janaki kalaganaledu 11 february 2022 full episode
Janaki Kalaganaledu 11 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 ఫిబ్రవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 235 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పూజ పూర్తయ్యాక.. రామా, జానకి ఇద్దరూ కారులో తిరుగుప్రయాణం అవుతారు. ఇష్టాలను వదిలేసుకోవడం.. కలలను చంపేసుకోవడం అంటే.. ఒకరకంగా ప్రాణాలను వదిలేసుకోవడమే అత్తయ్య. కానీ.. మీ కొడుకు కోసం మీరు ఎంతలా పరితపిస్తున్నారో నాకు తెలుసు. అందుకే.. దీపంతో పాటే.. ఐపీఎస్ కలను వదిలేశాను అత్తయ్య గారు అని అనుకుంటుంది జానకి. ఇంతలో సడెన్ గా కారు ఆపేస్తాడు రామా. చెప్పండి జానకి గారు అని అడుగుతాడు. ఏ విషయం అని అడుగుతుంది జానకి. అమ్మ రాగానే మీరు చెప్పడం ఆపేశారు కదా. ఆ విషయం గురించే చెప్పండి అని అడుగుతాడు రామా. ఆ విషయం గురించి ఇప్పుడు ఎందుకండి. ఇక.. ఆ విషయాన్ని వదిలేయండి అని అంటుంది జానకి.
janaki kalaganaledu 11 february 2022 full episode
నా ఐపీఎస్ ఇష్టాన్ని నేనే వదిలేశాను. ఇక మీరు ఆలోచించకండి అని రామాకు చెప్పేస్తుంది జానకి. వదిలేశాను అని నా కళ్లలోకి చూసి ధైర్యంగా చెప్పగలరా అని అంటాడు రామా. రామా గారు.. ఆ ప్రస్తావనను వదిలేద్దామని ఎంత చెప్పినా మీరు వినడం లేదు ఎందుకు. గుడిలో చెప్పబోయారు కదా.. మళ్లీ ఇంతలోనే ఏం జరిగింది జానకి గారు అని అంటాడు రామా. దీంతో కారు డోర్ తీసి అక్కడి నుంచి బయటికి వెళ్తుంది జానకి. మరోవైపు చనిపోవడానికి పెద్ద కొండ ఎక్కుతారు దిలీప్, వెన్నెల. జానకి గారు నాకు కావాల్సింది మీ మౌనం కాదు. మీ సమాధానం కావాలి అంటాడు రామా. జానకికి ఏం చెప్పాలో అర్థం కాదు. చెప్పండి జానకి గారు అంటాడు రామా. ఇంతలో జానకికి ఫోన్ చేస్తుంది వెన్నెల. ఏడుస్తూ మాట్లాడే సరికి.. వెన్నెల ఏమైంది.. ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడుగుతుంది జానకి.
నా కారణంగా నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు. నిన్ను బాధపెట్టాను నన్ను క్షమించు వదిన అంటుంది వెన్నెల. అది జరిగిపోయిన విషయం. ఇప్పుడు నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే.. ఇక నేను ఉండను కదా వదిన. చివరి సారిగా నీకు సారీ చెప్పాలనిపించింది అంటుంది వెన్నెల.
దీంతో వెన్నెల ఏం మాట్లాడుతున్నావు అంటూ అడుగుతుంది జానకి. నువ్వు ఉండకపోవడం ఏంటి అంటుంది. అసలు ఏం జరిగింది వెన్నెల చెప్పు అంటుంది. ఇంతలో ఫోన్ లాక్కుంటాడు రామా. వెన్నెల ఏమైందమ్మా.. నేను ఇప్పుడే వస్తున్నాను. నువ్వు ఇక్కడున్నావు అని అడుగుతాడు రామా. దీంతో చావుకు దగ్గర్లో ఉన్నాను అన్నయ్య అంటుంది వెన్నెల.
వెన్నెల.. ఏంటమ్మా ఆ మాటలు అంటుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు. ఏం జరిగిందో ఈ అన్నయ్యకు చెప్పు. నేను చూసుకుంటాను. ఈ కష్టాలను ఈ అన్నయ్య పరిష్కరిస్తాడు. ఏమైందో చెప్పు అంటాడు రామా. నీకు ఏమైందో చెప్పమ్మా. నీ బాధేంటో నాకు చెప్పు అంటాడు రామా.
ఇప్పుడు పరిస్థితి నీ చేతుల్లో కూడా లేదు అన్నయ్య అంటుంది వెన్నెల. అలా బాధపడొద్దు అంటాడు. దీంతో నా ప్రేమ విషయం అమ్మకు తెలిసిపోయింది. నాకు ఎంగేజ్ మెంట్ ఫిక్స్ చేసింది అంటుంది. దీంతో నేను మాట్లాడుతాను.. నేను వచ్చి మాట్లాడుతాను అంటారు. కానీ.. వెన్నెల వినదు.
నా కారణంగా నువ్వు ఇప్పటికే చాలా బాధపడ్డావు. నా కారణంగా మరోసారి బాధపడే పరిస్థితి రావద్దు అంటుంది. నా సమస్యకు చావే పరిష్కారం వదిన అంటుంది. దిలీప్ లేకుండా నేను బతకలేను. అందుకే ఇద్దరం కలిసి చనిపోబోతున్నాం అంటుంది వెన్నెల.
వెంటనే ఫోన్ కట్ చేస్తుంది వెన్నెల. మళ్లీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మరోవైపు చనిపోయేందుకు వెన్నెల, దిలీప్ ఇద్దరూ సిద్ధం అవుతారు. వెన్నెల మాట్లాడుతున్నప్పుడు శంఖం సౌండ్ వినిపించింది. వాళ్లు ఏదో శివాలయం దగ్గర ఉండి ఉంటారు. వెంటనే వెళ్లి వెతుకుదాం పదండి అంటుంది. దీంతో కారులో బయలుదేరుతారు ఇద్దరు.
మరోవైపు వెన్నెల, దిలీప్ ఇద్దరూ పెద్ద కొండ మీదికి ఎక్కుతారు. ఇద్దరూ చేతుల్లో చేయి వేసుకుంటారు. ప్రేమంటే కొత్త జీవితంలోకి దారి చూపిస్తుందనుకున్నాను కానీ.. జీవితమే లేకుండా చేస్తుందనుకోలేదు అంటుంది వెన్నెల. నన్ను ప్రేమించే మనుషులున్నారు కానీ.. నా ప్రేమను అర్థం చేసుకొని ఆశీర్వదించే మనుషులు లేరు అని దిలీప్ తో అంటుంది వెన్నెల.
వెన్నెల.. ఈ జన్మలో మనం ఈ ప్రేమను గెలిపించుకోలేకపోతున్నాం. కనీసం వచ్చే జన్మలో అయినా మన ప్రేమను పెళ్లిగా మార్చుకుందాం అంటాడు దిలీప్. ఇంతలో శంఖం సౌండ్ వినిపిస్తుంది జానకికి. వెంటనే కారు ఆపి.. శంఖం సౌండ్ వినిపించడంతో అటువైపు వెళ్తారు ఇద్దరూ. నడుచుకుంటూ వెళ్తుంటారు.
వెన్నెల అంటూ పిలుస్తారు. కొండ మీదికి ఎక్కి చూస్తారు. దీంతో పెద్ద కొండ మీద దూకడానికి రెడీగా ఉన్న వెన్నెల, దిలీప్ ను చూస్తారు. వెంటనే ఆ కొండ మీదికి ఎక్కుతారు. దూకపోతున్న వాళ్లను ఆపేస్తారు. వెన్నెల.. ఎందుకు మమ్మల్ని ఆపేశారు. మమ్మల్ని చనిపోనివ్వండి అంటుంది వెన్నెల.
మీ అన్నయ్య చూడు ఎంత బాధపడుతున్నాడో. ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు వీళ్లెవరూ నీకు గుర్తుకురాలేదా అంటుంది జానకి. తెలుసు వదిన. అమ్మకు నేనంటే ఎంత ప్రేమో.. ఎంత ప్రాణమో.. నాన్నకు నేనంటే ఎంత ఇష్టమో అన్నీ నాకు తెలుసు అంటుంది వెన్నెల.
దీంతో నేను అమ్మతో మాట్లాడి ఒప్పిస్తా అని వెన్నెలకు చెబుతాడు రామా. నువ్వు ఇంటికెళ్లు. నేను ఫోన్ చేస్తా అంటాడు రామా. మరోవైపు వెన్నెల నిశ్చితార్థం కోసం రామచంద్రాపురం వెళ్తారు జ్ఞానాంబ, గోవిందరాజు. పంతులు ముహూర్తం కోసం చూస్తుంటాడు.
మరోవైపు వెన్నెలను కారు ఎక్కు అంటాడు రామా. కారు ఎక్కు అమ్మా.. ఇంటికి వెళ్దాం అంటాడు. భయం వేస్తోంది అన్నయ్య అంటుంది వెన్నెల. రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందంటాడు పంతులు. దీంతో దాన్నే ఖాయం చేసుకుంటారు.
Kuja Transit : 2025 వ సంవత్సరంలో జూలైలో 28న మొదటి సోమవారం రోజున కుజసంచారం జరిగింది. ఇది శ్రావణ…
Brahmotsavams : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఏదులాబాద్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ గోదాదేవి సమేత రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు అత్యంత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, రాజకీయ వేధింపులను నమోదు చేసేందుకు వైసీపీ ప్రత్యేక యాప్ను…
RK Roja : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని…
Flipkart Freedom Sale : ఆగస్టు 2 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్కార్ట్ Flipkart ఫ్రీడమ్ సేల్లో వినియోగదారులకు ఊహించని డీల్స్…
Kuppam Pulivendula : ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర…
Nagarjuna Sagar : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ భారీ వరద నీటితో నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఎగువ…
Hyderabad Sperm Scam : సికింద్రాబాద్లో ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరిట చోటుచేసుకున్న శిశు వ్యాపార దందా…
This website uses cookies.