Janaki Kalaganaledu 18 Oct Today Episode : తన అంతరాత్మ మాటను నమ్మిన జ్ఞానాంబ.. జానకి, రామా విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది?

Authored By Varun G | The Telugu News | Updated on: October 16, 2021, 12:14 pm

Janaki Kalaganaledu 18 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. సీరియల్ తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ 18 అక్టోబర్, 2021 సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి చదువు విషయం తెలుసుకున్నా కూడా జానకిని ఏమీ అనలేదు జ్ఞానాంబ. అంతే కాదు తను తెచ్చిన చీర కట్టుకొని జానకి బర్త్ డే వేడుకలకు హాజరు అవుతుంది జ్ఞానాంబ. కానీ.. హుషారుగా ఉండదు. ఏదో బాధపడుతూ ఉంటుంది. తనకు కేక్ తినిపించబోయినా కూడా వద్దు.. ముందు రామాకు తినిపించు అని చెబుతుంది.

Janaki kalaganaledu 17 october 2021 episode highlights

Janaki kalaganaledu 17 october 2021 episode highlights


ఆ తర్వాత తెల్లారాక.. గోవిందరాజును జానకిని తెగ పొగుడుతాడు. జానకి లాంటి కోడలు దొరకడం తమ అదృష్టం అని అంటాడు. జ్ఞానాంబ మాత్రం ఏం మాట్లాడదు. జ్ఞానాంబ ఇంకా బాధపడుతూనే ఉంటుంది. మామయ్య గారు ట్యాబ్లెట్ వేసుకోండి.. అని చెబుతుంది. షుగర్ ట్యాబ్లెట్ వేసుకోండి.. నేను చాయ్ తీసుకొస్తా అని చెబుతుంది. ఇంతలో రామా.. కొట్టుకు వెళ్లబోతుండగా ఒరేయ్ రామా.. జానకి చాయ్ చేస్తుంది.. తాగిపో అని చెబుతాడు. ఇవన్నీ చూసి మల్లికకు అస్సలు నచ్చదు.

Janaki Kalaganaledu 18 Oct Today Episode : తన అంతరాత్మతో మాట్లాడిన జ్ఞానాంబ

జానకి కిచెన్ కు వెళ్లి చాయ్ పెడుతుంది. ఇంతలో అక్కడికి రామా వస్తాడు. ఏమైంది అని అడుగుతుంది జానకి. చాయ్ తాగి వెళ్లమని నాన్న చెప్పాడు అంటాడు. ఇక.. తన రొమాన్స్ ను స్టార్ట్ చేస్తాడు రామా. మరి.. మరి.. అంటూ తన చేతులను తాకేందుకు ప్రయత్నిస్తాడు. కానీ.. జానకి మాత్రం వద్దని వారిస్తుంటుంది. మొత్తం మీద ఇద్దరూ కాసేపు సరసాలు ఆడుకుంటారు.

Janaki kalaganaledu 17 october 2021 episode highlights

Janaki kalaganaledu 17 october 2021 episode highlights

మరోవైపు తన అంతరాత్మతో జ్ఞానాంబ మాట్లాడుతుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు, బంగారం లాంటి నూరేళ్ల జీవితం.. అన్నింటికి మించి పెద్దకొడుకు అంటే పంచప్రాణాలు.. అని జ్ఞానాంబ అంతరాత్మ అడుగుతుంది. భయపడటంలో అర్థం ఉంది. కానీ భయపడినట్టు జరుగుతుంది అని అనుకోవడంలోనే అర్థం లేదు.. అని మరో అంతరాత్మ అంటుంది. ఒకసారి సొంత తమ్ముడి విషయంలో ఎదురుదెబ్బ తగిలాక కూడా భయపడకపోతే.. జాగ్రత్త పడకపోతే ఎలా? అని అంటుంది మరో అంతరాత్మ.


ఎప్పుడో ఒకసారి అలా జరిగిందని ఎల్లప్పుడూ అలాగే జరుగుతుందా? అని మరో అంతరాత్మ అంటుంది. తమ్ముడి విషయంలో జరిగిందే కొడుకు విషయంలో జరగదని నమ్మకం ఏంటి? అని ప్రశ్నిస్తుంది. జరగదు.. జరగదంటే జరగదు.. అని చెబుతుంది అంతరాత్మ. దీన్నిబట్టి జ్ఞానాంబ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Gold Adulteration Alert : కొత్త మోసం.. 22 క్యారెట్ల పేరుతో 20 క్యారెట్ల బంగారమా..? 916 హాల్‌మార్క్ ఉన్నా జాగ్రత్త పడాల్సిందేనా?"

  2. "Vaibhav Sooryavanshi : 16 బంతుల్లో ఫిఫ్టీ.. 28 బంతుల్లో సెంచరీ.. ప్రపంచ రికార్డు బద్దలు!"

  3. "Samvidhan Raksha March : ప్రతి డివిజన్ నుంచి 100 మంది రావాలి.. డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ పిలుపు!"

  4. "Janasena Party : కూటమిలో ఉంటూనే జనసేన సొంత బలం పెంచుకుంటోందా?.. ప‌వ‌న్‌ది ఏం ప్లాన్ గురూ..!"

  5. "WhatsApp Web : వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. ఈ చిన్న తప్పుతో మీ అకౌంట్ ప్రమాదంలో పడొచ్చు!"

  6. "Trisha Politics : మరో జయలలితగా త్రిష?.. విజయ్‌తో రాజకీయాల్లోకి వస్తారా? అభిమానుల కొత్త ప్లాన్!"

  7. "Farmers Income : పంటల కంటే కూలీ పనులతోనే ఎక్కువ ఆదాయం.. రైతులపై NSO సర్వేలో సంచలన విషయాలు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp