Janaki Kalaganaledu 15 Sep Today Episode : అబార్షన్ చేయించుకుంటేనే నీతో పెళ్లి అని జెస్సీని బెదిరించిన అఖిల్.. దీంతో జెస్సీ ఆత్మహత్య? జానకి పరీక్ష రాయకుండా పరుగు

Advertisement
Advertisement

Janaki Kalaganaledu 15 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 సెప్టెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 389 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తోడి కోడలు మీద విజయం సాధించడానికి ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండటానికి సాయం చేసిన నీకు చాలా థాంక్స్ అని చెప్పి మల్లిక సంతోషంగా వెళ్తుంది. దానికి కారణం పక్కింటి ఆవిడ వచ్చి జానకి మీద లేనిపోనివి చెప్పడమే. వెంటనే ఆ తప్పుల్లో ఒక్కటి కొట్టేయండి అని జ్ఞానాంబకు చెబుతుంది మల్లిక. దీంతో కోపంతో జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే పరీక్షకు టైమ్ అవుతున్నా ఎందుకో బాధగా నిలబడుతుంది జానకి. ఇంతలో అక్కడికి రామా వచ్చి.. పదండి పరీక్షకు వెళ్దాం అంటాడు. కానీ.. వద్దు రామా గారు అంటుంది. ఇంతలో అక్కడికి జ్ఞానాంబ వస్తుంది. నేను సరిగ్గా చదవలేకపోతున్నాను అంటుంది జానకి. జెస్సీ ప్రాబ్లమ్ క్లియర్ అయితే తప్ప నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేను అనిపిస్తోంది అంటుంది జానకి.

Advertisement

janaki kalaganaledu 15 september 2022 full episode

ఇంతలో జ్ఞానాంబ అక్కడికొచ్చి జానకి అని గట్టిగా అరుస్తుంది. మన ఆలోచన, ఏకాగ్రత సాధించే ఆశయం మీద ఉండాలి కానీ.. నిజమో కాదో తెలియని సమస్య మీద కాదు. నీ చదువు వల్ల నువ్వు నా కొడుకును ఎక్కడ చిన్నచూపు చూస్తావో అనుకున్నా. కానీ.. నీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని నీకు మద్దతు ఇచ్చాను. నీ కాలేజీని కూడా ఉదయానికి మార్చాను. తల్లిగా అండగా ఉన్నాను. అత్తగారిగా నీకు ఇంటి బాధ్యతల్లో ఇచ్చాను. అవన్నీ కాకుండా నువ్వు కొత్త సమస్యను ఎత్తుకున్నావు. ఆ అమ్మాయి సమస్య గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు. నలుగురు నానా రకాలుగా మాట్లాడుకునే అవకాశాన్ని ఇచ్చావు. నీ భవిష్యత్తును, నీ మీద ఆధారపడ్డ వాళ్లను ఇబ్బంది పెడుతున్నావు. అది మంచిది కాదు జానకి అంటుంది జ్ఞానాంబ. గోవింద రాజు కూడా నీ చదువును నిర్లక్ష్యం చేయకు అంటాడు. మీ అత్తయ్య గారు చెప్పిన మాట విను అంటాడు.

Advertisement

పాపం అత్తయ్య గారి బాధ అర్థం చేసుకో జానకి. ఐపీఎస్ ఆఫీసర్ గా నిన్ను చూడాలని నీతో ఇంటి పనులు మాన్పించేశారు. అవన్నీ నాతో చేయిస్తున్నారు. అఖిల్, వెన్నెల భవిష్యత్తును నీకు అప్పగించారు. అవన్నీ పట్టించుకోకుండా ఎవరో జెస్సీ ప్రాబ్లమ్ ను నీ మీద వేసుకొని అత్తయ్య గారిని బాధపెట్టడం ఎందుకు చెప్పు అంటుంది మల్లిక.

దీంతో మల్లిక… తెలిసి తెలియకుండా మాట్లాడకు. అది ఒక ఆడపిల్ల సమస్య మాత్రమే కాదు. మన ఇంటి మర్యాద కూడా అంటుంది జానకి. దీంతో నేను నీకు ఎంత చెప్పినా నువ్వు అదే ఆలోచిస్తున్నావు. రామా నీతో వస్తే వాడి బుర్ర కూడా పాడు చేస్తావు. మనశ్శాంతి లేకుండా చేస్తావు. నేనే నిన్ను ఎగ్జామ్ దగ్గరికి తీసుకెళ్తా పదా అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 15 Sep Today Episode : అఖిల్ తో మాట్లాడిన గోవిందరాజు

దీంతో అమ్మ వద్దులే అమ్మ. నేను తీసుకెళ్తా అని జానకిని ఒప్పించి పరీక్షకు తీసుకెళ్తాడు రామా. వదిన ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలేలా లేదు అని అనుకుంటాడు అఖిల్. అతడు టెన్షన్ పడటం చూసి గోవిందరాజుకు అనుమానం వస్తుంది. అఖిల్ దగ్గరికి వెళ్లి.. భుజం మీద చేయి వేస్తాడు.

తప్పును మాటతో దాచగలవేమో కానీ.. నిజంతో కాదు అంటాడు. ఇందాక నిన్ను గమనించా. చాలా టెన్షన్ పడుతున్నావు. నిన్న కూడా మీ అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నప్పుడు నీ చేయి వణికింది. ఇప్పుడు కూడా నీ కళ్లలో భయం కనిపిస్తోంది. నీ గురించి నాకు తెలుసు. అలాగే జానకి గురించి కూడా నాకు తెలుసు.

మీ వదిన అనవసరంగా ఒకరిని నిందించదు. నిజం లేకపోతే మీ అమ్మకు ఎదురుగా నిలబడి సమాధానేమే చెప్పదు. అసలు ఆ అమ్మాయిని ఇంటిదాకా తీసుకువచ్చేదే కాదు. అసలు ఏం జరిగిందో చెప్పు. మీ అమ్మతో నేను మాట్లాడుతాను అంటాడు గోవిందరాజు.

మీరు కూడా నన్నే అనుమానిస్తున్నారా నాన్న అంటాడు అఖిల్. ఎవరు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పే సమాధానం ఇదే. జెస్సీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటాడు అఖిల్. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. అఖిల్ ను మీరు కూడా తప్పుపడుతున్నారా అంటుంది జ్ఞానాంబ.

లాభం లేదు ఇంట్లో వాళ్లంతా వదిన మాటే వినేలా ఉన్నారు. త్వరగా ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతకాలి.. అని అనుకుంటాడు అఖిల్. జెస్సీ సమస్య తేలేంత వరకు ఇంట్లో ప్రశాంతత ఉండదు. అఖిల్ తో మాట్లాడి సమస్య తేల్చాలి అని అనుకుంటాడు రామా.

ఇంతలో అక్కడికి వెన్నెల వస్తుంది. అన్నయ్య అంటుంది. ఏంటన్నయ్యా ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతుంది. దీంతో మనసేం బాగోలేదు అంటాడు రామా. చిన్నప్పటి నుంచి మనం అమ్మ మాటకు ఎదురు చెప్పలేదు. జానకి వదిన మాట మీద నమ్మకంతో నువ్వు అఖిల్ గురించి నిజం రాబట్టాలని చూస్తున్నావు అని అంటుంది వెన్నెల.

ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. ఇంకా కొట్టుకు వెళ్లలేదా అని అడుగుతుంది. దీంతో పెద్దగా బేరాలు ఏం లేవు అంటాడు. తలనొప్పిగా ఉంది అంటాడు. దీంతో నీది తలనొప్పి కాదు. నీకు నువ్వుగా తెచ్చుకున్న భారం. పెద్ద ఆర్డర్ వస్తే నాలుగు రోజుల దాకా చేయడం కుదరదు అన్నావట కదా అంటుంది జ్ఞానాంబ.

నువ్వు నీ పని మీద, జానకి తన చదువు మీద ధ్యాస పెడితే బాగుంటుంది. ఆ అమ్మాయి గురించి ఆలోచించడం పక్కన పెట్టి ఆ ఆర్డర్ గురించి ఆలోచించండి అని చెబుతుంది. కట్ చేస్తే జెస్సీ బాధపడుతూ ఉంటుంది. అఖిల్… నేనే నీ లైఫ్ అన్నావు. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ కూడా చేశావు.

నువ్వు మీ అమ్మ గారికి భయపడటంలో అర్థం ఉంది కానీ.. నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా నువ్వు పట్టించుకోకపోవడంలో అర్థం లేదు అఖి అని అనుకుంటుండగా అఖిల్ తనకు ఫోన్ చేస్తాడు. దీంతో మన పెళ్లికి ఆంటీ ఒప్పుకున్నారా అని అడుగుతుంది జెస్సీ.

దీంతో నాటకాలు ఆడుతున్నావా జెస్సీ అని అంటాడు అఖిల్. దీంతో ఎందుకు జెస్సీ అలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. దీంతో అబార్షన్ చేయించుకో అని చెబితే మా వదినను అడ్డం పెట్టుకొని ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని నిలదీస్తాడు అఖిల్.

మా ఇంట్లో మా అందరికీ మా అమ్మ మాటే వేదం. నా చదువు కంప్లీట్ కాకుండా నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది. మన పెళ్లి అంటే మా అమ్మ అస్సలు ఒప్పుకోదు అంటాడు అఖిల్. నా బాధను అర్థం చేసుకో అంటుంది జెస్సీ. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కుదరదు అంటే మా ఇంట్లో చాలా సమస్య అవుతుంది అంటుంది జెస్సీ.

దీంతో ఇప్పట్లో మన మ్యారేజ్ జరగదు. నేను నీకు కావాలంటే, తర్వాత అయినా మన పెళ్లి జరగాలంటే మాత్రం నువ్వు అబార్షన్ చేయించుకో. అలా కాకుండా నువ్వు థర్డ్ పర్సన్ తో ఇబ్బంది కలిగేలా చేస్తే జీవితాంతం నన్ను వదులుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అఖిల్.

దీంతో నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటా. చచ్చిపోయి అయినా వాళ్లకు బాధలేకుండా చేస్తా అని అనుకుంటుంది. ఇంతలో పరీక్షకు వెళ్లబోతున్న జానకికి ఫోన్ వస్తుంది. జెస్సీ అమ్మానాన్న ఫోన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

53 mins ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

2 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

3 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

4 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

5 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

14 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

15 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

16 hours ago

This website uses cookies.