Janaki Kalaganaledu 10 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 406 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ దగ్గర మంచిగా ఉంటూ.. తనకు నచ్చిన పనులు చేయాలని జానకి.. జెస్సీకి చెబుతుంది. ఏం చేయాలో.. ఎలా చేయాలో అన్నీ చెబుతుంది. దీంతో సరే అని తను చెప్పినట్టే ఉదయాన్నే రెడీ అయి అమ్మవారికి ప్రసాదం తయారు చేస్తూ ఉంటుంది జెస్సీ. జ్ఞానాంబ వచ్చి తను ఏం చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మల్లిక అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నావు జెస్సీ అని అడుగుతుంది. దీంతో అమ్మవారికి ప్రసాదాలు చేస్తున్నా అంటుంది. అదేంటి.. నిన్న కాక మొన్న వచ్చిన జెస్సీ కూడా పోలేరమ్మను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తోందా అని అనుకుంటుంది. ఈరోజు చేయాల్సిన ప్రసాదం ఇది కాదు జెస్సీ అంటుంది మల్లిక.
ఇవన్నీ జ్ఞానాంబ వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జానకి, రామా ఇద్దరూ వస్తారు. అమ్మవారి తొమ్మిది అవతారాల్లో ప్రతి రోజు ఏ ప్రసాదం చేయాలో అవన్నీ మల్లికకు చెబుతుంది జెస్సీ. ఇవన్నీ విని మల్లిక షాక్ అవుతుంది. జ్ఞానాంబ కూడా షాక్ అవుతుంది. తనకు జెస్సీ నచ్చుతుంది. జానకి సంతోషిస్తుంది. మల్లికకు ఏం చేయాలో అర్థం కాదు. అమ్మో అమ్మో.. అని అనుకుంటుంది మల్లిక. జెస్సీ నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ కరెక్ట్ గా చెప్పావో లేదో ఒకసారి చూసుకో అంటుంది మల్లిక. దీంతో అన్నీ చూసే నేను నైవేద్యం చేస్తున్నా అంటుంది. దీంతో ఏమో జెస్సీ ఏదైనా తేడా అయితే అత్తయ్య గారు ఊరుకోరు అంటుంది. అయినా నీకు ఈ పనులు అన్నీ ఎందుకు చెప్పు.. అనవసరంగా అత్తయ్య గారితో తిట్లు తినడం కాకపోతే అని అంటుంది మల్లిక.
ఇంతలో జ్ఞానాంబ మల్లిక అంటూ గట్టిగా పిలుస్తుంది. రా ఇలా అంటుంది. అసలు ఏవిధంగానూ నీ నోటికి తాళం ఉండదా మల్లిక అంటూ సీరియస్ అవుతుంది. పెళ్లి అయి ఇన్ని రోజులు అయినా నీకు ఎలాగూ ఇవన్నీ తెలియదు. తెలుసుకోవాలన్న కోరికా నీకు లేదు అంటుంది.
నిన్న కాక మొన్న ఇంట్లోకి అడుగుపెట్టి ఇవన్నీ తెలుసుకొని పని చేస్తుంటే అభినందించాల్సింది పోయి.. తన మీద లేనిపోనివి చెబుతావా? నేను పూజ మొదలు పెట్టాలి. అమ్మవారికి పూజదండ కట్టి తీసుకురా వెళ్లు అని మల్లికను అక్కడి నుంచి పంపిస్తుంది.
తర్వాత జానకిని వెళ్లి చదువుకో అని చెబుతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత చాలా థాంక్స్ అక్క అంటుంది జెస్సీ. రాత్రి నువ్వు నీ చదువును కూడా పక్కన పెట్టి నువ్వు ఇవన్నీ నాకు నేర్పించబట్టే అత్తయ్య గారు నన్ను మంచి అభిప్రాయంతో చూశారు అక్క అంటుంది జెస్సీ.
నువ్వు హ్యాపీ కదా అంటుంది జానకి. దీంతో చాలా చాలా హ్యాపీ అక్క అంటుంది జెస్సీ. దీంతో సరే నైవేద్యం తయారు చేసి అత్తయ్య గారికి తీసుకెళ్లు అంటుంది జానకి. ఇవన్నీ చూసి అమ్మో.. అఖిల్ ను అస్త్రంగా వాడుకొని జెస్సీని కట్టడి చేయాలి అని అనుకుంటుంది మల్లిక.
వెళ్లి అఖిల్ ను పిలుస్తుంది. మీ ఇంట్లో నువ్వు మీ అమ్మగారికి శత్రువు అవుతుంటే తట్టుకోలేక నేను మాట్లాడటానికి వచ్చాను. జెస్సీ గురించే కోపం కాదు.. జెస్సీ వల్ల నువ్వు మీ అమ్మగారికి శాశ్వతంగా దూరంగా ఉండాల్సి వస్తుందేమో అని నా ఆవేదన అంటుంది మల్లిక.
జెస్సీ మీ అమ్మగారికి దగ్గరవ్వాలని చెప్పి రకరకాల వేషాలు వేస్తోంది అని చెబుతుంది మల్లిక. పూజలు చేయడం, ప్రసాదాలు చేయడం ఇవన్నీ చేస్తుంది అంటుంది. అత్తయ్య గారి దృష్టిలో మంచిదాన్ని అని నిరూపించుకోవడానికి చాలా చేస్తుంది అంటుంది. దీంతో అమ్మకు దగ్గరవడం మంచిదే కదా వదిన అంటాడు అఖిల్.
తను దగ్గరవడంలో తప్పు లేదు కానీ.. పెళ్లికి ముందే మీరు తప్పు చేశారని అత్తయ్య గారు మీ మీద కోపంగా ఉన్నారు. కానీ.. జెస్సీ మాత్రం తన తప్పేం లేదని, నీ తప్పే ఉందని చెప్పి అత్తయ్య గారికి దగ్గరవ్వాలని అనుకుంటోంది. అలా అయితే మీ అమ్మ గారి దృష్టిలో జీవితాంతం చెడ్డవాడిగానే మిగిలిపోతావు అఖిల్ అంటుంది మల్లిక.
తన స్వార్థం కోసం నిన్ను మీ అమ్మగారికి దూరంగా ఉంచడానికి గట్టిగా ప్రయత్నం చేస్తోంది అఖిల్ అంటుంది మల్లిక. మరోవైపు రామా.. జానకి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. జానకి చదువు మీద కాకుండా అనవసర విషయాల మీద దృష్టి పెడుతోందని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.