Janaki Kalaganaledu 14 April Today Episode : రామా గురించి ఆలోచిస్తూ గ్యాస్ ఆన్ చేసిన జ్ఞానాంబ.. గ్యాస్ లీక్ అయి జ్ఞానాంబకు ప్రమాదం.. జానకికి మరో షాక్

Janaki Kalaganaledu 14 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 ఏప్రిల్ 2022, గురువారం ఎపిసోడ్ 279 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీ మంచి కోసమే నా తపన అంటే వినిపించుకోవు ఏంటి నువ్వు అంటాడు యోగి. నా మంచి కోసం కాదు అంటుంది జానకి. నువ్వు నా చెల్లెలువు మాత్రమే కాదు.. నాన్న పోయాక ఇప్పుడు నువ్వు నా బిడ్డవు కూడా అంటాడు యోగి. నువ్వు నిజంగా అలా అనుకుంటే.. అబద్ధం చెప్పి నా పెళ్లి చేస్తావా? కేవలం నీ కారణంగా నాకు సంతోషం కానీ మనశ్శాంతి కానీ లేకుండా పోయాయి. నువ్వు నాకు అన్నయ్యవో లేక శత్రువువో అర్థం కావడం లేదు. నా మీద పగబట్టినట్టు సాధిస్తున్నావు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది జానకి.

janaki kalaganaledu 14 april 2022 full episode

ఆ ఇంటికి నిన్ను కోడలుగా పంపిస్తే సంతోషంగా ఉంటావని భావించి ఆరోజు నీ చదువు గురించి అబద్ధం చెప్పాను. ఈరోజు కూడా నీ గురించే ఈ పని చేశాను కానీ.. నిన్ను కంటతడి పెట్టించడం కోసం కాదు. నాకు నా చెల్లెలు కాపురం బాగుండటమే ముఖ్యం. నేను ఎవ్వరి కాళ్లు పట్టుకోవడానికైనా రెడీ. నిన్ను మీ అత్తయ్య క్షమిస్తుందంటే ఆవిడ కాళ్లు పట్టుకోవడానికి నేను రెడీ అంటాడు యోగి. థాంక్యూ అన్నయ్య పదా అంటుంది. దీంతో తనను ఎక్కించుకొని స్వీటు షాపునకు వస్తాడు యోగి.

తనతో మాట్లాడేందుకు ఎంత ప్రయత్నించినా.. జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నేను బాగా ఆలోచించాను. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు యోగి అంటుంది జ్ఞానాంబ. కర్త, కర్మ, క్రియ అన్నీ నీ చెల్లెలే అంటుంది జ్ఞానాంబ. దీంతో యోగి షాక్ అవుతాడు.

నా మీద కేసు పెట్టడం.. ఎక్కడో ఉన్న నీ ఆలోచన కాదు. ఇక్కడే ఉన్న నీ చెల్లెలు పథకం అంటుంది జ్ఞానాంబ. దీంతో తనకు తెలియదు అంటాడు యోగి. మీరు ఇంకా అదే కోపంలో ఉన్నారు. నన్ను అపార్థం చేసుకుంటున్నారు. దయచేసి నేను చెప్పేది వినండి ప్లీజ్.

నేను చేసిన తప్పుకు మీకు బాధ కలిగినందుకు మీకు క్షమాపణలు చెప్పమని జానకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అంటాడు యోగి. నిన్ను నీ పెళ్లాన్ని…  ఇవాళ నిన్ను రంగంలోకి దించింది అంటుంది జ్ఞానాంబ. దీంతో అత్తయ్య గారు మీరు ఇలా అపార్థం చేసుకుంటే నాకు భరించలేనంత బాధగా ఉంటుంది.

Janaki Kalaganaledu 14 April Today Episode : యోగినైనా క్షమిస్తాను కానీ.. నిన్ను క్షమించను అన్న జ్ఞానాంబ

నిన్ను మా వదిన వచ్చిన విషయం నాకు తెలియదు. ఇప్పుడు మా అన్నయ్యను మాత్రం నేనే క్షమాపణలు చెప్పించేందుకు తీసుకొచ్చాను. దయచేసి నమ్మండి.. అర్థం చేసుకోండి అంటుంది జానకి. నన్ను క్షమించండి అంటుంది జానకి.

ఏంటి.. క్షమించడమా.. నీ అన్ననయినా పొరపాటున క్షమిస్తానేమో కానీ.. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను క్షమించను అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకి షాక్ అవుతుంది. నా మీద నాకే కోపం వస్తోంది. ఎందుకో తెలుసా? నిన్ను గుడ్డిగా నమ్మినందుకు అంటుంది జ్ఞానాంబ.

నా కూతురు పెళ్లి విషయంలో ఇలాగే అబద్ధాలు, మాయ మాటలు చెప్పి నన్ను పిచ్చిదాన్ని చేశావు. అందరి ముందు తలదించుకునేలా చేశావు. ఇప్పుడు మీ అన్నయ్యతో కేసు పెట్టించి నా పరువును బజారుకీడ్చావు అంటుంది జ్ఞానాంబ. నువ్వు నీ చదువుకున్న తెలివితేటలు ఎన్ని చూపించినా.. నేను నిన్ను నమ్ముతాను అనుకోవడం నీ భ్రమ. క్షమిస్తాను అనుకోవడం అంతకన్నా భ్రమ అంటుంది జ్ఞానాంబ.

కట్ చేస్తే కూర వండుతూ జ్ఞానాంబ.. రామా గురించే ఆలోచిస్తూ గ్యాస్ ఆన్ చేసి ముట్టించకుండా అలాగే ఉండిపోతుంది. తర్వాత గ్యాస్ ఆన్ లో ఉందని మరిచిపోయి గ్యాస్ స్టవ్ ముట్టించి మంటలు తనకు అంటుకున్నట్టుగా కలగంటాడు రామా. దీంతో వెంటనే నిద్రలేచి.. తన ఇంటి వైపు పరిగెడుతాడు.

అమ్మ అంటూ డోర్ కొడతాడు. అమ్మ.. తలుపు తీయి అమ్మ అంటాడు. దీంతో ఇంట్లో వాళ్లు అందరూ నిద్రలేస్తారు. ఎంత చెప్పినా జ్ఞానాంబ మాత్రం తలుపు తీయదు. రేయ్ విష్ణు.. తలుపు తీయిరా అంటుంది జ్ఞానాంబ. దీంతో తలుపు తీస్తాడు విష్ణు.

తనను చూసి వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు రామా. అమ్మ.. నీకేం కాలేదు కదా అమ్మా. నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా అని అంటాడు. అమ్మ.. నీకేం కాలేదుగా. నువ్వు బాగున్నావు కదా అంటాడు రామా. కానీ.. తను మాత్రం ఏం మాట్లాడదు.

ఏమండి.. అర్థరాత్రి పూట ఏంటి ఇదంతా. నిద్రపోతుంటే ఏంటి ఈ గోల అంటుంది జ్ఞానాంబ. చెప్పండి.. వెళ్లిపోమని అంటుంది జ్ఞానాంబ. అది కాదు జ్ఞానం.. రాముడు ఎందుకు అంత కంగారు పడుతున్నాడో.. ఏం జరిగిందో తెలుసుకుందాం అంటాడు గోవిందరాజు.

కానీ.. ఏం అక్కర్లేదు అంటుంది జ్ఞానాంబ. నీకు ఏం కాలేదు. నువ్వు బాగున్నావు అది చాలు అమ్మ నాకు. ఇక ప్రశాంతంగా ఉంటాను అని అంటాడు రామా. మరోవైపు రామా, జానకి ఎక్కడ ఇంట్లోకి వస్తారో అని మళ్లీ ఆజ్యం పోయాలని ప్రయత్నిస్తుంది మల్లిక. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

11 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

14 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

18 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

21 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

23 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

2 days ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

2 days ago