Janaki Kalaganaledu 04 August 2022 Episode : జ్ఞానాంబ జానకి, రామలను క్షమించడంతో సంతోష పడుతున్న జానకి, రామ.. ఇది చూసి కుమిలిపోతున్న మల్లిక..
Janaki Kalaganaledu 04 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే ఈ సీరియల్ జానకి కలగనలేదు ఈ సీరియల్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఈ సీరియల్ తాజాగా రిలీజ్ అయింది. 359 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానంబ పక్కకు వచ్చి బాధపడుతుండగా గోవిందరాజు అక్కడికి వెళ్లి జ్ఞానంబాతో ఇలా అంటాడు. ఇకనైనా వాళ్లని క్షమించు జ్ఞానం. వాళ్లు చేసింది తప్పే కానీ, వాళ్లు ఎంతో బాధపడుతున్నారు. నీ కొడుకు నీకు అబద్ధం చెప్పినందుకు ఎన్నో నిద్రలేని రాత్రులని గడుపుతున్నాడు. ఇకనైనా నీ మనసు పెద్దది చేసుకొని వాళ్ళిద్దర్నీ క్షమించు జ్ఞానం అని అంటాడు గోవిందరాజు. నా కొడుకుని నేను ఎంతగానో నమ్మాను కానీ నన్ను పిచ్చిదాన్ని చేశాడు. అని జ్ఞానాంబ అంటుండగా గోవిందరాజు. నీ కొడుకు ఎప్పుడు నీ మాట జవదాటడు. తన భార్య బాధ చూడలేక అలా చేశాడే తప్ప నిన్ను బాధ పెట్టాలి నీ మాట వినకూడదు అని కాదు. జానకిని, నీ కొడుకుని మార్చింది. తన మాట వినేలా చేసుకుంది అంటున్నావ్. మొన్న గుడిలో తన ప్రాణాలు అడ్డేసి మనందరి ప్రాణాలను కాపాడింది. అది నీకు గుర్తు లేదా.
జానకి, రామాలు, రామ లక్ష్మణ్ లాగా తండ్రి మాట ఎలా జవదాటరో, వాళ్లు కూడా నీ మాట జే. నిన్ను ఎప్పుడు అగౌరవపరచరు.ఈ కుటుంబానికి ఎప్పుడు మచ్చ తీసుకురారు. అని అంటుండగా.. జానకి జ్ఞానం కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి. అత్తయ్య గారు నాకు ఏ శిక్ష చేసిన భరిస్తాను. కానీ మీ అబ్బాయికి మాత్రం శిక్ష వేయకండి. మీరు మాట్లాడకపోతే తను కుమిలిపోతున్నాడు. తన బాధని నేను చూడలేకపోతున్నాను. అని అనగానే జానకిని పట్టుకొని లేపుతుంది. దాంతో జానకి వాయనం తీసుకువచ్చి జ్ఞానంభకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది. దాంతో కుటుంబ సభ్యులు అందరూ సంతోష పడిపోతూ ఉంటారు. కానీ మల్లికా మాత్రం అదంతా చూస్తూ మండి పడిపోతూ ఉంటుంది. కట్ చేస్తే జానకి వాళ్ళ అమ్మ నాన్న ఫోటో దగ్గరికి వెళ్లి నాన్న నన్ను చిన్నప్పటినుంచి పోలీస్ చేయాలి. ఐపీఎస్ గా నన్ను చూడాలి అని ఎంతగానో కలకన్నావు. నేను నీ కలను నెరవేరుస్తానని మాట ఇచ్చాను. కానీ నువ్వు దూరమై నా కలను కన్నీళ్లుగా మార్చావు నాన్న. కానీ నా భర్త నీ బాధ్యతను తీసుకొని నెరవేరుస్తాను అని శబ్దం చేశాడు.
కానీ అమ్మలాంటి అత్తయ్య గారు నేను చదువుకోవడం వలన తను భయభ్రాంతులకు గురవుతుంది. ఒక సంఘటన జరగడం వలన అత్తయ్య గారు ఆ విధంగా భయపడుతున్నారు. తన అలా భయపడడంలో ఒక అర్థం ఉంది. నేను తనని అ బాధ పెట్టడంలో అర్థం లేదు. కాబట్టి ఇంతటితో నా చదువుని ఆపవేస్తున్న నాన్న నీ కలను నేను నెరవేర్చలేక పోతున్నా నన్ను క్షమించు వచ్చే జన్మంటూ ఉంటే నీ కడుపున మళ్ళీ పుట్టి నీ కలను నెరవేరుస్తా నాన్న అంటుంది. తన పుస్తకాలను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి రామ వస్తాడు. రామగారు నన్ను క్షమించండి. మీరు మా నాన్న బాధ్యత తీసుకొని నా చదువు కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. నా చదువు కోసం అప్పుచేసి అవమానాలపాలయ్యారు. నా చదువు కోసం మీ అత్తయ్య గారు మీ మీద పెట్టుకున్నా నమ్మకాన్ని పోగొట్టుకున్నారు తన ప్రేమకు దూరమయ్యారు. నా చదువు కోసం ఈ ఇంటికి, మీ అమ్మ ప్రేమ దూరమయ్యారు.
నా చదువు వల్ల అన్ని మీరు కష్టాలని ఎదుర్కొంటూ వస్తున్నారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. మీ కష్టానికి నేను ప్రతిఫలం ఇవ్వలేకపోతున్న నన్ను క్షమించండి రామ అని అంటూ ఏడుస్తుంది. అప్పుడు రామ జానకి గారు మీరు ఎందుకు బాధ పడుతున్నారు నేను అమ్మతో మాట్లాడతాను మీరు చదువుకునేలా చేస్తాను మీ కల నెరవేరుతుంది. మీరు బాధపడకండి. అని అంటాడు రామ. వద్దండి రామా గారు ఇప్పటికే అత్తయ్య గారిని ఎంతో బాధపెట్టాము. ఇంకా ఈ పాపం ఇంతటితో ఆపేయాలని దీనిని ఇంకా సాగించొద్దు. అత్తయ్య గారు మనం ఇలా చేసినందుకు తను ఎంతో క్షోభ అనుభవించారు. ఇకమీదట అత్తయ్య గారిని బాధ పెట్టవద్దండి అని జానకి అంటుంది. రామా అది కాదు జానకి గారు నేను అమ్మతో నెమ్మదిగా మాట్లాడి ఒప్పిస్తాను మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.