Janaki Kalaganaledu 17 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 డిసెంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 195 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కేకుల పోటీ ముగుస్తుంది. సునంద.. పోటీలో ఎవరు గెలిచారో స్టేజ్ మీదికి ఎక్కి చెబుతుంది. ద విన్నర్ ఈజ్ జానకి అంటుంది సునంద. దీంతో మల్లిక షాక్ అవుతుంది. జ్ఞానాంబ, గోవిందరాజు, రామా సంతోషిస్తారు. సునంద కొడుకుకు తీవ్రమైన కోపం వస్తుంది. బహుమతి తీసుకోవడానికి జానకి స్టేజ్ ఎక్కుతుంది. కంగ్రాట్స్ జానకి అంటుంది సునంద. తర్వాత తనకు సన్మానం చేస్తారు. శాలువా కప్పి దండేసి.. కప్ ఇచ్చి ప్రైజ్ మనీని అందిస్తుంది సునంద. జ్ఞానాంబ.. నీ కోడలు జానకిలో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఇక నుంచి మీ షాపులో కేకులు కూడా పెట్టొచ్చు అంటుంది సునంద. దీంతో జ్ఞానాంబ సంతోషిస్తుంది.
నాకు చిన్న పని ఉంది నేను బయలుదేరుతాను అని వెళ్తుంది సునంద. ఇంతలో ఏంటమ్మా నువ్వు.. అని అడుగుతాడు తన కొడుకు. ఆ సామాజిక కార్యకర్త ఆ జానకికి 100 కి వంద మార్కులు వేసింది. నేను తక్కువ వేస్తే కావాలని ఓడించానని అనుకుంటారు. అందుకే.. జానకిని గెలిపించాల్సి వచ్చింది. రేపు ఎన్నికలు ఉన్నాయి. అక్కడ నేను గెలవాలంటే.. ఇక్కడ జానకి గెలవాలి పదా అంటుంది సునంద. కట్ చేస్తే.. వెన్నెల తన పెళ్లి గురించే తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో విష్ణు ఇంట్లోకి వస్తాడు. మల్లిక అని పిలుస్తాడు. కానీ.. మల్లిక కనిపించదు. ఎక్కడికి వెళ్లింది అని అనుకుంటాడు. చెల్లి ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్లారు అందరు అని అడుగుతాడు. దీంతో కేకుల పోటీ గురించి చెబుతుంది. అవునా.. ఈ విషయం నాకు తెలియదు అంటాడు. ఇంతలో అఖిల్ వస్తాడు. ఏంట్రా ఏమైంది.. డల్ గా ఉన్నావు అంటాడు. పరీక్ష ఫలితాలు రేపు వస్తున్నాయి కదా అదే టెన్షన్ అంటాడు.
ఇంతలోనే జ్ఞానాంబ వాళ్లంతా ఇంటికి వస్తారు. మల్లికకు మాత్రం తీవ్రమైన కోపం వస్తుంది. తర్వాత ఇంట్లోకి వస్తారు. అందరూ జానకికి కంగ్రాట్స్ చెబుతారు. జానకి నీ మీద నీ ప్రతిభ మీద నాకు నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని నిలబెట్టావు. మన స్వీటు కొట్టు పేరును ఈరోజు నువ్వు మరో మెట్టు ఎక్కేలా చేశావు. అంతకన్నా ఎక్కువ గర్వపడేలా చేశావు.. అని జ్ఞానాంబ తెగ పొడిగేస్తుంది.
అబ్బో.. వీళ్ల ఓవరాక్షన్ చూడలేకపోతున్నా అని అనుకుంటుంది మల్లిక. నువ్వు వెళ్లిందో కొన్ని రోజులు అయినప్పటికీ కేకులు ఎలా తయారు చేస్తావో అని అనుకున్నా. కానీ.. వెళ్లిన కొన్ని రోజులకే కేకులను బాగా తయారు చేశావు అని అంటుంది జ్ఞానాంబ. ఇక నుంచి నువ్వు కేకులు నేర్చుకోవడానికి రాజమండ్రి వెళ్లాల్సిన అవసరం లేదు అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకి షాక్ అవుతుంది.
మనం ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది ఏంటండి అంటాడు రామా. అయితే.. అప్పుడప్పుడు ఇంటర్నెట్ లో చూసి నేర్చుకున్నాను. కానీ.. అదే ఇప్పుడు మనకు సమస్య తెచ్చిపెట్టింది అనుకుంటారు రామా, జానకి. మీరు సరిగ్గా చేయలేకపోయి ఉన్నా సరిపోయి ఉండేది అని అంటాడు రామా. అప్పుడు అత్తయ్య గారికి మరో అనుమానం వచ్చి ఉండేది అంటుంది జానకి.
ఈ పరిస్థితుల్లో ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంటుంది జానకి. రేపు కోచింగ్ సెంటర్ లో చాలా ముఖ్యమైన టెస్ట్ ఉంది. రేపు ఖచ్చితంగా ఆ టెస్ట్ కు అంటెండ్ కావాల్సి ఉంటుంది.. అంటుంది. దీంతో రేపు మీరు ఆ టెస్ట్ రాస్తున్నారు.. రాసినట్టే.. మీరు నిశ్చింతగా ఉండండి అంటాడు రామా.
దీంతో జానకి షాక్ అవుతుంది. అలా ఎలా కుదురుతుంది అని అడుగుతుంది జానకి. ఏం కాదు లేండి. మీరు నా మీద నమ్మకం ఉంచండి. పెందలాడే లేవండి. మీరు ప్రశాంతంగా పడుకోండి అంటాడు రామా. జానకి పడుకున్నాక.. ఏం చేయాలి అని తెగ ఆలోచిస్తాడు రామా.
మరోవైపు మల్లికకు నిద్ర కూడా పట్టదు. జానకి కేకుల రహస్యాన్ని బయటపెట్టినట్టే.. పోలేరమ్మకు అసలు విషయం తెలిసినట్టే అని అనుకున్నాను. కానీ.. చివరకు నేనే బొక్కబొర్లాపడ్డాను అని అనుకుంటుంది మల్లిక. అణుబాంబు లాంటి ఆయుధం ఇలా తుస్సు మంది ఏందిరా బాబు అని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది.
ఇంతలో చికిత వస్తుంది. పెద్దమ్మ గారు వస్తున్నారండి అని చెబుతుంది. పెద్దమ్మ గారా.. అంటూ గబగబా లేస్తుంది. జ్ఞానాంబ వచ్చి.. రేపటి నుంచి నువ్వు కేకులు తయారు చేయడానికి వెళ్లు అని మల్లికకు చెబుతుంది. దీంతో మల్లిక షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.