Jr NTR : బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీతో జూనియర్ ఎన్టీఆర్‌కు లాభమా.. నష్టమా?
Jr NTR : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడని మరోసారి వార్తలు వస్తున్నాయి. ఇదే మాట గత మూడేళ్లగా వినిపిస్తోంది.కానీ ఇప్పటివరకు కనీసం అతిథి పాత్రలో కూడా అతను కనిపించలేదు.దీంతో నందమూరి అభిమానులు తమ యువహీరో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ గ్రాఫ్ పడిపోతుందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇందులో వాస్తవం ఎంతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. […]
Jr NTR : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడని మరోసారి వార్తలు వస్తున్నాయి. ఇదే మాట గత మూడేళ్లగా వినిపిస్తోంది.కానీ ఇప్పటివరకు కనీసం అతిథి పాత్రలో కూడా అతను కనిపించలేదు.దీంతో నందమూరి అభిమానులు తమ యువహీరో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ గ్రాఫ్ పడిపోతుందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇందులో వాస్తవం ఎంతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Mokshagna : మోక్షజ్ఞ రాకతో యంగ్ టైగర్ తగ్గడు..
మోక్షజ్ఞ సినిమాల్లో అడుగుపెట్టినా వెంటనే మైలేజ్ అయితే రాదు.. ఎందుకంటే ఒక్కసినిమాతోనే ఎవరికి నటనపై పెద్దగా గ్రిప్ రాదు. జూనియర్ ఎన్టీఆర్ మాస్ హీరోగా ఎదగడానికి మూడు నుంచి నాలుగు సినిమాలు చేయాల్సి వచ్చింది. ఫ్యాక్షన్ బ్రాగ్రౌండ్‌లో వచ్చిన ఆది, సాంబ, సింహాద్రి వంటి సినిమాలతో ఎన్టీఆర్ సూపర్ స్టార్‌గా ఎదిగాడు.
ఇక మోక్షజ్ఞ ఎటువంటి సినిమాలు ఎంపిక చేసుకుంటాడన్నది ముందు తెలియాల్సి ఉంది. తండ్రి లాగే పవర్ ఫుల్ పాత్రల్లో కనిపిస్తాడా.. లేదా ముందు క్లాస్, లవర్ బాయ్‌లాగా కనిపించి ఆ తర్వాత మాస్ టచ్ ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞ ప్రస్తుతం అమెరికాలో నటనా, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు.ఇక కెమెరా ఫియర్ పోయాక అతను వెండితెరపై కనిపిస్తాడని సమాచారం. ఇప్పటికే బాలయ్య బాబు తనయుడి ఎంట్రీ కోసం మంచి స్టోరీలు రెడీ చేయిస్తున్నారట..
అయితే,మోక్షజ్ఞ ఎంట్రీతో జూనియర్ క్రేజ్ అస్సలు పడిపోదని అంటున్నారు. అతనికే ప్లస్ అవుతుందని అనే వారు లేకపోలేదు. ఎందుకంటే యంగ్ టైగర్ క్వాలిటీస్..అతని నటనకు ఎక్కడా రీమార్క్ లేదు. ఫైటింగ్, డ్యాన్స్, యాక్టింగ్ అన్నింటిలోనూ జూనియర్ నెంబర్ వన్. తన తమ్ముడు వచ్చినా వీరిద్దరికి గ్యాప్ చాలా ఉంటుంది. గతంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా ఉన్నప్పుడు బాలయ్య సినిమాలు చేసినా అన్నగారి క్రేజ్ తగ్గలేదు. తండ్రి కొడుకుల సినిమాలకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. అదే సీన్ ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందని అంటున్నారు.