Janaki Kalaganaledu 11 Oct Today Episode : తనను క్షమించమంటూ జానకిని వేడుకున్న తన అన్న యోగి.. తన తమ్ముడు చనిపోవడంతోనే జ్ఞానాంబ ఆ నిర్ణయం తీసుకుందా?
Janaki Kalaganaledu 11 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 అక్టోబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 146 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి సర్టిఫికెట్లు తన దగ్గర ఉన్నాయని జ్ఞానాంబకు ఫోన్ చేసి మల్లిక చెబుతుంది. ముందు నువ్వు ఆ కాగితాలు తీసుకొనిరా. నేను మన తోటలో ఉన్నా.. అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో సరే అత్తయ్య గారు అని చెప్పి మల్లిక బయలుదేరుతుంది. మరోవైపు రామా, జానకి.. ఇద్దరూ ఓ రెస్టారెంట్ కు వెళ్తారు. అక్కడ భోజనం చేస్తూ.. మనం మళ్లీ పెళ్లి చేసుకుందామా? అని రామాను అడుగుతుంది జానకి.

janaki kalaganaledu 11 october 2021 full episode
కట్ చేస్తే జ్ఞానాంబ తోటలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి అని అనుకుంటుంది. జానకికి ఏ శిక్ష విధించాలని ఆలోచిస్తుంటుంది. జానకి, రామా సంతోషంగా భోజనం చేస్తుంటారు. ఇక.. మల్లిక వెతుక్కుంటూ జ్ఞానాంబ దగ్గరికి వస్తుంది. జానకి చదువుకున్న సర్టిఫికెట్లను పట్టుకొని జ్ఞానాంబ దగ్గరికి వస్తుంది. జానకి గురించి ఇంకా మరిన్ని నూరిపోయాలని అనుకుంటుంది మల్లిక. అయ్యో అత్తయ్య గారు ఏంటండి.. మీరు ఇలా పొలంలో కూర్చున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అత్తయ్య గారు అంటుంది మల్లిక.జానకిని మీరు కోడలుగా కాదు.. కూతురుగా చూసుకున్నారు. కోడలు మీద అంత ప్రేమను చూపించిన మీకు.. జానకి అలా అబద్ధాలు చెప్పి మోసం చేసిందంటే మీరు ఎలా తట్టుకోగలరు అత్తయ్య గారు.
దేవత లాంటి మీకు అబద్ధాలు చెప్పడానికి ఆ జానకికి మనసు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు అత్తయ్య గారు. చూడండి.. జానకి డిగ్రీ పాస్ అయిన మార్కుల లిస్టు. మీరే చూడండి.. అని అంటుంది. మీ తమ్ముడు గారి కంటే ఎక్కువ చదువుకున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే.. తన అవమానానికి తట్టుకోలేక.. మీ తమ్ముడు గారు చనిపోవడం చూసి.. మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ.. ఇప్పుడు జానకి మాత్రం 5వ తరగతి చదివిందని అబద్ధం చెప్పి బావ గారిని చేసుకుంది. మరి.. బావ గారికి ఏదైనా జరిగితే మీరు తట్టుకొని బతకగలరా? అని అంటుంది జ్ఞానాంబ.
Janaki Kalaganaledu 11 Oct Today Episode : జానకితో మాట్లాడిన తన అన్న యోగి
ఏం చేయాలో నేను చెప్తాను.. ఈ విషయం గురించి నువ్వు నోరు విప్పకూడదు. సరే.. పదా అని అంటుంది జ్ఞానాంబ. కారులో జ్ఞానాంబ, మల్లిక బయలుదేరుతారు. భోజనం చేశాక.. రామా, జానకి కూడా బైక్ మీద బయలుదేరుతారు. మధ్యలో బండి ఆపుతాడు రామా. మీరు ఏదో సర్ ప్రైజ్ అన్నారు కదా. నేను కూడా మీకు ఓ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాను అంటాడు. ఏంటి అని అడగడంతో మీ అన్నయ్య గారు మాట్లాడాలి అన్నారు అంటాడు. వెంటనే జానకి అన్నయ్యకు వీడియో కాల్ చేస్తాడు. నన్ను క్షమించు జానకి అని అంటాడు తన అన్నయ్య. నా మనసులో ఉన్న బాధ పోయేవరకు మాట్లాడనివ్వు. నేను అమెరికా వెళ్లడం కోసం నీకు పెళ్లి చేసి వదిలించుకోవాలని అనుకున్నాను. అది ఒకరకంగా స్వార్థం మాత్రమే. అందుకే నువ్వు చదువుకున్నది 5వ తరగతి వరకే అని చెప్పాను. మంచి భర్త, మంచి కుటుంబం.. ముఖ్యంగా మీ భర్త ఒక దేవుడు.. అని చెబుతాడు. ఇక నాకు నా చెల్లలి జీవితం గురించి ఎలాంటి సందేహం లేదు. ఇక నేను నిశ్చింతగా ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు జానకి అన్నయ్య.

janaki kalaganaledu 11 october 2021 full episode
అసలు మీ అమ్మ ఎందుకు కోడలు చదువుకోకూడదని అనుకుంటుంది. ఆడవాళ్ల చదువుకు మీ అమ్మ వ్యతిరేకం కాదు కానీ.. ఎందుకు తన కోడళ్లు మాత్రం చదువుకోకూడదు.. అని అనుకుంది అని అడుగుతుంది జానకి. దీంతో తన మామయ్యకు జరిగిన విషయాన్ని చెబుతాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.