janaki kalaganaledu 19 august 2022 full episode
Janaki Kalaganaledu 11 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా విడుదలైంది. 364 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. విష్ణు చికెన్ బిర్యానీ, చికెన్ మంచూరియా అన్ని తీసుకొచ్చి మల్లికకు ఇస్తాడు. దాంతో మల్లిగా కూర్చుని మంచిగా తింటుంది. విష్ణు మల్లికను ఆ కోడి ఆల్రెడీ సచ్చింది నెమ్మదిగా తినవే అని అంటాడు. అప్పుడు మల్లికా ఈ కోడిలో మీ అమ్మ కనిపిస్తుంది నాకు. అని అంటూ జానకిని ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తుంది అందుకే నాకు మండిపోతుంది. అంటుంది. మల్లికకు పోలమారుతుంది. అప్పుడు విష్ణు బయటకు వచ్చి నీళ్లు తీసుకుని వెళ్తుండగా ఉండగా.. ఏంటి విష్ణు అంత కంగారు పడుతున్నావ్ అని అంటాడు గోవిందరాజు అడుగుతాడు. అప్పుడు విష్ణు మల్లిక తింటుంటే అడ్డం పడింది అందుకే నీళ్లు తీసుకెళ్తున్న అని అంటాడు. అప్పుడు గోవిందరాజు, జ్ఞానంబ మల్లిక రూమ్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారు. విష్ణు త్వరగా తినవే మా అమ్మ వచ్చి చూసిందంటే నిన్ను చంపేస్తుంది అని అంటాడు.
అప్పుడు మల్లికా మీ అమ్మకి భయపడి పోయి.. గజగజ వణికిపో తాను అనుకుంటున్నావా. అని డైలాగులు వదులుతు.. జ్ఞానంబను మల్లిక చూస్తుంది. అప్పుడు మల్లికా విష్ణు, భయంతో వణికిపోతూ ఉంటారు. జ్ఞానంబ మల్లికను నీకు బుద్ధుందా ఈ ఇంట్లో ఆచారాలన్నీ మంట కలుపుతావా.. నీకు పెళ్లైన రోజే చెప్పాను. ఇంట్లో మాంసాహారాన్ని ముట్టరని. అని అంటుంది. అప్పుడు మల్లికా నేను కూడా మాంసాహారాన్ని తినకుండా ఉండలేను అని చెప్పాను కదా అత్తయ్య గారు. నువ్వు ఉండలేవని నాకు తెలుసు అందుకే నిన్ను ఎప్పుడైనా తినాలనిపిస్తే బయట తిను ఇంట్లోకి తీసుకురాకు అని చెప్పాను కదా. ఆరోజు కూడా అంతే వ్రతం జరుగుతుండగా ఇంట్లోకి తీసుకొచ్చి తిన్నావు. నీకు ఇంటి సాంప్రదాయాలు అంటే లెక్కలేదు. అని మండిపోతూ ఉంటుంది. జ్ఞానాంబ. అప్పుడు మల్లికా నేను బయట తింటానన్నా అత్తయ్య గారు. కానీ ఈయనే ఇంట్లోకి తీసుకువచ్చారు అని విష్ణు మీద నెట్టేస్తుంది. అప్పుడు విష్ణు కంగారుపడుతూ బయట తింటే అందరూ చూస్తారని నేనే ఈలా చేశాను అని అంటాడు.
Janaki Kalaganaledu 11 August 2022 Full Episode
జ్ఞానాంబ ఈ రెండు రోజులు మీరు ఇక తిండి తినొద్దు అని చెప్తుంది. కట్ చేస్తే జానకి చదువుతుండగా.. రామ జానకి కోసం హెడ్ లైట్ను తీసుకొని వచ్చి ఇస్తాడు. అప్పుడు జానకి మీరు నాకు దొరకడం అదృష్టం అండి అని రామాను పొగుడుతూ కౌగిలించుకుంటుంది. అప్పుడు రామ సమయం వృధా అవుతుంది ఇక చదువుకోండి అని అంటాడు. అప్పుడు జానకి ఇది చదువుకునే టైం కాదు భార్య భర్తలు ఏకాంతంగా ఉండే సమయం అని తన కౌగిలిని వదలకుండా అలాగే ఉంటుంది. రామ మాత్రం కంగారు పడిపోతూ ఉంటాడు. కట్ చేస్తే జానకి. జ్ఞానంభ, గోవిందరాజుకు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు గోవిందరాజు చూసావా జ్ఞానం జానకి ఎంత చక్కగా ఇంటి పనుల్ని అత్తమామల్ని చూసుకుంటుందో అని అంటాడు. ఇంతలో వెన్నెల మోడల్ డ్రెస్ వేసుకొని కాలేజీకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ తనని చూసి వెన్నెల ఏంటి ఆ బట్టలు మార్చుకొని వెళ్ళు అని తిడుతుంది. కట్ చేస్తే జానకి చక చక వంట చేసి అకాడమీకి వెళ్లడానికి రెడీ అయ్యి జ్ఞానంంబ, గోవిందరాజు కాళ్లకు నమస్కరించి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్తుంది.
అప్పుడు చికిత జానకమ్మ గారు మీరు టిఫిన్ బాక్స్ మర్చిపోయారు అని అంటుంది. థాంక్స్ చికిత అని బాక్స్ తీసుకుంటుంది. దాంతో జ్ఞానాంబ మొదటి రోజే టిఫిన్ బాక్స్ మర్చిపోయావు ఇక నేను చెప్పిన విషయాలను , నీ భర్తను కూడా మర్చిపోతావేమో అని అంటుంది. అప్పుడు రామ అలా ఎప్పటికీ చేయదమ్మ జానకి అని అంటాడు. కావాలని చెయ్యకపోవచ్చు రామా అలా పరధ్యానంలో పడి మర్చిపోవచ్చు అని అంటుంది. సరేలే గాని నేను కాలేజీలో నీ చదువు గురించి మాట్లాడాలి కదా నేను కూడా వస్తా అని జ్ఞానంబ అంటుంది. ఇదంతా చూసి మల్లిక మండిపోతూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ చికిత మల్లికను రెండు రోజులు తినొద్దు అని చెప్పాను. ఒక కన్నేసి ఉంచు అని అంటుంది. అప్పుడు సరే అమ్మగారు అని చికిత అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.