
janaki kalaganaledu 13 december 2021 episode
Janaki Kalaganaledu 13 Dec Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం ఎపిసోడ్ 13 డిసెంబర్ 2021, 190 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి.. కేకుల తయారీ పేరుతో రాజమండ్రి వెళ్లి చదువుకుంటున్న విషయం తెలిసిందే. కాకపోతే.. కేకుల ముసుగులో జానకి ఏదో చేస్తోందని అనుకుంటుంది మల్లిక. అందుకే.. అడ్రస్ తీసుకొని మరీ.. రాజమండ్రికి వెళ్తుంది. అక్కడ కేకుల షాపును వెతికి.. ఆ షాపులో కేకులు నేర్చుకుంటున్న జానకిని పిలవమంటుంది. కానీ.. ఈ జానకి కాకుండా.. ఒక ముసలావిడ వస్తుంది. మీరు కాదండి.. ఆత్రేయపురానికి చెందిన జానకి అని చెబుతుంది. దీంతో.. మా దగ్గర పనిచేసేది ఈ ఒక్క జానకే అని చెబుతాడు యజమాని. దీంతో మల్లికకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.
janaki kalaganaledu 13 december 2021 episode
జానకి కేకులు నేర్చుకోవడానికి అని చెప్పి ఏదో చేస్తోందని తనకు తెలిసిపోతుంది. దీంతో వెంటనే ఈ విషయం పోలేరమ్మకు చెప్పాలని అనుకుంటుంది. ఇంతలో ఆత్రేయపురంలో కేకుల పోటీలు జరుగుతున్నాయని ఓ వ్యక్తి చెబుతాడు. పాంప్లెంట్లు తీసుకుంటుంది. అత్తయ్య గారి దగ్గర బుక్ చేయడానికి ఇదే కరెక్ట్ అనుకుంటుంది. మరోవైపు రామా, జానకి.. ఇద్దరూ రాజమండ్రికి బయలుదేరుతారు. కానీ.. జానకికి ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ.. నేను కేకులు ఎలా నేర్చుకుంటున్నానో అని తెలుసుకోవడం కోసం.. అత్తయ్య గారు కేకుల షాపునకు ఫోన్ చేస్తే ఎలా.. అని అడుగుతుంది. మీరేం టెన్షన్ పడకండి జానకి గారు.. నేను ముందే కేకుల షాపు అతడితో మాట్లాడి పెట్టాను అంటాడు రామా.
మరోవైపు పల్లవి తన అమ్మమ్మ ఇంటి నుంచి వస్తుంది. జ్ఞానాంబ.. పల్లవికి జెడ వేస్తుంటుంది. ఇంతలో గోవింద రాజు వచ్చి.. పల్లవి ఎప్పుడు వచ్చావు అని అడుగుతాడు. ఇప్పుడే వచ్చాను నాన్న అంటుంది. సరే.. పరీక్షల రిజల్ట్స్ వచ్చాయా అని అడుగుతాడు. రాలేదు ఇంకా అంటుంది పల్లవి. సరే.. నువ్వు లోపలికి వెళ్లు.. నేను ఒక సారి అమ్మతో మాట్లాడాలి అంటాడు గోవింద రాజు.
పక్కనే ఉన్న రామచంద్రాపురానికి చెందిన సత్యనారాయణ రాజు ఉన్నారు కదా.. వాళ్ల అబ్బాయికి మన వెన్నెలను అడుగుతున్నారు అంటాడు. అబ్బాయి ఏం చేస్తాడు అంటే.. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ అట. జీతం గట్రా బాగానే వస్తుందట.. అంటాడు. కానీ.. అబ్బాయి గుణగణాలు తెలుసుకోవాలి కదా. అబ్బాయి గురించి కనుక్కోండి. అబ్బాయి మంచి వ్యక్తి అయితే ఇద్దాం అంటుంది జ్ఞానాంబ.
కట్ చేస్తే.. మల్లిక.. వెంటనే జ్ఞానాంబ దగ్గరికి వస్తుంది. అత్తయ్య.. రేపు కేకుల పోటీలు ఉన్నాయి. జానకిని పోటీలో నిలుపాలి అంటుంది. ఈ పోటీలో ఖచ్చితంగా జానకి ప్రైజ్ కొడుతుంది. మన షాపునకు అదిరిపోయే పేరు వస్తుంది అని చెప్పి జ్ఞానాంబతో ఒప్పిస్తుంది.
మరోవైపు రామా.. జానకి కోసం ప్రత్యేకంగా స్వీట్లు తయారు చేసి.. రజనీకాంత్ కు ఇచ్చి అవి జానకికి ఇచ్చిరా అని చెబుతాడు. కానీ.. రజనీ కాంత్ మాత్రం అప్పుడే కొట్టులో స్వీట్లు తీసుకున్న మరో వ్యక్తిని ఢీకొట్టడంతో.. స్వీటు డబ్బాలు మారిపోతాయి. అయితే.. ఆ స్వీట్లు కూడా కస్టమర్ ప్రత్యేకంగా అందులో కొంచెం మందు కలిపి చేయిస్తాడు. అవి మారిపోవడంతో.. ఆ స్వీట్లు తిన్న జానకి రెచ్చిపోతుంది.
మామూలుగా కాదు. రాత్రి పూట.. రామాకు ముద్దుల వర్షం కురిపిస్తుంది. దీంతో రామా షాక్ అవుతాడు. జానకి ముద్దుల వర్షాన్ని తట్టుకోలేకపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.