Janaki Kalaganaledu 14 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 జనవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 215 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మైరావతి చెప్పినట్టుగా జానకిని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేస్తుంది సునంద. ఇప్పుడు నీకు ఏం అర్థం అయింది అంటుంది మైరావతి. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండు. నీకు నీ కార్పొరేటర్ పదవి అనేది ఎల్లకాలం ఉండదు. నీగురించి నేను ఒక్క క్షణం కానీ ఆలోచన చేశాననుకో.. నువ్వు కానీ.. నీ పదవి కానీ ఉండవు అని అంటుంది మైరావతి. వెళ్లేటప్పుడు జరిగిన దానికి నేను క్షమాపణ చెబుతున్నాను.. నన్న క్షమించు అంటుంది జ్ఞానాంబ. క్షమించడానికి నువ్వు చేసింది తప్పు కాదు.. కుట్ర. ఊరందరూ చూస్తుండగా నా కోడలు నడివీధిలో నడుస్తూ వెళ్లేలా చేశావు. నిన్ను అంత ఈజీగా క్షమిస్తానా అంటుంది జ్ఞానాంబ.
జరిగిందేదో జరిగిపోయింది. ఇంతకుముందు మనం ఎంత స్నేహంగా ఉన్నామో.. ఇప్పుడు కూడా అంతే స్నేహంగా ఉందాం.. అని అంటుంది సునంద. చాలమ్మా చాలు.. ఇక నువ్వు చేసింది చాలు. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. వెళ్లు ఇక్కడి నుంచి అంటారు అందరూ. ఏయ్ కార్పొరేటర్.. ఈ ఊరికి ఉత్తరం దిక్కున ఏముంది.. అని అడుగుతుంది. దీంతో స్మశానం అంటుంది సునంద. ఇంకోసారి నా కుటుంబం జోలికి వస్తే.. నేను సరాసరి అక్కడికే పంపిస్తా అని బెదిరిస్తుంది మైరావతి. వెళ్లు.. మళ్లీ నాకు కనిపించకు అంటుంది మైరావతి. ఆ తర్వాత వదిన.. అంటూ జానకి దగ్గరికి వెళ్లి ఏడుస్తుంది వెన్నెల. ఏడవకు.. నేనున్నాను కదా అంటుంది.
ఆ తర్వాత నానమ్మ నువ్వు టైమ్ కు దేవతలా వచ్చి జానకి గారిని కాపాడావు అంటాడు రామా. చాలా చాలా కృతజ్ఞతలు అమ్మమ్మ గారు అంటూ జానకి తన కాళ్ల మీద పడబోతుంది. కానీ.. మైరావతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో జానకికి ఏం చేయాలో అర్థం కాదు.
ఇంతలో మైరావతి దేవుడి గుడికి వెళ్లి పూజ చేస్తుంది. అందరికీ హారతి ఇస్తుంది కానీ.. జానకికి ఇవ్వదు. ఈ ఇంటి దేవుడికి పూజ చేసే అర్హత నీకు లేదు. ఆ అర్హతను నీ అంతట నువ్వే పోగొట్టుకున్నావు అంటుంది. నువ్వు మగరాయుడివా.. రోడ్డు మీద గొడవలు చేస్తున్నావా.. అంటూ ప్రశ్నిస్తుంది మైరావతి.
ఈ ఇంటికి తగ్గ కోడలు కాదు.. తనను వెంటనే ఇంట్లోంచి.. రామయ్య జీవితంలో నుంచి పంపించేయమని చెప్పా కదా. విన్నావా అంటూ జ్ఞానాంబను ప్రశ్నిస్తుంది. ఇప్పుడు చూశావా ఏమైందో. చివరకు మనందరం పోలీస్ స్టేషన్ కు వెళ్లేలా చేసింది అంటుంది మైరావతి.
అత్తయ్య గారు మీ మాటను కాదన్నందుకు నన్ను క్షమించండి అంటుంది జ్ఞానాంబ. మీరు తనను చూసింది కొద్ది రోజులే. మీరు జానకి గురించి తెలుసుకోవడానికి మీకు సమయం సరిపోలేదు కాబట్టి.. మీకు జానకి గురించి తర్వాత చెబుతామని అనుకున్నాను తప్పితే మీ మాటను కాదని కాదు అంటుంది జ్ఞానాంబ.
కన్నబాబు విషయంలో జానకి ఎందుకు ఇలా చేసిందో మాత్రం అర్థం కావడం లేదు. కారణం లేకుండా జానకి ఏం చేయదు..ఏం జరిగింది. కన్నబాబు మీద ఎందుకు నువ్వు చేయి చేసుకున్నావో చెప్పు అని అడుగుతుంది జ్ఞానాంబ. కానీ.. జానకి ఒక్క మాట కూడా మాట్లాడదు.
అరె.. అడుగుతుంది నిన్ను కాదా.. నీ కారణంగా అత్తయ్య గారి ముందు నేను తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు. ఇన్ని జరుగుతున్నా నువ్వు ఒక్క మాట మాట్లాడవేంటి అంటుంది జ్ఞానాంబ. తను చెప్పదు.. ఎట్టా చెప్తది అంటుంది మైరావతి. ఏం జరిగిందో చెప్పు అంటే.. ఇప్పుడు నేను ఏం చెప్పలేను.. దయచేసి నన్ను క్షమించండి అత్తయ్య గారు అంటుంది జానకి.
మధ్యలో మల్లిక కలగజేసుకుంటుంది. దీన్ని తనవైపు మలుచుకోవాలని అనుకుంటుంది. ఈ లోగుట్టు జానకికే ఎరుక.. కన్నబాబును కొట్టడం వెనుక ఏదో ఒక కారణం తప్పకుండా ఉండే ఉంటుంది కదా అంటుంది మల్లిక. ఎవ్వరు అడిగినా కూడా జానకి అదే సమాధానం చెబుతుంది. ప్రస్తుతం నేను ఏం మాట్లాడలేను అంటుంది జానకి.
ఈవిడ గారిని అడగడం అయిపోయింది. ఇక మిగిలింది.. మీ అమ్మ నిర్ణయం చెప్పడం అంటుంది మైరావతి. ఏం జ్ఞానాంబ.. నీ కోడలుకు పెద్దవాళ్ల మాట అంటే ఎనలేని గౌరవం.. బోలెడంత విలువ అని చెప్పావు కదా.. అంటుంది మైరావతి. ఈ వంశానికి పెద్దగా నేను అడిగా నా మాటకు సమాధానం చెప్పలే. అత్తమామలు అడిగారు మీకూ గౌరవం ఇవ్వలేదు. తాళి కట్టిన భర్త అడిగాడు.. అయినా వాడి మాటకూ విలువ ఇవ్వలేదు.. అంటుంది మైరావతి.
ఇప్పుడు చెప్పు.. ఇదేనా నీ కోడలుకు పెద్దవాళ్లు అంటే ఉన్న మర్యాద. ఇదేనా అంటుంది మైరావతి. ఇంతలో గోవిందరాజుకు పెళ్లి వాళ్లు ఫోన్ చేస్తారు. తమకు ఈ సంబంధం వద్దంటారు. ఆ తర్వాత మైరావతి చెప్పినట్టుగా.. జానకిని ఇంట్లో నుంచి పంపించేస్తుంది జ్ఞానాంబ. ఆతర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.