
fans fight about rrr movie
RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. ఆయన ఒక సినిమాని మించి మరోటి అన్నట్టు చిత్రీకరిస్తున్నాడు. ఇప్పటికే బాహుబలితో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తుంది. రాజమౌళి ఈ పీరియాడిక్ డ్రామాకి దర్శకత్వం వహించగా ఎన్టీఆర్, రామ్ చరణ్ స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్ మరియు అల్లూరి సీతారామరాజు పాత్రలను పోషించారు.స్వాతంత్ర్య సమరయోధులు నిజ జీవితంలో ఎప్పుడూ కలుసుకోనప్పటికీ, ఒక మిషన్ కోసం వారు ఎలా చేతులు కలిపారు అనే కల్పిత కథ.
కొమరం భీమ్ మరియు అల్లూరి సీతారామ రాజు స్వాతంత్ర్య పోరాటంలో చేరిన తర్వాత ఆర్ఆర్ఆర్ ముగుస్తుంది. అయితే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చిత్రానికి సీక్వెల్‌ని ప్లాన్ చేస్తున్నారని, ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం విజయేంద్రప్రసాద్ ఇప్పటికే “ఆర్.ఆర్.ఆర్” కోసం కథని రాయటం మొదలు పెట్టారట. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ సినిమా అనుకున్న స్థాయి లోనే బ్లాక్ బస్టర్ అయితే రాజమౌళి కచ్చితంగా ఈ సినిమాకి సీక్వెల్ తీయడానికి కూడా రెడీ అని తెలుస్తోంది.
vijayendra prasad plans sequal for rrr Movie
ఆర్ఆర్ఆర్ సినిమా కోసమే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు మూడేళ్ల పాటు మరే సినిమా చేయకుండా కేవలం ఈ సినిమాపైనే దృష్టి పెట్టారు. మరి సీక్వెల్ కోసం మరొక రెండు మూడేళ్లు ఈ ఇద్దరు స్టార్ హీరోలు మరో రెండు మూడేళ్ల పాటు రాజమౌళికి ఇవ్వగలరా అని అభిమానులు సైతం ఆలోచనలో పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ కనుకు బాహుబలిని మించి హిట్ అయితే దీనికి సీక్వెల్ చేసే ఆలోచన తప్పక వస్తుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. హీరోలు కూడా ఆసక్తి చూపడం ఖాయం అని చెబుతున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో ఏం అద్భుతాలు జరుగుతాయో..!
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.