Janaki Kalaganaledu 20 Dec Episode Highlights : జానకిని బుక్ చేద్దామనుకున్న మల్లికకు బిగ్ షాక్ ఇచ్చిన జ్ఞానాంబ

Authored By Varun G | The Telugu News | Updated on : 18 December 2021, 3:00 pm

Janaki Kalaganaledu 20 Dec Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. శనివారం, ఆదివారం ఎపిసోడ్ ప్రసారం కావు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 20 డిసెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 196 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనూహ్యంగా జానకి గెలిచిందని సునంద చెప్పడంతో మల్లిక షాక్ అవుతుంది. కేకులే తయారు చేయరాని జానకి.. కేకుల పోటీలో మొదటి ప్రైజ్ ఎలా సాధించిందని మల్లిక నెత్తి గోక్కుంటుంది. తర్వాత అందరూ ఇంటికి వస్తారు. మల్లిక మాత్రం ఏదో కోల్పోయిన దానిలా తెగ బాధపడుతుంటుంది. గోవింద రోజు కూడా తనను హేళన చేస్తాడు. తర్వాత ఇంట్లోకి అందరూ వెళ్లగానే విష్ణు, అఖిల్, వెన్నెల.. జానకికి అభినందనలు చెబుతారు. నువ్వు కేకు ఇంత గొప్పగా చేస్తావని నేను అనుకోలేదు జానకి అంటుంది జ్ఞానాంబ. నువ్వు ఎప్పుడూ మన కుటుంబాన్ని, మన కొట్టు గౌరవాన్ని కాపాడుతూనే ఉన్నావు అంటుంది.

janaki kalaganaledu 18 december 2021 episode

janaki kalaganaledu 18 december 2021 episode

నువ్వు ఇక రేపటి నుంచే మన కొట్టులో కేకులు తయారు చేయొచ్చు అంటుంది జ్ఞానాంబ. రేపటి నుంచి నువ్వు రాజమండ్రి వెళ్లాల్సిన అవసరం లేదు. కేకుల తయారీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటుంది జ్ఞానాంబ. దీంతో రామా, జానకి షాక్ అవుతారు. ఇలా జరిగిందేంటండి అంటుంది జానకి. రేపు అసలే ముఖ్యమైన పరీక్ష ఉంది. దానికి ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఒకవేళ దానికి అటెండ్ కాకపోతే ఇన్ని రోజులు వెళ్లిన కోచింగ్ వేస్ట్ అవుతుందండి అంటుంది జానకి. మీరేం టెన్షన్ పడకండి. మీరు ఎలాగైనా ఖచ్చితంగా రేపు పరీక్ష రాసేలా నేను చూసుకుంటాను అంటాడు రామా. కానీ.. జానకిని ఎలా రాజమండ్రిని తీసుకెళ్లాలని రామా ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మకు ఏం చెప్పి జానకి గారిని తీసుకెళ్లాలి అని అనుకుంటాడు.

మరోవైపు మల్లిక తెగ బాధపడుతుంటుంది. జానకిని అత్తయ్య గారి ముందు బుక్ చేద్దామని నేను అనుకుంటే.. నేనే బుక్ అయిపోయాను.. అని అనుకుంటుంది మల్లిక. ఇంతలో చికిత వచ్చి పెద్దమ్మ గారు వస్తున్నారు అని చెబుతుంది చికిత. నాకోసం వస్తున్నారా.. నాకోసం ఎందుకు అని అడుగుతుంది మల్లిక.

Janaki Kalaganaledu 20 Dec Episode Highlights : కేకులు నేర్చుకో అని మల్లికకు చెప్పిన జ్ఞానాంబ

నాకు తెలియదండి అంటుంది. ఎప్పుడైనా నన్నే పిలుస్తారు కానీ.. ఈసారి నన్నెందుకు పిలిచారు అంటుంది. దీంతో మీ చెంప గుయ్ మనిపించడానికి కాబోలు అండి అంటుంది చికిత. అంతే అంటావా అంటుంది మల్లిక. అవునండి.. అందుకే మీ దగ్గరికి వస్తుంది అంటుంది.

ఇంతలోనే జ్ఞానాంబ వస్తుంది. మల్లిక అని పిలుస్తుంది. దీంతో మల్లిక షాక్ అవుతుంది. అత్తయ్య గారు అంటూ దూరం వెళ్తుంది. తన ముందు అతి వినయం ప్రదర్శిస్తుంది మల్లిక. నీ అతి వినయాన్ని పక్కన పెట్టు కానీ.. రేపటి నుంచి ఖార్ఖానాకు వెళ్లి జానకితో కలిసి కేకులు తయారుచేయడం నేర్చుకో అంటుంది.

దీంతో మీరు వచ్చింది అందుకా అత్తయ్య గారు అంటుంది మల్లిక. అందుకే.. మరి ఇంకా దేనికి అనుకున్నావు అంటుంది జ్ఞానాంబ. ఇంకేం లేదు.. అంటుంది మల్లిక. మీరు నాకోసం ప్రత్యేకంగా వస్తే ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఏమో అనుకున్నా అంటుంది మల్లిక.

ఏమిటో.. నువ్వే కాదు.. నీ మాటలు కూడా తిక్కతిక్కగా ఉన్నాయి. సర్లే.. రేపటి నుంచి వెళ్లి తగలడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. మరోవైపు జానకి, రామా.. ఇద్దరూ లవ్ చేసుకుంటారు. ఇంటి బయట గార్డెన్ దగ్గర రామా, జానకి ఇద్దరూ పాట పాడుకుంటూ ప్రేమించుకుంటారు.

ఇద్దరూ ఒకరిని మరొకరు చూసుకుంటూ సిగ్గుపడతారు. జానకి కేకుల పోటీలో గెలిచిందని జ్ఞానాంబ మెచ్చుకోవడంతో జానకి, రామా తెగ సంతోషిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp