janaki kalaganaledu 20 december 2021 full episode
Janaki Kalaganaledu 20 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 20 డిసెంబర్ 2021, సోమవారం 196 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రేపటి నుంచి నువ్వు జానకితో కలిసి ఖార్ఖానాకు వెళ్లి కేకులు నేర్చుకో అని మల్లికకు చెబుతుంది జ్ఞానాంబ. మరోవైపు జానకి.. రేపటి పరీక్ష కోసం సీరియస్ గా చదువుకుంటూ ఉంటుంది. రాత్రి నిద్రపోకుండా తను చదువుకోవడం రామా చూస్తాడు. జానకి గారు ఏంటండి ఇది. టైమ్ ఎంత అయిందో తెలుసా? అంటాడు. ఒంటి గంట అవుతుంది. ఈ టైమ్ లో నిద్రపోకుండా.. ఏం చేస్తున్నారు.. అంటే రేపు అకాడెమీలో పరీక్ష ఉంది. అందులో ఫస్ట్ వస్తే అభినందన సభలో పాల్గొనే అవకాశం వస్తుంది అంటుంది జానకి. ఓహ్.. అవునా.. అంటాడు రామా. ఫస్ట్ వస్తే.. మనకు ఫీజులో కూడా కొంచెం రాయితీ ఇస్తారు. మీరు ఫీజు కోసం కష్టపడకుండా మనకు కొంచెం సాయం అవుతుంది కదా అంటుంది జానకి.
janaki kalaganaledu 20 december 2021 full episode
అంతే అండి అంతే.. మీ ఒంటి మీదికి ఐపీఎస్ డ్రెస్ వచ్చేసినట్టే అంటాడు రామా. మీరు చదువుకోండి. కష్టపడి చదువుకోండి అంటాడు రామా. ఇంతలో కరెంట్ పోతుంది. దీంతో అబ్బా ఇప్పుడే కరెంట్ పోవాలా అని అంటుంది జానకి. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో అంటుంది. దీంతో రామాకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఎలాంటి ఆటంకం లేకుండా చదువుకోవాలి అంతే కదా అంటాడు రామా. అవునండి అంటుంది జానకి. అయితే మీరు పుస్తకాలు తీసుకొని బయటికి రండి.. నేను చెబుతాను అంటాడు. దీంతో తన పుస్తకాలు తీసుకొని బయటికి వస్తుంది జానకి. ఇంటి డోర్ తీస్తాడు. బయటికి తీసుకెళ్లి వరండా మీద కూర్చోమంటాడు రామా. తన బుల్లెట్ బైక్ స్టార్ట్ చేసి లైట్ ఆన్ చేసి.. తన వైపు తిప్పుతాడు రామా. దీంతో తనకు వెలుగు వస్తుంది. వెంటనే చదువు ప్రారంభిస్తుంది.
జానకి గారు ఇప్పుడు ఓకేనా అంటాడు రామా. ఓకే అండి అంటుంది. ఇక ఎందుకు ఆలస్యం చదువుకోండి ఇక అంటాడు రామా. ఏ సమస్యకైనా ఇట్టే పరిష్కారం చూపే సామర్థ్యం మీసొంతం. మీరు చదువుకొని ఉంటే ఇంకా గొప్పోళ్లు అయి ఉండేవారు అంటుంది జానకి. నేను చదువుకోకపోతేనేం. మీరు చదువుకున్నారు కదా. రేపు మీరు ఐపీఎస్ అయితే అది నా గెలుపు అంటాడు రామా.
జానకికి నిద్ర వస్తుందని.. తన కోసం టీ తయారు చేస్తాడు రామా. అర్ధరాత్రి వెన్నెల వెలుగులో బండి వెలుగులో చదువుకుంటున్న నా శ్రీమతి కోసం ఈ శ్రీవారి ఎస్పెషల్ గ్రీన్ టీ అనుకొని తీసుకెళ్లబోతుండగా ఇంతలో మల్లిక మంచినీళ్ల కోసం లేస్తుంది. రామా, జానకి రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో ఏమైంది అని లోపల చూస్తుంది. రూమ్ లో ఇద్దరూ కనిపించరు.
ఈ మొగుడుపెళ్లాలు ఖచ్చితంగా ఏదో ప్రోగ్రామ్ పెట్టారు. కనిపెడతా.. ఖచ్చితంగా కనిపెడతా.. కనిపెట్టి ఆ పోలేరమ్మకు చెప్పేస్తా అని అనుకుంటుంది మల్లిక. వంట గదికి వెళ్లి చెక్ చేస్తుంది. అక్కడే డోర్ పక్కన దాక్కొని ఉంటాడు రామా. అక్కడ లేరని బయటికి వెళ్దామని మల్లిక బయలుదేరుతుంది.
తన వెనుకే వెళ్తాడు రామా. ఇప్పుడు కానీ.. మల్లిక కానీ డోర్ తీసిందంటే.. బాబోయ్ ఈ మల్లికను ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి అనుకుంటాడు. దీంతో తనకు ఓ ఆలోచన వస్తుంది. దీంతో నిమ్మకాయలు తీసుకొచ్చి తన మీద విసురుతాడు. దాన్ని చూసి షాక్ అవుతుంది. ఈ నిమ్మకాయ మీద పసుపు కుంకుమ ఉంది ఏంటి.. అంటూ భయపడుతుంది.
మల్లికను భయపెడుతాడు రామా. దీంతో అక్కడే కూర్చుంటుంది మల్లిక. ఆతర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
This website uses cookies.