Janaki Kalaganaledu 14 Dec Today Episode : జానకికి భారీ షాక్ ఇచ్చిన మల్లిక.. కేకుల పోటీల్లో పాల్గొనాలంటూ జానకికి చెప్పిన జ్ఞానాంబ

Authored By Varun G | The Telugu News | Updated on : 14 December 2021, 3:00 pm

Janaki Kalaganaledu 14 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 డిసెంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 192 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లడ్డుల బాక్స్ మారిపోయిందని చూసి షాక్ అవుతాడు రామా. లడ్డులను చూసి షాక్ అవుతాడు. జానకి గారు ఈ లడ్డులు మీరు తిన్నారా అని అడుగుతాడు. మీరు నాకోసం అంత ప్రేమగా పంపించినప్పుడు తినకుండా ఎలా ఉంటాను శ్రీవారు అంటుంది జానకి. పొరపాటుగా ఇక్కడికి వచ్చాయండి అంటుంది జానకి. వద్దండి ప్లీజ్ అంటాడు రామా. ఇవ్వండి అంటే వద్దు అంటాడు రామా. నాకు కావాలి అని సీరియస్ అవుతుంది జానకి. ప్లీజ్ అండి.. వద్దండి అంటాడు. కానీ.. జానకి వినదు. మంచి శ్రీవారు కదా నా మాట వింటారు కదా ఇవ్వండి అంటుంది. పొద్దున ఇస్తాను అంటాడు రామా. సరే.. పొద్దున ఇస్తారా రెండు ఇస్తారా అని అడుగుతుంది జానకి.

janaki kalaganaledu 14 december 2021 full episode

janaki kalaganaledu 14 december 2021 full episode

జానకి పువ్వులను చూసి ఏదేదో వాగుతుంది. మల్లెపూలు తెచ్చి ఎంత సేపు అయింది. ముందు జడలో పెట్టండి అంటుంది. మెల్లగా తనను వెనక్కి తిప్పి తన జెడలో పూలు పెడతాడు రామా. పూలు చూసుకొని మురిసిపోతుంది జానకి. రామా గారు.. మా  మంచి రామా గారు. మీరెంత ముద్దొస్తున్నారో తెలుసా? మీరెంత ముద్దొస్తున్నారో అంటుంది జానకి. మరోవైపు జ్ఞానాంబ, గోవింద రాజు సరదాగా గడుపుతుంటారు. జామురాతిరి జాబిలమ్మ అంటూ పాట పాడుతుంటాడు గోవింద రాజు. ఏంటో జ్ఞానం నీ చేత్తో ఎప్పుడూ చిలకలు చుట్టి ఇచ్చినా నాకు ఆరోజే గుర్తొస్తుంది అంటాడు. చాల్లేంటి సంబరం. ఊరుకోండి.. పిల్లలు ఉన్నారు అంటుంది. మల్లిక మామయ్య గారు మంచినీళ్లు తెమ్మని చెప్పి ఎంత సేపు అయింది అని అంటుంది. అటూ ఇటూ తూలుతూ మల్లిక మంచి నీళ్లు తెస్తుంటుంది. మల్లిక తూలుతూ ఉండటం చూసి గోవిందరాజు షాక్ అవుతాడు. ఆ తర్వాత జ్ఞానాంబ కూడా షాక్ అవుతుంది.

ఏంటి అక్కడే నిలుచుకున్నావు. మీ మామయ్య గారికి మంచినీళ్లు ఇవ్వు అంటుంది. సరే అంటుంది. గోవింద రాజు చేయి ఒక చోట పెడితే.. మరో చోట గ్లాస్ ఇస్తుంది. ఆయన ఎక్కడున్నారు.. నువ్వు ఎక్కడ గ్లాస్ ఇస్తున్నావు అంటుంది జ్ఞానాంబ. తీసుకోండి మామయ్య గారు అంటూ గ్లాస్ ను అటూ ఇటూ తిప్పుతుంది. నేను సరిగ్గానే ఇస్తున్నాను కానీ.. ఆయనే అటూ ఇటూ తిరుగుతున్నారు అంటుంది మల్లిక.

Janaki Kalaganaledu 14 Dec Today Episode : మల్లిక ప్రవర్తనకు విసిగివేసారిపోయిన జ్ఞానాంబ

తీసుకోండి అంటూ గ్లాస్ ను మీద పడేస్తుంది. చీ.. చీ.. చీ అంటాడు గోవింద రాజు. మామయ్య గారు ఎందుకు పోసుకున్నారు అంటుంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటుంది జ్ఞానాంబ. ఏంటి అలా తూలుతున్నావు. ఏమైంది నీకు అంటుంది జ్ఞానాంబ.  నేను తూలట్లేదు అత్తయ్య గారు.. మీరే తూలుతున్నారు అంటుంది మల్లిక.

ఇలా కాదని మల్లికను పట్టుకొని ఆగు అంటుంది జ్ఞానాంబ. ఏమైంది నీకు తిక్కతిక్కగా ప్రవర్తిస్తున్నావు అంటుంది. కానీ.. మల్లిక మాత్రం పిచ్చిదానిలా మాట్లాడుతుంది. మీరు ఒక్కరు కాదు అత్తయ్య గారు ముగ్గురు అంటుంది మల్లిక. మామయ్య గారు.. ఇప్పుడు నేను కనిపెట్టాను అంటుంది మల్లిక.

నేను అమెరికా తిరునాళ్లకు వెళ్లి మీకోసం ఈ లడ్డు తీసుకొచ్చాను. ఈ లడ్డు తినండి అని అరుస్తుంది మల్లిక. దీంతో జ్ఞానాంబకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో విష్ణును పిలిచి నీ పెళ్లాన్ని తీసుకెళ్లురా.. అంటుంది. విష్ణు వచ్చి మల్లికను లాక్కెళ్లబోతాడు కానీ.. మల్లిక మాత్రం అస్సలు వెళ్లదు. అత్తయ్య గారు నేను మీకోసం ప్రేమగా లడ్డు తీసుకొస్తే తీసుకోరు కదా. మీతో ఫ్రెండ్ షిప్ కట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లుతుంది.

మల్లికను రూమ్ లోకి తీసుకెళ్తాడు విష్ణు. అతడిని చూసి ముద్దు పెట్టబోతుంది మల్లిక. మరోవైపు జానకి కూడా అలాగే పిచ్చి పిచ్చి చేస్తుంటుంది. అక్కడ మల్లిక కూడా బయటికి వచ్చి తన భర్తతో ఆడుకుంటుంది. ఇద్దరు కలిసి.. తమ భర్తలను ఒక ఆట ఆడుకుంటారు.

విష్ణును ఓ ఆట ఆడుకుంటున్న మల్లికను చూస్తుంది జ్ఞానాంబ. ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాదు జ్ఞానాంబకు. వెంటనే గోవిందరాజుకు చెప్పి నీళ్లు తీసుకురమ్మంటుంది. బిందె నిండ నీళ్లు తీసుకొచ్చి తన మీద పోస్తుంది జ్ఞానాంబ. దీంతో షాక్ అవుతుంది జానకి. తోలు తీస్తాను పిచ్చి పిచ్చిగా చేశావంటే వెళ్లు అని సీరియస్ అవుతుంది జ్ఞానాంబ.

ఉదయం లేవగానే జానకి రెడీ అవుతుంటుంది. రామా తన పుస్తకాలు సర్దుతుంటాడు. తను రాత్రి చేసిన పనిని ఓసారి గుర్తు చేసుకుంటాడు రామా. రామా గారు బయలుదేరుదామా అంటుంది జానకి. ఇంతలో మల్లిక వాళ్లను ఆపుతుంది. అత్తయ్య గారు అని జ్ఞానాంబను పిలుస్తుంది. కేకుల పోటీ గురించి చెబుతుంది. దీంతో జానకి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి