Janaki Kalaganaledu 2 Feb Today Episode : జానకి సర్టిఫికెట్లను లాక్కొని తన ఐపీఎస్ కలను దూరం చేసిన జ్ఞానాంబ.. దీంతో రామా షాకింగ్ నిర్ణయం

Advertisement
Advertisement

Janaki Kalaganaledu 2 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 ఫిబ్రవరి 2022, బుధవారం ఎపిసోడ్ 228 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అమ్మ నీతో విషయం మాట్లాడాలి అంటాడు రామా. జానకి కూడా అతడితోనే ఉంటుంది. ఏంటిరా ఏమైంది.. అని అడుగుతుంది జ్ఞానాంబ. జానకి గారు చదువు గురించి అంటాడు రామా. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. జానకి గారు ఐపీఎస్ చదివితే సమాజానికి మంచి సేవ చేస్తారని పోలీస్ శాఖ మొత్తం కోరుకుంటోంది. సాక్షాత్తూ వాళ్లే మన ఇంటికి వచ్చి బతిమిలాడారు.. అంటాడు. ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు జానకి గారిని ఐపీఎస్ చదివిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంటాడు రామా. దీంతో జ్ఞానాంబ ఏం మాట్లాడదు.

Advertisement

janaki kalaganaledu 2 february 2022 full episode

అమ్మ.. నేను ఇలా అడిగినందుకు నీకు కోపం వస్తుందని నాకు తెలుసు. అసలు ఈ ప్రస్తావన తీసుకొస్తేనే నువ్వు ఊరుకోవని నాకు తెలుసు అమ్మ. కానీ.. అంత గొప్పవాళ్లే వచ్చి చెబుతుంటే అందులో ఒక అర్థం, పరమార్థం ఉంటాయి కదా అమ్మ. పైగా జానకి గారు చాలా తెలివైన వారు. పట్టుదల ఉన్న మనిషి. అన్నింటికీ మించి చదువంటే ప్రాణం అని అంటాడు రామా. జానకి గారిని చదివించాలే కానీ.. పెద్ద ఐపీఎస్ అయిపోతారమ్మ. అందులో ఎలాంటి అనుమానం లేదు అంటాడు రామా. అమ్మ.. జానకి గారు ఐపీఎస్ అయితే సమాజానికి ఎంతో మేలు చేస్తారు. మన ఇంటికి మంచి పేరు తీసుకొస్తారు. మన అందరినీ గర్వంతో తల ఎత్తుకునేలా చేస్తారు. జానకి గారికి చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణమైన ఐపీఎస్ కలను అందించి.. దాన్ని నిజం చేసిన వాళ్లం అవుతాం అంటాడు రామా. నువ్వు ఒక్కసారి ఆలోచించు అమ్మ అంటాడు.

Advertisement

అవును జ్ఞానం.. రామా చెప్పింది అక్షరాలా నిజం. జానకిని చదువుకోనిస్తే సమాజానికే కాదు.. మన ఇంటికి కూడా మంచి గౌరవ మర్యాదలను, పేరును తీసుకొస్తుంది అని చెబుతాడు గోవిందరాజు. దీంతో జ్ఞానాంబ ఆలోచనలో పడుతుంది.

అమ్మ.. నీ భయం నాకు అర్థం అవుతోంది. కానీ నువ్వు భయపడటంలో మాత్రం అర్థం లేదమ్మా. బాగా చదువుకున్న జానకి గారు.. స్వీట్లు అమ్ముకునే నన్ను ఎక్కడ చిన్నచూపు చూస్తారో అని నీ భయం. ఆ అవమానంతో నేను కుంగి పోతానేమోనని నీ బాధ.

అమ్మ.. నా మీద నీకున్న ప్రేమ, జాగ్రత్తకు గర్వంగా ఉంది. కానీ.. జానకి గారి గురించి అపార్థం చేసుకొని భయపడాల్సిన అవసరం లేదమ్మా. తన సంస్కారాన్ని మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. భర్తగా నాకు, అత్తమామలుగా మీకు ఎంత మర్యాద ఇస్తారో చూస్తూనే ఉన్నాం. తను ఎందుకు అ ప్రవర్తిస్తారమ్మా చెప్పు అంటాడు రామా.

నీ మనసులో ఉన్న భయాలన్నీ తీసేసి.. జానకి గారిని ఐపీఎస్ చదివించడానికి ఒప్పుకో అమ్మ. ఇది నా చిన్ననాటి కల అమ్మ అంటాడు రామా. ఐపీఎస్ అయితే జానకి గారి ఆనందానికి అవధులు ఉండవు అమ్మ. దయచేసి ఒప్పుకో అమ్మ అంటాడు రామా.

ఈ మాటలన్నీ నీవేనా అని ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ. దీంతో రామా, జానకి షాక్ అవుతారు. అమ్మ.. అది.. అంటాడు రామా. జానకి చదువుకోవాలన్నది నీ అభిప్రాయమా.. జానకి అభిప్రాయమా. మీరిద్దరూ అనుకొనే ఈ అభిప్రాయాన్ని నా ముందు ఉంచారా అని ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ.

ఇది నా నిర్ణయమే అంటాడు రామా. అసలు ఈ విషయం గురించి జానకి గారు నా దగ్గర ప్రస్తావన కూడా తీసుకురాలేదు అంటాడు రామా. జానకిని చదివించాలన్నది నీ నిర్ణయమేనా అని అడుగుతుంది జ్ఞానాంబ.. దీంతో అవునమ్మ అంటాడు రామా. అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతుంది జ్ఞానాంబ.

రామా.. మీ అమ్మ ఒప్పుకోవడానికి కాస్త సమయం పట్టొచ్చు. అభిప్రాయం చెప్పడానికి కూడా టైమ్ పట్టొచ్చు. కానీ.. ఖచ్చితంగా ఒప్పుకుంటుందిరా. మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెబుతాడు గోవిందరాజు. దీంతో సరే అంటాడు రామా.

Janaki Kalaganaledu 2 Feb Today Episode : జానకితో మాట్లాడటానికి పిలిచిన జ్ఞానాంబ

రాత్రి అవుతుంది. జ్ఞానాంబ నిద్రపోకుండా కూర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. బాంబును జానకి డిస్పోజ్ చేయడం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య గారు నాతో మాట్లాడటానికి రమ్మని కబురు చేశారు దేని గురించి అయి ఉంటుంది అని అనుకుంటుంది జానకి.

అత్తయ్య గారి మనసులో తమ్ముడు దూరం అయిన భయం ఉంది. అంత ఈజీగా తను నా చదువుకు ఒప్పుకోరని చెప్పాను. కానీ.. రామా గారు మాత్రం ఎంతో ధైర్యంగా అడిగారు. రామా గారు అడగకుండా ఉండాల్సింది. ఇప్పుడు అత్తయ్య గారు ఏ నిర్ణయం తీసుకుంటారో అని నాకు చాలా భయంగా ఉంది అని అనుకొని జ్ఞానాంబ దగ్గరికి బయలుదేరుతుంది జానకి.

అత్తయ్య గారు.. అని పిలుస్తుంది. మాట్లాడాలి రమ్మని పిలిచారు అని అడుగుతుంది జానకి. రామా ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది. నిద్రపోతున్నాడు అంటుంది జానకి. నేను కబురు చేసిన విషయం రామాకు తెలుసా అంటుంది. తెలియదు అంటుంది జానకి.

ఏమైంది అత్తయ్య గారు.. ఏ విషయం గురించి మాట్లాడటానికి పిలిచారు అంటుంది జానకి. ఈరోజు ఎస్ఐ గారు వచ్చి నీ చదువు గురించి మాట్లాడటానికి వచ్చారు. దీంతో తర్వాత మా అభిప్రాయం చెబుతాను అని చెప్పాను. ముందు నీ నిర్ణయం ఏంటో తెలుసుకోవాలి కదా.. అని అడుగుతుంది జ్ఞానాంబ.

చెప్పు.. నీ చదువు విషయంలో నీ నిర్ణయం ఏంటి అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో మీ నిర్ణయమే నా నిర్ణయం అత్తయ్య గారు అంటుంది జానకి. నా నిర్ణయం చెప్పాక దాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటిస్తావా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో సరే అత్తయ్య గారు అంటుంది.

అయితే.. నా నిర్ణయం ఏంటో చెబుతాను విను. నువ్వు చదువుకోవడానికి వీలు లేదు అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకి షాక్ అవుతుంది. నా కోడలు చదువుకోవడం నాకు ఇష్టం లేదు. నీకు చదువుకోవాలనే ఇష్టం బలంగా ఉంది. అందుకే.. నిన్ను చదివిద్దామని రామా నా అనుమతి అడిగాడు.

కానీ.. నేను నీకు ఏ నిర్ణయం అయితే చెప్పానో.. ఇప్పుడు కూడా అదే చెప్పాను. నా నిర్ణయం వెనుక ఉన్న కారణం అదే. భర్తగా భార్య కోరిక నెరవేర్చాలని అనుకుంటున్నాడు రామా. భర్తగా అది వాడి కర్తవ్యం. కానీ.. భవిష్యత్తులో రాబోయే పరిణామాలను వాడు ఊహించలేకపోయాడు అంటుంది జ్ఞానాంబ.

తెలిసి తెలిసి నా కొడుకు జీవితాన్ని ప్రమాదంలో పడేసుకోలేను. అలాగే నువ్వు చదువుకోవడం నాకు ఇష్టం లేదని నేను రామాకు చెబితే వాడు బాధపడతాడు. అందుకే.. నువ్వు చదువు గురించి ఆలోచించని.. నువ్వు చదువు గురించి ప్రస్తావన తీసుకురానని నువ్వు నాకు మాటిచ్చావు కాబట్టి.. ఆ మాట ప్రకారం చదువుకోవడం నాకు ఇష్టం లేదని నువ్వే రామాకు చెప్పు అంటుంది జ్ఞానాంబ.

అప్పుడు రామా బాధపడే అవకాశం ఉండదు. నీకే చదువుకోవడం ఇష్టం లేదని రామాకు చెబితే ఇంకోసారి నీ చదువు గురించి ఇంట్లో ప్రస్తావన రాదు అంటుంది జ్ఞానాంబ. నాకు చదువుకోవడం ఇష్టం లేదని నేను స్వయంగా ఆయనతో చెబుతాను అంటుంది జానకి.

జానకి.. ఒక ఆడపిల్ల ఇష్టాన్ని, కలలను శాసించే మూర్ఖురాలిని కాదు. నువ్వు నా కోడలువి కాబట్టి ఇప్పటికిప్పుడు నువ్వు చదువుకోకూడదు అని చెబితే తప్పు కానీ.. నా కోడలు చదువుకోకూడదని నేను ముందు నుంచి అనుకున్నాను కాబట్టి నా ఈ నిర్ణయం తప్పు కాదు అంటుంది జ్ఞానాంబ.

మీది భయం కాదు అత్తయ్య గారు. మీ అబ్బాయి గారి మీద ఉన్న ప్రేమ. నేను ఆయనకు చెబుతాను.. అంటుంది. నీ చదువుకు సంబంధించిన కాగితాలు నాకు కావాలి అంటుంది జ్ఞానాంబ. ఇలా అడగడం తప్పే కానీ తప్పడం లేదు. నా కొడుకు జీవితం ప్రశాంతంగా ఉండటం కోసం నేను ముందు జాగ్రత్తతో ఆలోచిస్తున్నాను అంటుంది.

భవిష్యత్తులో నీ చదువు గురించి ఎటువంటి సమస్య రాకూడదంటే.. నీ చదువుకు సంబంధించిన కాగితాలు నాదగ్గరే ఉండాలి అంటుంది జ్ఞానాంబ. దీంతో అలాగే అత్తయ్య గారు ఇప్పుడే తీసుకొస్తాను అంటుంది జానకి. తన రూమ్ లోకి వెళ్లి సర్టిఫికెట్లను తీసుకెళ్లి జ్ఞానాంబకు ఇస్తుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

54 mins ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

16 hours ago

This website uses cookies.