samantha shocking replies to oo antava mava troll viral video
samantha : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కడ విన్నా.. ఊ అంటావా మామ ఊ ఊ అంటావా అనే పాట వినిపిస్తోంది. క్లబ్బుల్లో, పబ్బుల్లో, ప్రైవేట్ పార్టీల్లో అంతా ఈ పాట పెట్టుకుని ఊగి పోతున్నారు. పుష్ప సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతీ పాటకు మంచి పేరు రాగా… ఇటీవల విడుదలైన ఈ స్పెషల్ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సాంగ్ కు బన్నీ తో పాటు సమంత స్టెప్పులేయడంతో ఆ పాటకి మరింత క్రేజ్ వచ్చింది. ఫోక్ సింగర్ మంగ్లి చెల్లెలు ఇంద్రావతి చౌహన్ మత్తు వాయిస్.. చంద్రబోస్ లిరిక్స్‌కు శ్రోతలకు కిక్కిస్తోంది. యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్న ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఇదిలా ఉండగా పాటకు ఎంత పేరైతే వస్తుందో…అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఊ అంటావా మామ పాటలో వాడిన పదాలు పురుషుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ ఏపీ పురుషుల సంఘం.. ఆంధ్రప్రదేశ్ కోర్టును ఆశ్రయించింది. చిత్ర బృందంతో పాటు పాటలో నటించిన సమంతపై కూడా కేసు పెట్టింది. ఈ వివాదాలన్నింటిపై ఇన్ని రోజులు అంతగా స్పందించని సమంత… సాంగ్ పై వచ్చిన ట్రోల్స్‌పై మాత్రం స్పందించింది.ఊ అంటావా మామ పాటకు సంబంధించి సోషల్ మీడియాలో రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల కొంత మంది యువకులు సాంగ్‌పై ఓ వీడియో తయారు చేసి పోస్ట్ చేశారు. అయితే ఇది నెట్టింట ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. వీడియోలో ఓ యువకుడు ఎగ్జామ్ ఉంది కదరా అంటూ ఉండగా… అవతలి వ్యక్తి అందుకు బదులిస్తూ.. అదే భయంగా ఉందిరా ఎగ్జామ్‌లో ఎక్కడ ఊ అంటావా మావ.. ఉ ఉ అంటావా మామా అని రాసేస్తానేమోనని అంటాడు.
samantha shocking replies to oo antava mava troll viral video
నెట్టింట తెగ వైరల్ అవుతున్న పోస్ట్ పై సమంత తనదైన శైలిలో స్పందించింది. పోస్ట్ ను రీట్వీట్ చేస్తూ లాఫింగ్ ఎమోజీలను జోడించి మరి పోస్ట్ చేసింది. .దీన్ని బట్టి చూస్తే సామ్ ఈ సాంగ్ పై వస్తున్న విమర్శలను ఏమాత్రం లెక్క చేయకుండా.. కేవలం పాజిటివ్ గా వస్తున్న రివ్యూలపైనే స్పందించాలని డిసైడ్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోందినాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతోంది. తన విడాకుల వార్తలపై ఎవరెన్ని రకాలుగా కామెంట్స్ చేసిన సామ్ నోరు మెదపడకుండా తన రూట్లో తాను వెళ్తోంది. సమంత ప్రస్తుతం గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలంతో పాటు… పాన్ ఇండియా మూవీ యశోదలో నటిస్తోంది. అలాగే అరెంజ్‌మెంట్ ఆఫ్ లవ్ అనే ఓ హాలీవుడ్ మూవీ లోనూ తాను యాక్ట్ చేస్తోంది.
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
This website uses cookies.