Janaki Kalaganaledu 2 May Today Episode : యోగి కొడుకును జ్ఞానాంబ ఆశీర్వదిస్తుందా? యోగి ఇంటికి వెళ్లినా జ్ఞానాంబ ఏదైనా మెలిక పెడుతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janaki Kalaganaledu 2 May Today Episode : యోగి కొడుకును జ్ఞానాంబ ఆశీర్వదిస్తుందా? యోగి ఇంటికి వెళ్లినా జ్ఞానాంబ ఏదైనా మెలిక పెడుతుందా?

Janaki Kalaganaledu 2 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 మే 2022, సోమవారం ఎపిసోడ్ 291 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఊర్మిళ.. జ్ఞానాంబ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో జ్ఞానాంబ కుటుంబం మొత్తం బారసాల ఫంక్షన్ కు వస్తారు. దీంతో ఊర్మిళ.. తబ్బిఉబ్బిబ్బవుతుంది. నేను చెప్పాను కదా అమ్మవాళ్లు వస్తారని.. నేను చెప్పానా.. మన బిడ్డను ఆశీర్వదిస్తారని చెప్పానా. చూశారా.. నా […]

 Authored By gatla | The Telugu News | Updated on :2 May 2022,11:30 am

Janaki Kalaganaledu 2 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 మే 2022, సోమవారం ఎపిసోడ్ 291 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఊర్మిళ.. జ్ఞానాంబ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో జ్ఞానాంబ కుటుంబం మొత్తం బారసాల ఫంక్షన్ కు వస్తారు. దీంతో ఊర్మిళ.. తబ్బిఉబ్బిబ్బవుతుంది. నేను చెప్పాను కదా అమ్మవాళ్లు వస్తారని.. నేను చెప్పానా.. మన బిడ్డను ఆశీర్వదిస్తారని చెప్పానా. చూశారా.. నా నమ్మకం నిజం అయింది. పదండి.. వెళ్లి రిసీవ్ చేసుకుందాం. పదా శ్రావణి అంటుంది ఊర్మిళ. ఇంతలో వాళ్ల దగ్గరికి వెళ్లి అందరికీ నమస్కారం పెడుతుంది ఊర్మిళ.

janaki kalaganaledu 2 may 2022 full episode

janaki kalaganaledu 2 may 2022 full episode

తన బాబును అప్పటి వరకు ఎత్తుకొని వచ్చిన జ్ఞానాంబ తర్వాత బాబును ఊర్మిళకు ఇచ్చేస్తుంది. జానకి కూడా తనను చూస్తుంది. తర్వాత యోగి కూడా రామాకు నమస్కారం చెబుతాడు. మీరు తప్పకుండా వస్తారు అని అనుకున్నా కానీ.. నాలో ఏదో ఒక మూల చిన్న భయం ఉండేది. కానీ.. ఇప్పుడు ఆ భయం అంతా పోయి చాలా సంతోషంగా ఉంది. రుక్మిణి.. ఇదంతా నీవల్లే. నువ్వు నిజంగా మా కుటుంబాల మధ్య వారధిగా వచ్చావు అంటుంది ఊర్మిళ. ఇది నా గొప్పదనం కాదు.. కేవలం జ్ఞానాంబ గారి గొప్పదనం అంటుంది రుక్మిణి. ఒక మనిషిలో క్షమించే గుణం లేకపోతే ఎవ్వరు చెప్పినా ఎంత చెప్పినా ఉపయోగం ఉండదు. అమ్మలో క్షమించే గుణం ఆకాశమంతా ఉండబట్టే ఒక మెట్టు దిగి ఇక్కడికి వచ్చారు. తన దగ్గర ఉన్న అమ్మ ప్రేమే నీ బిడ్డను ఇక్కడికి వచ్చి ఆశీర్వదించేలా చేసింది అంటుంది రుక్మిణి.

మరోవైపు అందరూ ఇంట్లోకి వెళ్తారు. ఘనంగా బారసాల ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. జానకి కూడా సంతోషంగా ఉంటుంది. జానకి వెళ్లి జ్ఞానాంబకు తమలపాకులు ఇస్తుంది. ఆ తర్వాత జాను.. నువ్వు, బావ గారు బాబును ఊయలలో పడుకోబెట్టండి అంటాడు యోగి.

కానీ.. జానకి మాత్రం బాబును ఎత్తుకొని మనకి అమ్మ అయినా.. అత్తమ్మ అయినా అన్నీ అత్తయ్య గారే. అత్తయ్య గారు మీ చల్లని చేతులతో బాబును ఊయలలో వేయండి. అదే వీడికి శ్రీరామరక్ష అంటుంది జానకి. బాబును జ్ఞానాంబకు ఇస్తుంది. బాబను ఊయలలో పడుకోబెట్టు అంటాడు గోవిందరాజు.

Janaki Kalaganaledu 2 May Today Episode : తన బాబును ఆశీర్వదించాలని జ్ఞానాంబను కోరిన యోగి

అందరూ తనను ఊయలలో పడుకోబెట్టని చెబుతారు. అత్తయ్య గారు జరిగిందేదో జరిగిపోయింది. వాటన్నింటినీ మరిచిపోయి మా బిడ్డను ఆశీర్వదించండి అత్తయ్య గారు అంటాడు యోగి. పసిపిల్లలు దేవుడితో సమానం.. పెద్దవాళ్ల కోపతాపాలను పసిపిల్లల మీద చూపించే మూర్ఖురాలు కాదు ఈ జ్ఞానాంబ అని చెప్పి బాబును ఊయలలో పడుకోబెడుతుంది జ్ఞానాంబ.

ఆ తర్వాత అందరూ సంతోషిస్తారు. ఆ తర్వాత తను తీసుకొచ్చిన చైన్ ను బాబు మెడలో వేస్తుంది జ్ఞానాంబ. తర్వాత రుక్మిణి.. బాబును ఊయలలో పడుకోబెట్టిన తర్వాత పాట పాడుతుంది. తర్వాత జానకి కూడా వెళ్లి పాట పాడుతుంది. ఆ తర్వాత నాకు చాలా పని ఉంది. నేను అర్జెంట్ గా వెళ్లాలి అంటుంది రుక్మిణి.

మరోలా అనుకోకండి.. అంటుంది రుక్మిణి. కానీ.. జానకి మాత్రం అది కాదు రుక్కు.. ఇంత శ్రమ తీసుకున్నావు. మా అందరి కోసం వచ్చావు.. అప్పుడే వెళ్తే ఎలా అంటుంది జానకి. నేను తీసుకున్నది శ్రమ కాదు.. నా దోస్త్ కోసం చేసిన బాధ్యత అది. మరోసారి వస్తానులే అని అమ్మ వస్తాను అని చెబుతుంది.

జ్ఞానాంబ, గోవిందరాజు దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్లి వస్తా అంటుంది. ఇంతలో ఊర్మిళ అమ్మాయికి తాంబూలం ఇవ్వు అంటుంది జ్ఞానాంబ. దీంతో తనకు తాంబూలం అందిస్తుంది ఊర్మిళ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది