja Hegde
ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసినప్పుడే పూరి టీమ్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక ఈ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే జాయిన్ అవుతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. కానీ, పూజాకు – విజయ్‌కు సెట్ అవుతుందా..? అనే సందేహాలు కొందరిలో కలిగాయి. వాటి సంగతి పక్కనపెడితే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నిజం చేస్తూ ఈరోజు సినిమా షూటింగ్ ప్రారంభించారు. దీనికి పూజా హెగ్డే కూడా హాజరైంది. దాంతో జనగణమనలో హీరోయిన్ పూజా హెగ్డే ఫిక్సైందని కన్‌ఫర్మ్ అయింది. చూడాలి మరి పూరి సినిమా అంటే హీరోయిన్ మహా రొమాంటిక్‌గా ఉంటుంది. మరి పూజాను పూరి ఎలా చూపిస్తాడో.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.