Janaki kalaganaledu 14 september 2021 tuesday episode 127 highlights
Janaki kalaganaledu 14 september 2021 tuesday episode 127 highlights
Janaki Kalaganaledu 14 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 14 సెప్టెంబర్ 2021, మంగళవారం తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 127 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వినాయక చవితి సంబురాలను జ్ఞానాంబ ఇంట్లో జరుపుకుంటారు. అయితే.. పత్రి తీసుకురావాలని అఖిల్ కు జ్ఞానాంబ చెబుతుంది. దీంతో.. ఉదయమే వెళ్లిన అఖిల్.. ఇంకా తిరిగి రాకపోయే సరికి.. టెన్షన్ పడుతుంది జ్ఞానాంబ. ఇంతలో జానకి ఉండి.. ఏమైంది అత్తయ్య గారు అని అడుగుతుంది. మొత్తం విషయం చెబుతుంది జ్ఞానాంబ. అత్తయ్య గారు నేను వెళ్లి చూసి వస్తాను.. అని చెబుతుంది. జాగ్రత్త అమ్మాయి త్వరగా వచ్చేయ్.. అని చెబుతుంది.
Janaki kalaganaledu 14 september 2021 tuesday episode 127 highlights
దీంతో జానకి.. అఖిల్ ను వెతుక్కుంటూ వెళ్తుంది. కట్ చేస్తే అఖిల్ ను కొందరు యువకులు కలిసి కొడుతుంటారు. డబ్బులు ఎక్కడ్రా అంటూ కొడుతుంటారు. నాటకాలు ఆడుతున్నావా.. డబ్బులు ఇచ్చి నడువు.. అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంటారు. మీ అమ్మ దగ్గరకే నడువురా.. అక్కడే నీ సంగతి తేల్చుతా.. అంటూ అతడిని లాక్కెల్లే ప్రయత్నం చేస్తుండగా…. అఖిల్ ను జానకి చూస్తుంది. అతడి దగ్గరికి వెళ్లి వదలండి.. అంటూ గట్టిగా అరుస్తుంది. అందరూ కలిసి ఒక్కడిని కొడుతున్నారు.. ఏమైంది.. ఎందుకు కొడుతున్నారు.. అని అడగగా.. మేమేం కావాలని గొడవ చేయడం లేదు.. మా దగ్గర అప్పు చేసి తప్పించుకొని తిరుగుతున్నాడు.. అంటారు వాళ్లు.
Janaki kalaganaledu 14 september 2021 tuesday episode 127 highlights
30 వేలు తీసుకొని ఇప్పటి వరకు ఇవ్వలేదు. వాటిని వసూలు చేయడానికే మీ ఇంటికి తీసుకొని వస్తున్నాం.. అంటాడు. అఖిల్.. నువ్వు ఇలా రా.. ఏమైంది చెప్పు అని అడుగుతుంది. వాళ్లు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది. వాళ్ల దగ్గర అప్పు చేశావా.. అని అడుగుతుంది. అవును.. వదిన అంటాడు అఖిల్. నీకెప్పుడు కావాలంటే అప్పుడు మీ అన్నయ్య డబ్బులు ఇస్తున్నాడు కదా.. అంత డబ్బు అప్పు చేయాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది.. అనగానే ఆన్ లైన్ లో గేమ్స్ ఆడటం కోసం అప్పు చేశానని ఎలా చెప్పాలి.. అని తనలో తాను అనుకుంటాడు. నాకు గిటార్ అంటే ఇష్టం.. నా ఇష్టాన్ని చంపుకోలేక.. మరోదారి లేక అప్పు చేసి గిటార్ కొన్నా… అని అబద్ధం చెబుతాడు అఖిల్.
Janaki kalaganaledu 14 september 2021 tuesday episode 127 highlights
గిటార్ కొంటే.. మరి ఇంటి దగ్గర కనిపించలేదు ఎందుకు.. అనగానే ఫ్రెండ్ దగ్గర దాచా.. అని మరో అబద్ధం చెబుతాడు. నీకేమన్నా పిచ్చా.. నీకు డబ్బులు కావాలంటే.. ఇంట్లో అడగాలి కానీ.. ఇలా చేస్తావా? అని అడుగుతుంది. అవును వదిన.. ఈ విషయం అమ్మకు తెలిస్తే.. ఊరుకోదు. అందుకే నేను ఎక్కడికైనా పారిపోతాను. ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతాను.. అంటాడు అఖిల్. నీకు పిచ్చా.. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.. అని చెప్పి వాళ్ల దగ్గరికి తీసుకెళ్లి.. మీరు వెళ్లండి.. డబ్బులు నేను పంపిస్తాను అని చెప్పి వాళ్లను పంపిస్తుంది. జానకి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. హమ్మయ్య.. ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకున్నా.. కానీ వదిన అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తుందో అర్థం కావట్లేదే.. అని తనలో తాను అనుకుంటాడు అఖిల్.
Janaki kalaganaledu 14 september 2021 tuesday episode 127 highlights
కట్ చేస్తే.. జానకి ఇంటికి వస్తుంది. మెల్లగా తన రూమ్ లోకి వెళ్లి.. తన బీరువాలో ఉన్న తన తల్లి నగలను తీసుకుంటుంది. ఇప్పుడు నా చదువు కంటే అఖిల్ భవిష్యత్తును కాపాడటం చాలా ముఖ్యం. అఖిల్ ను అప్పుల సమస్య నుంచి బయటపడేయక పోతే.. అతడు ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అందుకే.. నగలు అమ్మి.. ఆ డబ్బులు ఇచ్చేస్తా.. అని అనుకుంటుంది జానకి. నగలు తీసుకొని తిన్నగా బయటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా జానకి అంటూ జ్ఞానాంబ పిలుస్తుంది. దీంతో షాక్ అవుతుంది జానకి.
Janaki kalaganaledu 14 september 2021 tuesday episode 127 highlights
అఖిల్ కోసం వెళ్తున్నాను.. అని చెప్పావు కదా నువ్వు ఇంకా వెళ్లలేదా అని అడుగుతుంది జ్ఞానాంబ. వెళ్లి వచ్చాను అత్తయ్య గారు.. మళ్లీ వెళ్తున్నా అని చెబుతుంది. కానీ.. జ్ఞానాంబకు ఏం అర్థం కాదు. వాడేదైనా సమస్యల్లో చిక్కుకున్నాడా.. ఏంటి అని అడుగుతుంది. అయ్యో అదేం లేదు అత్తయ్య గారు.. సామాన్ల కోసం తీసుకెళ్లిన డబ్బులు ఎక్కడో పడిపోయాయట. నేను వెళ్లి డబ్బులు ఇచ్చి వెంటనే వస్తాను.. అని చెబుతుంది. సరే సరే.. వెళ్లు అని చెప్పి కొంగులో బంగారు గాజులు పెట్టుకోవడం చూసి.. ఆ కొంగులో ఏంటి.. అని అడుగుతుంది. డబ్బులు అని చెబుతుంది. అలాగే.. వైజయంతిని కూడా పూజకు పిలువు అని చెబుతుంది జ్ఞానాంబ.
Janaki kalaganaledu 14 september 2021 tuesday episode 127 highlights
కట్ చేస్తే.. జ్యూయలరీ షాపునకు వెళ్తుంది జానకి. వీటిని తాకట్టు పెట్టుకొని 30 వేలు ఇస్తారా.. అని అడుగుతుంది. పేరు, వివరాలు అడిగి 30 వేలు ఇస్తాడు షాప్ అతను. వెంటనే డబ్బులు తీసుకొని అఖిల్ దగ్గరికి వెళ్తుంది జానకి. అఖి కు డబ్బులు ఇస్తుంది. వదినా ఈ డబ్బులు ఎక్కడివి అని అడుగుతాడు అఖిల్. గాజులు తాకట్టు పెట్టాను.. అని చెబుతుంది జానకి. ఆ గాజులు మా అమ్మ తాలుకు అపురూపమైనవి నాకు. అవి తాకట్టు ఎందుకు పెట్టానంటే.. కుటుంబం అంతా కలిసి ఉండాలనేది తన ఆశ.
అందరూ కలిసి తనతో ఉండాలని పెద్ద ఆశ. పిల్లలకు చిన్న కష్టం వచ్చినా తను తట్టుకోలేరు.. అని చెబుతుంది జానకి. నువ్వంటే మీ పెద్ద అన్నయ్యకు ఎంత ప్రేమో నీకు తెలియనిది కాదు. నువ్వు బాగా చదువుకొని గొప్ప ప్రయోజకుడివి అవుతావని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. నువ్వు మాత్రం ఇలా చేస్తే.. ఎక్కువగా బాధపడేది మీ అన్నయ్యే.. అంటుంది జానకి. చూడు అఖిల్ గొప్ప కుటుంబంలో పుట్టావు నువ్వు.. ఇంకోసారి ఇంట్లో నుంచి వెళ్లిపోతా అని చెప్పకు… అని అంటుంది.
Janaki kalaganaledu 14 september 2021 tuesday episode 127 highlights
నాకోసం మీ అమ్మ గారి గాజులు తాకట్టు పెట్టావా.. నన్ను క్షమించు వదినా.. అంటూ జానకి కాళ్ల మీద పడుతాడు. నువ్వు నా కాళ్ల మీద పడేందుకు కాదు నేను ఈ పని చేసింది. నువ్వు ఇంకోసారి ఈ పని చేయకు.. అని మందలిస్తుంది జానకి.
Janaki kalaganaledu 14 september 2021 tuesday episode 127 highlights
కట్ చేస్తే.. వైజయంతి ఇంటికి జానకి వెళ్తుంది. వినాయక చవితి పూజకు రావాలంటూ వైజయంతిని పిలుస్తుంది. వైజయంతి జానకిని చూసి.. కూర్చో.. నేను కాఫీ తీసుకొస్తా అని లోపలికి వెళ్తుంది. అక్కడే టేబుల్ మీద ఉన్న కాలేజీ కాన్వకేషన్ ఫోటోలు అక్కడ టేబుల్ మీద ఉంటాయి. వాటిలో తన ఫోటో ఉండటం చూసి షాక్ అవుతుంది. ఆ ఫోటోను తీసి చూస్తుండగానే వైజయంతి అక్కడికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.