Janaki Kalaganaledu 12 Nov Today Episode : నీ భార్యకు ఎందుకు విడాకులు ఇస్తున్నావంటూ పనోడిని నిలదీసిన జానకి.. తన మనసులోని మాటలను జ్ఞానాంబకు అర్థమయ్యేలా పనోడికి చెప్పిందా?
Janaki Kalaganaledu 12 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 నవంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 170 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మైరావతి రాత్రంతా బయటే పడుకోవాలని జానకికి శిక్ష విధిస్తుంది. దీంతో జానకి ఇంటి బయట చలిలో వణుకుతూ పడుకుంటుంది. రామా.. జానకి అలా పడుకోవడం తట్టుకోలేకపోతాడు. ఏం చేయాలో తనకు అర్థం కాదు. జానకి గారు చలిలో పడుకొని ఉన్నారు. దుప్పటి తీసుకెళ్లి ఇద్దాం అనుకుంటాడు. దీంతో దుప్పటి తీసుకొని డోర్ వద్దకు వెళ్లబోయేసరికి.. అప్పుడే జ్ఞానాంబ దుప్పటి తీసుకెళ్లి జానకికి కప్పుతుంది.
జ్ఞానాంబ.. జానకికి దుప్పటి కప్పడం చూసిన రామా.. షాక్ అవుతాడు. తర్వాత చాలా సంతోషిస్తాడు. అమ్మ.. జానకి గారంటే నీకెంతిష్టమో నాకు తెలుసమ్మా. కానీ చదువుకున్న అహంతో జానకి గారు నన్ను ఎలా అవమానిస్తారో అనే భయం. ఆ భయమే జానకి గారి మీద ఉన్న ప్రేమను కప్పేస్తోంది. కానీ.. ఏదో ఒకరోజు ఆ భయం పోతుందమ్మా.. అని తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత జ్ఞానాంబ… డోర్ వేసి లోపలికి వెళ్లిపోతుంది.
జ్ఞానాంబ వెళ్లిపోయాక.. రామా కిటికీలోనుంచి జానకిని చూస్తాడు. అంతలో జానకి లేస్తుంది. దుప్పటి ఎవరు కప్పారని అనుకుంటుంది. కిటికీ పక్కన ఉన్న రామాను జానకి చూస్తుంది. ఇద్దరూ కాసేపు సైగలు చేసుకుంటారు. తర్వాత జానకి నిద్రపోతుంది. రామా తనను కాసేపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. నావల్లే మీరు ఇలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అని అనుకొని రామా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఉదయం అవగానే.. జానకమ్మ గారు అంటూ గోదావరి వచ్చి లేపుతుంది. లేవండమ్మా.. పెద్దమ్మ గారు వస్తున్నారు అంటుంది. ఓహో లేచినావా.. అంటుంది మైరావతి. వెళ్లు.. అంటుంది మైరావతి. దీంతో అలాగే అని చెప్పి వెళ్లిపోతుంది. ఉదయం నుంచి జానకి ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. రామా చూసి తన దగ్గరికి వస్తాడు. తను నీళ్లు తోడుతుంటే సాయం చేస్తాడు.
Janaki Kalaganaledu 12 Nov Today Episode : రామాతో కాసేపు సరసాలు ఆడిన జానకి
తర్వాత కాసేపు ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. రామా అస్సలు నవ్వకుండా ఉండేసరికి.. రామాతో కాసేపు సరసాలు ఆడుతుంది జానకి. రామా గారు.. ఇష్టమైన చోట కష్టాలు కూడా చాలా హాయిగా ఉంటాయి అండి. అపురూపమైన నా భర్త ప్రేమను జీవితాంతం పొందడం కోసం ఇలాంటివి నేను ఆనందంగా ఎదుర్కొంటాను అండి అంటుంది జానకి.
ఇంతలో జానకి అని జ్ఞానాంబ పిలుస్తుంది. అత్తయ్య గారు అని వెళ్లి కాళ్లమీద పడుతుంది. రాత్రి నాకు దుప్పటి కప్పింది మీరే అని మీ అబ్బాయి గారు ఇప్పుడే చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది అత్తయ్య గారు.. అంటుంది. నీకు దుప్పటి కప్పింది మానవత్వంతో. అంతే.. అని చెబుతుంది జ్ఞానాంబ.
ఉదయమే గోవిందరాజు, జ్ఞానాంబ సరదాగా మాట్లాడుకుంటారు. జ్ఞానం వెళ్లి టీ పెట్టు అంటాడు. మల్లిక టీ పెడుతుంది. చికిత చూసి.. మీరేంటి టీ పెడుతున్నారు అంటూ అడుగుతుంది. దీంతో తను ఏదో చెబుతుంది. మరోవైపు మైరావతి ఇంటికి ఓ పని వ్యక్తి వచ్చి నా భార్యకు విడాకులు ఇవ్వాలి రండి.. మాట్లాడాలి అని పిలుస్తాడు.
దీంతో జానకి కలగజేసుకొని.. నీ భార్యకు ఎందుకు విడాకులు ఇస్తున్నారు అని అడుతుంది జానకి. మా అమ్మ మాటే నాకు వేదవాక్కు అండి. అందుకే.. నా భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. మీ అమ్మ మీద ఉన్నది మీకు నిజమైన ప్రేమ అయితే.. మీ భార్యను కూడా మీరు అర్థం చేసుకుంటారు అంటుంది జానకి. మీ భార్య పరిస్థితిని మీ అమ్మ గారికి అర్థం అయ్యేలా చెబుతారు. అలా కాదని చచ్చినట్టు పనులు చేయమని అనడం ప్రేమ అవ్వదు.. హింస అవుతుంది అని చెబుతుంది జానకి. దీంతో అక్కడే ఉన్న జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.