Janaki Kalaganaledu 2 Nov Today Episode : అఖిల్ డ్రగ్స్ అమ్ముతుండగా చూసిన మాధురి.. జానకి చూస్తుండగానే తనను చంపేసిన అఖిల్ ను జైలుకు పంపించిన జానకి

Janaki Kalaganaledu 2 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 నవంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 423 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మానుంచి వేరుగా ఉండాలనుకునే నీకు మేము చేసి పెట్టేది నచ్చకపోవచ్చు. నీకు ఏం కావాలో చెబితే అదే వడ్డించి పెడతాను. అది అడగాలనే పిలిచాను అంటుంది జ్ఞానాంబ. అంటే నాకు కడుపు లేదన్న నిజం పోలేరమ్మకు ఇంకా జానకి చెప్పలేదన్నమాట. కాకపోతే ఎందుకు చెప్పకుండా ఆగినట్టు అని అనుకుంటుంది మల్లిక. చెప్పు మల్లిక అంటుంది జ్ఞానాంబ. దీంతో దాంట్లో చెప్పడానికి ఏముంది.. మల్లికకు ఇష్టం ఉన్నదే తినడం.. అన్నీ వండుకొని తినేస్తుంది అంటాడు గోవిందరాజు. ఎలాగూ మన నుంచి వేరు పడాలని అనుకుంటోంది కదా. అప్పుడు తనే వండుకోవాలి కదా. ఇప్పుడు కూడా తననే వండుకోమని చెప్పండి. అప్పుడే తనకు దాని వల్ల వచ్చే మంచీచెడులు తెలుస్తాయి అని అంటుంది జానకి. నిజమే కానీ.. తన కడుపులో ఉన్న బిడ్డ గురించి నేను ఆలోచిస్తున్నాను అంటుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 2 november 2022 full episode

దీంతో అందులో ఏముందమ్మా.. మరీ అవసరం అయితే చికిత సాయం తీసుకుంటుంది. జానకి గారు చెప్పినట్టు తననే వండుకోనివ్వు అమ్మ అంటాడు రామా. దీంతో జ్ఞానాంబ కూడా సరే అంటుంది. మీరన్నట్టే మల్లిక తన వంట తాను చేసుకుంటుంది అంటుంది జ్ఞానాంబ. దీంతో మల్లిక షాక్ అవుతుంది. వంట సంగతి ఏమో కానీ.. జానకి బావ గారికి నిజం చెప్పినట్టు ఉంది.. అని అనుకుంటుంది మల్లిక. తన ఫేక్ ప్రెగ్నెన్సీ గురించి అత్తయ్య గారికి అప్పుడే చెబితే తట్టుకోలేరు. సమయం చూసి చెప్పాలి అని అనుకుంటుంది జానకి. మరోవైపు అఖిల్ కోసం తన ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటాడు.

ఇంతలో అఖిల్ డబ్బులు తీసుకొని తన ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. మామా రా.. నీకోసమే వెయిటింగ్ ఇక్కడ. కుర్చీ కూడా నీకోసమే రా అంటాడు. మనీ తెచ్చావా అని అడుగుతాడు. దీంతో తెచ్చా అని చెప్పి డబ్బులను తన ఫ్రెండ్ కు ఇస్తాడు. చెప్పిన దానికంటే ఎక్కువే డబ్బులు తెచ్చాడు మావోడు. నువ్వు మాల్ ఇస్తే మావోడు వ్యాపారం మొదలుపెట్టుకుంటాడు అని చెబుతాడు తన ఫ్రెండ్.

దీంతో మాల్ ను అఖిల్ కు ఇస్తాడు. మాల్ ను తీసుకుంటాడు అఖిల్. తీసుకునేవారికి, నీకు తప్ప ఇంకొక పర్సన్ కు ఈ విషయం తెలియకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఏదైనా పొరపాటు జరిగిందో అది నా మెడకు చుట్టుకునే పరిస్థితి వస్తే నేను మీ వాళ్లందరినీ ఇందులో ఇరికిస్తాను అంటాడు ఆ వ్యక్తి.

Janaki Kalaganaledu 2 Nov Today Episode : డబ్బులు ఇచ్చి మాల్ కొన్న అఖిల్

దీంతో అఖిల్ టెన్షన్ పడతాడు. దీంతో మామ.. నువ్వేం టెన్షన్ తీసుకోకు. స్టార్టింగ్ లో ప్రాబ్లమ్ ఉంటుంది కానీ.. తర్వాత నీకు అడ్డూ అదుపే ఉండదు అంటాడు తన ఫ్రెండ్. మరి.. దీన్ని ఎక్కడ అమ్మాలి అంటాడు అఖిల్.

దీంతో మన యూత్ అడ్రస్ ఉంది కదా.. కాలేజీ దగ్గర అంటాడు. మరోవైపు రామా, జానకి ఇద్దరూ బైక్ మీద వెళ్తుంటారు. జానకి గారు చదువు, పరీక్షల గురించి ఆలోచిస్తూ మౌనంగా ఉన్నట్టున్నారు అని అనుకుంటాడు రామా.

మల్లిక ఫేక్ ప్రెగ్నెన్సీ గురించి ముందు రామా గారికి చెప్పి అత్తయ్య గారికి నచ్చజెప్పేలా చేయాలని అనుకుంటుంది జానకి. ఏం ఆలోచిస్తున్నారు జానకి గారు అని అడుగుతాడు రామా. దీంతో మీతో మన ఇంటి గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటుంది జానకి.

దీంతో అవేమీ ఇప్పుడు మీరు ఆలోచించకండి. ముందు పరీక్షలు పూర్తవనివ్వండి అంటాడు. మరోవైపు జ్ఞానాంబ, గోవిందరాజు, జెస్సీ అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. చికిత వడ్డిస్తూ ఉంటుంది.

మల్లిక వచ్చి చూసి నిన్నటి దాకా కూర్చొన్న చోటుకే తిండి వచ్చేది. జానకి వల్ల తిన్నావా లేదా అని అడిగే దిక్కు కూడా లేకుండా పోయింది అని అనుకుంటుంది మల్లిక. దీంతో జ్ఞానాంబ.. మల్లికను చూసి తన కోసం కాకపోయినా తన కడుపులో ఉన్న బిడ్డ కోసం అయినా భోజనం వడ్డించు అంటుంది జ్ఞానాంబ.

దీంతో మల్లిక సంతోషిస్తుంది. వెంటనే వచ్చి కూర్చోబోతుంది మల్లిక. ఇంతలో గోవిందరాజు అడ్డుకుంటాడు. సొంత నిర్ణయాలు తీసుకోనివ్వు జ్ఞానం.. బాధ్యత అంటే ఏంటో తెలుస్తుంది అంటాడు.

దీంతో వెళ్లి వండుకోవడం స్టార్ట్ చేస్తుంది మల్లిక. కష్టపడి తన కోసం వంట వండుతూ ఉంటుంది. మరోవైపు అకాడమీలో పోలీసులతో ట్రెయినింగ్ ఇప్పిస్తారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో ఐపీఎస్ ఆఫీసర్ ప్రసన్న కుమార్ మోటివేషనల్ స్పీచ్ ఇస్తాడు.

ఇది జాబ్ కాదు. సొసైటీలో చెడును చంపేసే కత్తి అంటాడు. ఎవ్వరికీ తల వంచద్దు.. భయపడకుండా డ్యూటీ చేయగలిగిన వాడే పోలీస్ అంటాడు. డ్యూటీ విషయంలో సొంత ఫ్యామిలీ మెంబర్స్ తప్పు చేసినా వదలకూడదు అంటాడు.

అలా ఉంటామని మీరు ప్రమాణం చేసి చెప్పండి అంటాడు. దీంతో ఒక్క జానకి మాత్రం లేచి నిలబడి ప్రమాణం చేస్తుంది. ఆమె తర్వాత అందరూ ప్రమాణం చేస్తారు. అమ్మా జానకి.. ఇంత మందిని ఇన్ స్పైర్ చేసిన నిన్ను ఖచ్చితంగా అభినందించాలి అంటాడు ఐపీఎస్.

మరోవైపు కాలేజీలో డ్రగ్స్ అమ్ముతూ మాధురి కంట పడతాడు అఖిల్. నువ్వు ఏదో తప్పు పని చేస్తున్నావని ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. బయటే జానకి ఉంటుంది. తనను చూడకుండా మాధురి మీద కట్టె విసురుతాడు. దీంతో అది తాకి మాధురి కిందపడిపోతుంది. దీంతో తనకు రక్తం కారుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

8 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

11 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

14 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

15 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

18 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

21 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago