Janaki Kalaganaledu 21 Sep Today Episode : అఖిల్, జెస్సీకి పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చిన జానకి.. వాళ్లను చూసి జ్ఞానాంబ షాక్.. జానకిని ఏం చేస్తుంది?

Authored By Varun G | The Telugu News | Updated on: September 21, 2022, 10:06 am

Janaki Kalaganaledu 21 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 సెప్టెంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 393 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అఖిల్ తో జెస్సీ పెళ్లి జరగదు. మీరు గొంతు చించుకొని అరిచినంత మాత్రాన అబద్ధం నిజం అయిపోదు అంటుంది జ్ఞానాంబ. దీంతో ఎందుకు తొందరపడటం.. ఒకసారి ఆలోచిద్దాం అని జ్ఞానాంబతో గోవిందరాజు అంటాడు. దీంతో ఇంటికొచ్చి అరిచేది వాళ్లు అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత మీకు రేపటి లోగా టైమ్ ఇస్తున్నా. అప్పటిలోకా నా కూతురు పెళ్లి నీ కొడుకుతో చేయకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయి అని చెప్పి అక్కడి నుంచి పీటర్, అతడి భార్య వెళ్లిపోతారు. ఆ తర్వాత జానకి.. నిన్ను నేను చాలా నమ్మాను. నువ్వు ఈ విషయంలో కరెక్ట్ గా ఉంటావనుకున్నా. రేపు మన ఇంట్లో వినాయక నిమజ్జనం ఉంది. నువ్వు రేపటి లోగా ఈ విషయాన్ని నిరూపించకపోతే ఆ అమ్మాయి ప్రస్తావన ఇక ఈ ఇంట్లో వినిపించకూడదు అని చెప్పి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

janaki kalaganaledu 21 september 2022 full episode

janaki kalaganaledu 21 september 2022 full episode

రేపటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలన్న మాట. రేపు ఎలాగోలా ప్రశాంతంగా ఉంటే ఇక జెస్సీ పేరు ఈ ఇంట్లో వినిపించదు అని అనుకుంటాడు అఖిల్. ఆ తర్వాత నేను పెట్టిన చిచ్చు బాగానే రగులుతోంది అని మల్లిక అనుకుంటుంది. రేపటి లోగా ఎలా నిరూపించాలి అని రామా, జానకి ఆలోచిస్తారు. మరోవైపు జ్ఞానాంబ ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు అఖిల్ ఒక్కడే టెన్షన్ పడుతూ ఉంటాడు. అమ్మ సపోర్ట్ ఎలాగూ నాకు ఉంది కాబట్టి వినాయక చవితిలోపు వదిన నిజం నిరూపించకపోతే నేను సేఫ్ అయినట్టే అని అనుకుంటాడు అఖిల్. మరోవైపు ఏం చేయాలా అని రాత్రి ఆలోచిస్తూ ఉంటుంది జానకి.

కట్ చేస్తే తెల్లవారుతుంది. వినాయక చవితి నిమజ్జనం వేడుకలు ప్రారంభం అవుతాయి. ఊరి వారంతా వచ్చి డ్యాన్సులు చేస్తుంటారు. అసలు జానకి ఎక్కడికి వెళ్లింది అని అటూ ఇటూ చూస్తుంటుంది మల్లిక. అసలు వీళ్లు ఎక్కడ తగలబడ్డారు అని అనుకుంటుంది మల్లిక.

లోపలికి వచ్చి జ్ఞానాంబతో చెబుదామని అనుకున్నా తను పూజ చేస్తుంటే తనను ఏం అడగకుండా ఊరేగింపులో ఉన్నారేమో అని వెళ్లి చూస్తుంది మల్లిక. కానీ.. తనకు అక్కడ కూడా కనిపించరు. ఇంతలో అక్కడికి ఒక కారు వస్తుంది. ఆ కారులో రామా, జానకి వస్తారు.

Janaki Kalaganaledu 21 Sep Today Episode : వినాయక నిమజ్జనం ప్రారంభం

కారులో నుంచి రామా, జానకితో పాటు అఖిల్, జెస్సీ కూడా దిగుతారు. ఇద్దరి మెడలో దండ ఉంటుంది. వాళ్లను చూసి మల్లిక షాక్ అవుతుంది. గోవిందరాజు కూడా చూసి షాక్ అవుతాడు. ఊరేగింపులో ఉన్నవాళ్లంతా చూసి అఖిల్ పెళ్లి చేసుకొని వచ్చాడు అంటూ డ్యాన్సు చేస్తుంటారు.

లోపల జ్ఞానాంబ పూజ చేస్తూ ఉంటుంది. వెంటనే పోలేరమ్మకు చెప్పాలి అని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది మల్లిక. అత్తయ్య గారు మిమ్మల్ని మోసం చేశారు. జానకి, బావ గారు మిమ్మల్ని మోసం చేసి అఖిల్, జెస్సీకి పెళ్లి చేసుకొని తీసుకొచ్చారు అని చెబుతుంది మల్లిక.

దీంతో జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ కు గురవుతుంది. మరోవైపు జానకి, రామాలు ఇద్దరూ కలిసి అఖిల్, జెస్సీని లోపలికి తీసుకెళ్లబోతుంటారు. మరోవైపు వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తారు ఊరి వాళ్లు. కుడి కాలు లోపల పెట్టి పదండి అని అంటుంది జానకి.

దీంతో ఆగండి అని అంటుంది జ్ఞానాంబ. వీళ్ల పెళ్లి పోలేరమ్మ చేతుల్లో చావుకు వచ్చింది అని అనుకుంటుంది మల్లిక. జానకి మీ మాటకు విలువ ఇవ్వకుండా వాళ్లిద్దరికీ పెళ్లి చేసి చాలా తప్పు చేసింది. మిగిలిన నాలుగు అంకెలు కూడా ఒకేసారి కొట్టేయండి అత్తయ్య గారు అంటుంది మల్లిక.

ఇంతలో చికిత ఎర్రనీళ్లు తీసుకొని వస్తుంది. జానకి.. కొత్త జంటకు హారతికి ఇచ్చి లోపలికి తీసుకొనిరా అని అంటుంది జ్ఞానాంబ. దీంతో  అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వీళ్లకు హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లమంటోంది ఏంటి పోలేరమ్మ. ఇదేం ట్విస్ట్ రా బాబోయ్ అని అనుకుంటుంది మల్లిక.

దీంతో జానకి.. వాళ్లకు హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది. అసలు ఏం జరిగింది అంటే.. రాత్రి అఖిల్ తో జానకి మాట్లాడటం జ్ఞానాంబ వింటుంది. అత్తయ్య గారి ముందు ఇప్పటికైనా నిజం ఒప్పుకో. నీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను అంటుంది జానకి.

దీంతో సారీ వదిన.. ఆ టైమ్ దాటిపోయింది. రేపు నిమజ్జనం లోపు నువ్వు నిజం నిరూపించకపోతే జెస్సీ టాపిక్ ఈ ఇంట్లో వినిపించకూడదని అమ్మ చెప్పింది కదా అని అంటాడు అఖిల్. అమ్మ నన్ను నమ్ముతోంది కాబట్టి ఇక ఎప్పటికీ ఈ నిజం అమ్మకు తెలిసే అవకాశం లేదు వదిన అని అంటాడు అఖిల్. అవన్నీ జ్ఞానాంబ వింటుంది.

ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతుంది జానకి. ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అంటుంది. నేను కూడా పెళ్లయి కోడలుగా అడుగుపెట్టాక నిన్ను మరిదిగా చూడలేదు. కొడుకుగా చూశాను. నువ్వు చేసిన చిన్నచిన్న తప్పులను అత్తయ్య గారి దగ్గర కవర్ చేశాను అని అంటుంది.

కట్ చేస్తే నిన్ను నమ్మి జానకి, రామాను అనుమానించాను అని అఖిల్ పై చేయి చేసుకుంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp