
Sir Reddy Comments On Ram Charan Dance in RRR Movie
Sri reddy : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మూవీ ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. భారీగా వసుళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్, శ్రియ, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో మల్లి నటించింది. ఈమె చుట్టే కథ అంతా నడుస్తోంది.ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో రాజమౌళి సృష్టించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లను వసూలు చేసింది. ఇంత మొత్తంలో దంగల్, బాహుబలి 2 మాత్రమే వసూళ్లు చేశాయి. ఈ రికార్డుతో ఆర్ ఆర్ ఆర్ మూవీ మూడో చిత్రంగా నిలిచింది. అందులో రెండు చిత్రాలు రాజమౌళివే ఉండడం విశేషం.విజయేంద్ర ప్రసాద్ కథ రాయగా, ఆయన కుమారుడు రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం తెలిసిందే.
కొమరంభీం, అల్లూరి సీతారామరాజు పాత్రలను జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పోషించారు. నిర్మాత డీవీవీ దానయ్య రూ.450 కోట్లను ఈ సినిమా నిర్మాణం కోసం ఖర్చు చేశారు. మార్చి 25న ఈ సినిమా థియోటర్లలోకి రాగా 16 రోజుల్లోనే అధిక మొత్తంలో కలెక్షన్లు వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది.ఈ మూవీ ఒక్క హిందీ బెల్ట్‌లోనే రూ. 200 కోట్ల కలెక్షన్‌లను రాబట్టినట్టు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఆర్‌ఆర్ఆర్ మూవీ యూనిట్ ముంబైలో సక్సెస్‌మీట్ నిర్వహించింది. బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్, దర్శక నిర్మాత కరణ్ జోహర్, రచయిత జావేద్ అక్తర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిర్మాత డి.వి.వి. దానయ్య, జితేంద్ర, హుమాఖురేషీ, అశుతోష్ గోవారికర్, సతీష్ కౌశిక్, తదితరులు పాల్గొన్నారు. పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ ఈ కార్యక్రమంలో రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ను సత్కరించారు. ముగ్గురూ కేక్ కట్ చేసి సినిమా విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
Sir Reddy Comments On Ram Charan Dance in RRR Movie
కొన్నేళ్ల క్రితం వరుస వివాదాలతో… తాజాగా నిహారిక ఇష్యూపై శ్రీరెడ్డి మరోసారి ఘాటుగా స్పందించిన శ్రీరెడ్డి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పై పడింది. శ్రీరెడ్డి తనదైన శైలిలో ఆర్ఆర్ఆర్ సినిమాపై స్పందించింది. వీలున్నప్పుడల్లా మెగా ఫ్యామిలీపై విమర్శలతో చేలరేగిపొయే ఈమె మెగా ఫ్యామిలీ హీరో అయిన రామ్ చరణ్‌ను టార్గెట్ చేసింది. నాటు నాటు సాంగ్ లో డాన్స్ తో పాటు లిరిక్స్ కూడా చాలా నాటుగా ఉన్నాయని, డాన్స్ లో యంగ్ టైగర్ స్పీడ్ ని రామ్ చరణ్ అందుకోలేకపోయాడు.. పాపం అంటూ పగలబడి నవ్వే ఎమోజీని షేర్ చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నాటు నాటు సాంగ్‌కు స్టెప్ వేసిన ఫొటోను కూడా ఆమె తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీంతో శ్రీరెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.