Janaki Kalaganaledu 23 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 23 సెప్టెంబర్ 2021, గురువారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 134 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రామా పుట్టిన రోజు కోసం రామాకు జ్ఞానాంబ బ్రాస్ లెట్ చేయిస్తుంది. ఇది నా గుర్తుగా ప్రత్యేకంగా చేయించాను. దీన్ని అస్సలు దూరం చేసుకోకు.. ఎప్పుడూ ఇది నీ చేతికే ఉండాలి.. అని అంటుంది జ్ఞానాంబ. సరే.. అమ్మా.. నీ ప్రేమకు గుర్తుగా దీన్ని ఒక అపురూపమైన జ్ఞాపకంగా దాచుకుంటాను.. అని అంటాడు రామా. ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని బాధపడతాడు. అయినా తప్పని పరిస్థితుల్లో కాబట్టి.. ఆ బ్రాస్ లెట్ ను తీసుకెళ్లి జ్ఞానాంబ పడుకున్న రూమ్ కు వెళ్తాడు. చూస్తే జ్ఞానాంబ పడుకొని ఉంటుంది.
ఇంతలో మల్లిక ఇదంతా గమనిస్తుంది. అసలు ఏం జరుగుతోంది అని అనుకుంటుంది. బావ గారు ఈ సమయంలో అత్తయ్య గారి గదిలోకి వెళ్లారేంటి.. అని ఆలోచిస్తుంటుంది మల్లిక. రామా.. జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి ఆమెను చూస్తూ కూర్చుంటాడు. ఇంతలో మల్లిక అక్కడికి వచ్చి డోర్ తీసి రూమ్ లోకి తొంగి చూస్తుంటుంది.
తన చేతుల్లో ఉన్న బ్రాస్ లెట్ ను తీసి పట్టుకొని తన వైపే చేస్తుంటాడు రామా. అమ్మా.. దీన్ని నీ జ్ఞాపకంగా నాకు ఇచ్చావు. కానీ.. దీన్ని నేను ఎప్పటికీ అపురూపంగా దాచుకుంటా అని చెప్పా. భార్య మనసులో మాట తెలుసుకొని దాన్ని తనకు అందివ్వడం భర్తగా నా బాధ్యత అని చెప్పావు. అందుకే.. నువ్వు నాకు ఇచ్చిన ఈ కానుక.. భార్య కోసం ఉపయోగించుకుంటున్నాను. తప్పయినా సరే తప్పట్లేదు అమ్మా.. అని మనసులో అనుకుంటాడు రామా.
మనసులో చాలా బాధగా ఉందమ్మా. కానీ.. ప్రస్తుతం నాకు ఇంతకంటే మరో దారి కనిపించడం లేదు. అమ్మా.. నా పరిస్థితిని, బాధని అర్థం చేసుకొని నన్ను క్షమించమ్మా.. అని వేడుకుంటాడు లోలోపల. వెంటనే బయటికి వచ్చేస్తుండగానే మల్లిక అతడిని చూసి పారిపోతుంది.
అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదే.. ఆయన గదిలోకి ఎందుకు వచ్చినట్టు.. వాళ్ల అమ్మకు బ్రేస్ లెట్ ఎందుకు చూపించినట్టు. ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అసలు.. ఈ బ్రేస్ లెట్ వెనుక కథ ఏంటో తెలుసుకోవాలంటే తెల్లారాల్సిందే.. అని అనుకుంటుంది.
కట్ చేస్తే తెల్లారుతుంది. కోచింగ్ ఫీజు కట్టడం కోసం రాజమండ్రి వెళ్లడానికి రెడీ అవుతుంటుంది జానకి. నన్ను రెడీ అవ్వమని చెప్పి ఈయన ఎక్కడికి వెళ్లారు.. అని అనుకుంటుంది. ఇంతలో రామా వచ్చి జానకి గారు.. నేను వచ్చేలోపు రెడీ అవ్వమన్నాను కదా.. పదండి.. టైమ్ అవుతుంది.. వెళ్దాం పదాం.. అంటాడు. ఇంతకీ మీరు ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది జానకి. ఇది బ్రహ్మరహస్యం.. ఎవ్వరికీ చెప్పొద్దు.. అనగానే చేతుల్లో డబ్బు చూపించి.. ఈ డబ్బును నేనే స్వయంగా తయారు చేసుకొచ్చాను అన్నమాట.. అంటాడు రామా. ఇన్ని డబ్బులు ఒకేసారి ఎలా వచ్చాయి. ఎవరి దగ్గర అప్పు చేశారు అని అడుగుతుంది జానకి. దీంతో ఏం చెప్పాలో అర్థం కాదు రామాకు.
ఎవరి దగ్గరా ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదండి.. అంటాడు. మరి ఈ లక్ష రూపాయలు ఎలా వచ్చాయి అండి. అత్తయ్య గారిని అడిగారా.. అన్నా కూడా లేదండి.. అంటాడు. జానకి గారు మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఆ మనసు చెప్పిన మార్గంలో ఈ డబ్బులు సమకూర్చాను.. అంటాడు రామా.
జానకి గారు డబ్బుల గురించి మీరు మాట్లాడొద్దు అని చెప్పాను కదా. ఇది నా బాధ్యత.. మీరు డబ్బుల విషయం పక్కన పెట్టి.. మీరు చదువు మీద దృష్టి పెట్టండి చాలు.. అంటాడు రామా. అదికాదండి.. మీరు డబ్బుల కోసం ఎవరి ముందు చేయి చాచారు.. ఎవరి ముందు అవమాన పడ్డారో అని భయమేస్తుంది అంటుంది జానకి.
మీరు అవేమీ పట్టించుకోండి.. రండి.. అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్తే మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయినట్టే.. అని చెప్పి బయటికి తీసుకొచ్చి అమ్మా.. నాన్నా అని పిలుస్తాడు. దీంతో ఏంటి రామా అని అడుగుతుంది జ్ఞానాంబ. ఈరోజు నుంచి జానకి గారు రాజమండ్రి వెళ్తున్నారు అని చెబుతాడు రామా. మీ ఇద్దరి దగ్గర ఆశీస్సులు తీసుకొని వెళ్తే అన్ని విధాలుగా శుభం జరుగుతుంది అని అంటాడు రామా. మీ దీవెనలతో జానకి గారు అనుకున్నది సాధిస్తారు.. అంటాడు రామా.
ఏంటి జానకి.. ఏదైనా ఐఏఎస్, ఐపీఎస్ చదవడానికి వెళ్తున్నావా ఏంటి.. అంటూ మల్లిక అనగానే అందరూ షాక్ అవుతారు. ఏంటి మల్లిక అలా అంటున్నావు.. అనగానే.. ఏదో పెద్ద చదువులు చదవడానికి వెళ్తున్నట్టు అత్తయ్య ఆశీర్వాదం ఎందుకు అనగానే.. నేను కేకులు తయారు చేయడానికి వెళ్తున్నాను.. దాంట్లో తప్పు ఏముంది అని చెబుతుంది జానకి.
జ్ఞానాంబ కూడా మల్లికను తిడుతుంది. తోటి కోడలు కేకులు నేర్చుకొని మన బిజినెస్ ను పెంచుదామని ప్రయత్నిస్తుంటే నువ్వు మాత్రం వాళ్ల మీద ఆడిపోసుకుంటున్నావు.. అని అంటుంది జ్ఞానాంబ. ఇక.. జానకి.. జ్ఞానాంబ ఆశీర్వాదం తీసుకుంటుంది. నువ్వు అనుకుంటే ఎంత కష్టమైనా సాధించగలవని.. ఆరోజు ఐదు లక్షల కాంట్రాక్ట్ ను చేసినప్పుడే నాకు అర్థం అయింది.. అని అంటుంది జ్ఞానాంబ.
ఏమండి.. అమ్మాయికి ఓ ఐదు వేలు ఇవ్వండి.. అంటుంది జ్ఞానాంబ. వాటిని తీసుకొని వెళ్లొస్తాను అత్తయ్య గారు.. వెళ్లొస్తా మామయ్య గారు అని చెప్పి జానకి వెళ్లిపోతుంది.
కట్ చేస్తే.. జానకి, రామా.. ఇద్దరూ బైక్ మీద కోచింగ్ సెంటర్ కు వస్తారు. జానకి గారు మీ బడి వచ్చేసిందండి.. వెళ్లి ఫీజు కట్టేయండి.. అని చెబుతాడు రామా. పాఠాలు ఎప్పుడు చెబుతారో కూడా కనుక్కొని వచ్చేయండి అని చెబుతాడు రామా. మీరు కూడా ఫీజు కట్టేటప్పుడు రండి.. అని అడుగుతుంది జానకి.
కట్ చేస్తే.. జ్ఞానాంబ, తన భర్త.. ఇద్దరూ ఓ పిల్లాడిని ఎత్తుకొని తెగ ఆనంద పడుతుంటారు. ఫీజు కట్టాక.. జానకి, రామా.. ఇద్దరూ ఒక చోట ఆగి.. చింత కాయలు కొట్టుకొని వాటిని తింటూ ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే.. జ్ఞానాంబ.. జానకిని చూసి జానకి ఇది నిజమేనా. నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదమ్మా అని అడుగుతుంది. దీంతో జానకికి ఏం అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.