Janaki Kalaganaledu 1 Nov Today Episode : జానకిని ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని మల్లిక ప్లాన్.. జ్ఞానాంబ మల్లిక మాటలు వింటుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 1 Nov Today Episode : జానకిని ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని మల్లిక ప్లాన్.. జ్ఞానాంబ మల్లిక మాటలు వింటుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :1 November 2021,10:40 am

Janaki Kalaganaledu 1 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 నవంబర్, 2021 సోమవారం ఎపిసోడ్ 161 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకిని జ్ఞానాంబ ఎప్పుడు బయటికి పంపిస్తుందో తెలియదు.. అంటూ మల్లిక చికితతో అంటుండగానే జానకి వంటగదిలోకి వస్తుంది. వంట చేయడం నా పని. నేను చేస్తానులే నువ్వు వెళ్లు అంటుంది జానకి. దీంతో మల్లిక తెగ నవ్వేస్తుంది. జానకి వంట చేస్తుందట.. అయ్య బాబోయ్ అంటూ తెగ నవ్వుతుంది మల్లిక. రోజూ జానకమ్మ గారే కదా వంట చేసేది. ఆమె మాట్లాడిన మాటల్లో తప్పేముంది అంటుంది చికిత.

janaki kalaganaledu 1 november 2021 full episode

janaki kalaganaledu 1 november 2021 full episode

జానకి వడ్డిస్తేనే అత్తయ్య గారు తినడం లేదు. ఇక ఆమె వంట చేస్తే తింటారా? అని చెబుతుంది మల్లిక. దీంతో అత్తయ్య గారికి నా మనసులో ఉన్నది కోపం కాదు.. భవిష్యత్తులో నేను ఎటువంటి సమస్యలు తేకూడదని అత్తయ్య గారు భావిస్తున్నారు.. అని చెబుతుంది జనకి. నువ్వు చదువుకున్నాననే పొగరును బావ గారి మీద చూపిస్తే రేపు బావకు ఏదైనా అయితే.. అంటూ జానకి ఏదేదో మాట్లాడబోయేసరికి.. జానకి సీరియస్ అవుతుంది. మల్లిక ఆపు.. నోర్మూయ్.. నీకు బుద్ధి ఉందా? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు. ఇలా ఉదయం పూట అశుభం మాటలు మాట్లాడకూడదని తెలియదా? అంటూ జానకి మల్లికపై సీరియస్ అవుతుంది.

అయితే.. జానకి.. మల్లికకు వార్నింగ్ ఇవ్వడాన్ని జ్ఞానాంబ వింటుంది. జ్ఞానాంబ వింటుందని తెలిసి మల్లిక మాట మారుస్తుంది. అంతే అంతే.. అత్తయ్య గారు రావడం చూసి ఏం తెలియనట్టు మాటలు మారుస్తున్నావా? అత్తయ్య గారి బాధ పడలేక నేను ఏదో అలా మాట్లాడుతుంటే ఇలా మాట్లాడుతావా? అత్తయ్య గారు చూశారా? జానకి అప్పుడే తను చదువుకున్నానే అహంకారాన్ని చూపిస్తోంది.. చూశారా అత్తయ్య గారు అంటూ ప్లేట్ మొత్తం ఫిరాయిస్తుంది. అన్నీ అబద్ధాలు చెబుతుంది మల్లిక. అత్తయ్య గారు నేను అలా అనలేదు అంటూ జానకి ఏదో అనబోతే ఆపండి.. ఇది ఇల్లు అనుకుంటున్నారా? లేక సంత అనుకుంటున్నారా? అంటూ జ్ఞానాంబ సీరియస్ అవుతుంది. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు నన్ను నీ ఇంటిని. ఇక చాలు.. ఇప్పటికే మానసికంగా చంపేశారు. ఈ ఇంటి పరువును నడి వీధి దాకా తీసుకెళ్లి ఇంకా ఇంకా చంపకండి. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటే మంచిది అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 1 Nov Today Episode : రామాతో మాట్లాడు అంటూ జ్ఞానాంబకు చెప్పిన రజినీ

ఇంతలో రజినీ ఇంటికి వస్తాడు. రజినీ అన్నం తినరా అని చికిత అంటే తినను.. తినను అంటాడు రజినీ. ఇంతలో జ్ఞానాంబ వచ్చి ఏమైంది అని అడుగుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నీ వల్లే ఏడుస్తున్నాను పెద్దమ్మ అంటాడు. నువ్వు తప్పు చేశావు పెద్దమ్మ అంటాడు రజినీ. రామన్నను నీతో మాట్లాడొద్దు అని చెప్పి నువ్వు నిజంగానే తప్పు చేశావు పెద్దమ్మ. పెద్దమ్మ.. అన్నయ్యను క్షమించు. అన్నయ్యతో మాట్లాడు పెద్దమ్మ. నువ్వు మాట్లాడటం లేదని అక్కడ అన్నయ్య పిచ్చోడు అవుతున్నాడు. షాపులోనూ సరిగ్గా పనిచేయడం లేదు. కస్టమర్ వచ్చి ఒకటి అడిగితే మరొకటి ఇచ్చాడు. ఇందాక ఓ కస్టమర్ అన్నయ్యను తిట్టాడు తెలుసా? అన్నయ్యను అలా తిడుతుంటే బాధేసింది పెద్దమ్మ. నువ్వు అన్నయ్యతో మాట్లాడు.. లేకపోతే అన్నయ్య బతకలేడు పెద్దమ్మ అంటాడు రజినీ.

janaki kalaganaledu 1 november 2021 full episode

janaki kalaganaledu 1 november 2021 full episode

అన్ని మాటలు అన్నా కూడా జ్ఞానాంబ ఏమాత్రం స్పందించదు. భోం చేద్దువు పదా అని తీసుకెళ్లి రజినీకి భోజనం వడ్డిస్తుంది జ్ఞానాంబ. దీంతో నాకు వద్దు పెద్దమ్మ. నువ్వు అన్నయ్యతో మాట్లాడే వరకు నేను అన్నం తినను అంటాడు రజినీ. మా అమ్మానాన్న చనిపోతే ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చేరదీశావు. మేము ఏడిస్తే నువ్వు బాధపడ్డావు. మరి.. రామా అన్నయ్య ఏడుస్తుంటే నీకు బాధేయడం లేదా? అంటాడు రజినీ.

రామా అన్నయ్య అంటే నాకు ప్రాణం కదా. మరి.. అబద్ధం చెబితే అమ్మ మనసు ఎలా ఉంటుంది. నిన్న కాక మొన్న వచ్చిన మనిషి కోసం ఈ అమ్మను మోసం చేస్తే నా మనసుకు ఎంత కష్టంగా ఉంటుంది అంటుంది జ్ఞానాంబ. ఆ బాధను నేను ఎలా తట్టుకోలను అంటుంది.

రాత్రి కాగానే రామా ఇంటికి వస్తాడు. డోర్ బయటే కూర్చుంటాడు. ఇంట్లోకి కూడా వెళ్లడు. రేపు పూతరేకులు ఆర్డర్ చేయాలి. కానీ.. అవి అమ్మే బాగా చేస్తుంది అని జానకితో అంటాడు. మనం చేద్దాం అని జానకి అంటుంది కానీ.. రామా ఒప్పుకోడు. ఉదయాన్నే ఆ వ్యక్తి వచ్చి పూతరేకులు ఏవి అని ప్రశ్నిస్తాడు. కాలేదు.. టైమ్ పడుతుంది అని రామా అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది