janaki kalaganaledu 23 february 2022 full episode
Janaki Kalaganaledu 23 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 ఫిబ్రవరి 2022, బుధవారం ఎపిసోడ్ 243 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇన్నేళ్లు మీతో కలిసి ఉన్నాను. నాకు మీ బాధ అర్థం కాదా. వదిలేశాను అని చెప్పినంత తేలిక కాదు జానకి గారు బాధను వదిలేయడం అంటాడు రామా. దీంతో తప్పదు రామా గారు. మన ఆలోచనలతో ఎదుటివాళ్లను బాధపెట్టే హక్కు మనకు లేదు. ఈ విషయంలో అత్తయ్య గారు బాధపడేలా చేయడం నేనైతే.. అప్పుడు కోడలుగా నేను ఓడిపోయినట్టే కదా అంటుంది జానకి. అమ్మ సర్టిఫికెట్లు తీసుకున్న విషయం మీరు నాకు చెబితే.. నేను బాధపడతానని మీరు నాకు చెప్పలేదనే విషయం నాకు తెలుసు. కానీ.. ఒక మంచి ఆశయం చచ్చిపోతుందండి అంటాడు రామా.
janaki kalaganaledu 23 february 2022 full episode
ఎదుటివాళ్లను బాధపెట్టే హక్కు మనకు లేదు అని మీరే అంటారు కదా. అలాగే నా భార్య బాధపడుతుంటే చూసి తట్టుకునే హక్కు కూడా నాకు లేదు. కానీ.. ఏదో ఒకరోజు మీరు నీ ఆశయాన్ని సాధించలేకపోయాను అని మీరు బాధపడతారు. కన్నీరు పెట్టుకుంటారు. నీ భార్య ఇష్టం ఏంటో తెలుసు. భయం ఏంటో తెలుసు. తెలిసి కూడా వాటిని నిజం చేయలేకపోయావు అని ఆ కన్నీళ్లు నన్ను ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్పాలి అంటాడు రామా. ఒకరి కోసం మరొకరు బతకడం అంటే వాళ్ల ఇష్టాలను కన్నీళ్లను గెలిపించడం. మీ ఐపీఎస్ చదివి నా కలను గెలిపించండి అంటాడు రామా. దయచేసి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం, మన కుటుంబం అందరూ సంతోషంగా ఉంటాం అంటుంది జానకి. మీరు అమ్మకు సర్టిఫికెట్లు ఇచ్చి కోనేటిలో దీపంతో పాటు మీ చదువును కూడా వదిలేశారు కదా.. అంటాడు రామా.
భరిద్ధాం.. సహిద్దాం.. కానీ.. కలను సాదిద్ధాం అంటాడు రామా. అమ్మను ఒప్పించే బాధ్యత నాది. మీ మనసులో ఉన్న భయాలన్నీ తీసి పక్కనపెట్టి దయచేసి మన కలను నిజం చేయండి. భర్తగా నన్ను గెలిపించండి. చదువుకోండి జానకి గారు అంటాడు రామా.
తన చేతులను వదిలేస్తాడు. పక్కనే ఉన్న గడ్డపారను తీసుకొచ్చి జానకి అమ్మానాన్న సమాధి ముందే ఓ గోతి తీస్తాడు. మీరు అమ్మకు ఇచ్చిన మాట ముందు అవన్నీ ఓడిపోయాయి అంటాడు రామా. నన్ను ఓడించారు అంటాడు రామా. మీకు ప్రస్తుతం అన్నంటి కంటే అమ్మకు ఇచ్చిన మాటే ముఖ్యం కాబట్టి.. మీరు ఐపీఎస్ పరీక్ష రాయడం కోసం మీ నాన్న గారు కొన్న ఈ పెన్నును వాళ్ల సమాధి పక్కన సమాధి చేయండి అని పెన్నును తన చేతుల్లో పెడతాడు రామా.
ఎంతమంది బాధపడినా.. మీకు మీరిచ్చిన మాటే ముఖ్యం కాబట్టి.. ఐపీఎస్ కలను మీరు సమాధి చేసేయండి అని అంటాడు. దీంతో ఆ పెన్నును చూసి జానకి వెక్కి వెక్కి ఏడుస్తుంది. పై నుంచి మీ అమ్మానాన్న ఆత్మలు బాధపడుతున్నా మీరు అస్సలు పట్టించుకోకండి.. అంటాడు.
మీరు భార్యగా, కూతురుగా ఓడిపోయినా పర్వాలేదు కానీ.. కోడలుగా మాత్రం గెలవండి అంటాడు రామా. మీరు మాత్రం గొప్ప త్యాగం చేశాననే సంతోషంతో బతకండి అంటాడు రామా. ఆ పెన్నును సమాధి చేసి మీ అమ్మానాన్నల సాక్షిగా మీ ప్రాణానికి ప్రాణమైన ఐపీఎస్ కలకు నీళ్లు వదిలేసేయండి అంటాడు రామా.
దీంతో వెళ్లి రామాను హత్తుకుంటుంది జానకి. నేను ఐపీఎస్ చదువుతాను అని చెబుతుంది జానకి. దీంతో రామా సంతోషం వ్యక్తం చేస్తాడు. మరోవైపు జ్ఞానాంబ.. వెన్నెలను పిలుస్తుంది. కూర్చో అంటుంది. సడెన్ గా ఎందుకు పిలిచింది అని టెన్షన్ పడుతుంది వెన్నెల.
మీ జానకి వదిన వాళ్ల బంధువుల అబ్బాయి మొన్న మన ఇంటికి వచ్చాడు కదా అని అడుగుతుంది జ్ఞానాంబ. ఆ అబ్బాయిని నువ్వు ఆరోజు చూశావు కదా అని అడుగుతుంది. జానకి ఏం ఆలోచించినా అందులో మంచే ఉంటుంది. మీ కోసం తను పెళ్లి సంబంధం చూసింది అంటే వాళ్లు ఖచ్చితంగా మంచివాళ్లే అయి ఉంటారు అంటుంది జ్ఞానాంబ.
జానకి వాళ్ల బంధువులు కాబట్టి.. నీకు భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాదు. ఆ అబ్బాయి నీకు నచ్చితే మిగితా ఏర్పాట్లు చూస్తాను అంటుంది జ్ఞానాంబ. ఒక అమ్మగా నేను ఏం ఆలోచించినా నీ సంతోషం గురించే ఆలోచిస్తాను. నీ మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఆ అబ్బాయి నచ్చాడో లేదో చెప్పు అంటుంది జ్ఞానాంబ.
దీంతో సరే అంటుంది జ్ఞానాంబ. వెళ్లు లోపలికి వెళ్లి చదువుకో అంటుంది జ్ఞానాంబ. సారీ అమ్మ అని మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది వెన్నెల. ఇంతలో జానకి, రామా వస్తారు. వదిన.. అంటూ తనను హత్తుకుంటుంది.
జానకి, రామా ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది. వెళ్లి వచ్చారా అని అడుగుతుంది జ్ఞానాంబ. సీఐ గారికి నీ చదువు గురించి నిర్ణయం చెప్పావా అని అడుగుతుంది జ్ఞానాంబ. ఏమన్నారు అని అంటుంది. జానకి గారు ఐపీఎస్ చదవడం ఇష్టం లేదు అని చెప్పగానే బాధపడ్డారు అని చెబుతాడు రామా.
సీఐ గారు ఒప్పుకున్నారు కదా.. మరోసారి ఫోన్ చేసి నీ చదువు గురించి అడగరు కదా అంటుంది జ్ఞానాంబ. దీంతో అడగరు అత్తయ్య.. అంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
This website uses cookies.