Janaki Kalaganaledu 24 Jan Tomorrow Episode : కన్నబాబు అసలు నిజం చెబుతాడా? జానకి ఎందుకు కన్నబాబును కొట్టిందో తెలుస్తుందా? జ్ఞానాంబ ఏ నిర్ణయం తీసుకుంటుంది?

Janaki Kalaganaledu 24 Jan Tomorrow Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 24 జనవరి 2022, ఎపిసోడ్ 220 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బస్సు ప్రమాదంలో జానకి చనిపోయిందేమో అని రామా టెన్షన్ పడతాడు. జ్ఞానాంబ కూడా ఆసుపత్రికి వెళ్తుంది. మార్చురీలో తన మృతదేహం ఉందేమోనని వెతుకుతారు. కానీ.. కనిపించదు. దీంతో ఊపిరిపీల్చుకుంటారు. ఇంతలోనే జానకి నుంచి ఫోన్ వస్తుంది. నేను బతికే ఉన్నానని.. మీరేం టెన్షన్ పడొద్దని జానకి.. రామాకు ఫోన్ చేస్తుంది. దీంతో రామాకు ఊపిరి తిరిగి వచ్చినంత పని అవుతుంది. ఇంతకీ మీరు ఎక్కడున్నారు. బస్సు ప్రమాదం నుంచి ఎలా తప్పించుకున్నారు అని అడుగుతాడు రామా.

janaki kalaganaledu 24 january 2022 episode highlights

దీంతో అన్ని విషయాలు చెబుతుంది జానకి. వెంటనే జానకి ఎక్కడుందో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్తాడు రామా. ఆ తర్వాత జానకిని చూసి వెంటనే హత్తుకుంటాడు. మన ప్రాణాలు వేరైనా ఒకే ఊపిరిగా బతుకుతున్నాం. మీకు ఏమైనా అయితే ఈ ఊపిరి ఉంటుందా చెప్పండి అంటాడు రామా. మీరు ఫోన్ చేయడం ఒక్క క్షణం ఆలస్యమైనా నేను ఇప్పుడు మీముందు ఉండేవాడిని కాదు అంటాడు రామా. మన ప్రేమ.. నాకు ఎప్పటికీ తోడుగా ఉంటుంది. ఇప్పటికీ ఉంది. అదే ప్రేమ నన్ను ఈ ప్రమాదం నుంచి బయట పడేసింది అంటుంది జానకి. జీవచ్ఛవంలా నేను హాస్పిటల్ కు వెళ్లాను. మీరు ఎక్కడున్నారో చూసుకోవాలని వాళ్లు చెప్పగానే ఈ గుండె పడిన బాధ అంతా ఇంతా కాదు జానకి గారు అని చెబుతాడు రామా.

అడుగు ముందుకు పడలేదు. చేయి కదల్లేదు అంటాడు. గుండె ఏ క్షణంలో బద్దలు అవుతుందో తెలియని పరిస్థితి. ఆ నరకాన్ని భరించే శక్తి నాకు లేదు. నన్ను కూడా నా భార్య దగ్గరికి తీసుకెళ్లమని ఆ దేవుడిని వేడుకున్నాను అని చెబుతాడు రామా.

మనది ఆ దేవుడు ముడివేసిన బంధం. ఎవరైనా మనల్ని దూరం చేస్తారా చెప్పండి.. అంటుంది జానకి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీ చేతిని విడిచిపెట్టనని అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాను కానీ.. నేను దగ్గరుండి మిమ్మల్ని బస్సు ఎక్కించాను. ఇచ్చిన మాట తప్పాను. భర్తగా నేను ఓడిపోయానండి అంటాడు రామా.

Janaki Kalaganaledu 24 Jan Tomorrow Episode : మీరు గొప్ప భర్త.. మీరు ఏనాటికీ ఓడిపోరు అని రామాకు చెప్పిన జానకి

మీరు గొప్ప భర్త. మీరు ఎప్పటికీ ఓడిపోరు రామా గారు అంటుంది జానకి. జానకి గారు ఈ గుడి సాక్షిగా మీకు మాటిస్తున్నాను. మరోసారి మీకిలాంటి పరిస్థితి రానివ్వను అంటాడు రామా. దీంతో జానకి సంతోషిస్తుంది. ఇంతలో జ్ఞానాంబ, గోవిందరాజు, వెన్నెల కారులో వస్తారు.

జానకిని చూసి వెన్నెల పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంటుంది. గోవిందరాజు కూడా తన దగ్గరికి వెళ్తాడు కానీ.. జ్ఞానాంబ మాత్రం జానకి దగ్గరికి వెళ్లదు. జరిగిందేదో జరిగిపోయింది. కోడలును ఇంటికి తీసుకెళ్దాం పదా అని జ్ఞానాంబతో అంటాడు గోవిందరాజు.

కానీ.. జ్ఞానాంబ మాత్రం వినదు. జానకి ఇంటికి రావాలంటే మేము ఇద్దరం ఒక చోటుకు వెళ్లాలి అంటుంది జ్ఞానాంబ. దీంతో వెంటనే జానకిని తీసుకొని జ్ఞానాంబ తన తోటకు వెళ్తుంది. అంతలోనే కన్నబాబు అక్కడికి వస్తాడు. ఏమైంది అర్జెంట్ గా రమ్మని పిలిచారు అంటాడు కన్నబాబు.

దీంతో నా కోడలు జానకి నిన్ను ఎందుకు కొట్టింది. ఏం జరిగింది చెప్పు అంటూ కన్నబాబును నిలదీస్తుంది జ్ఞానాంబ. దీంతో ఏం చెప్పాలో తెలియక కన్నబాబు నీళ్లు నములుతాడు. ఆ తర్వాత జ్ఞానాంబ ఫ్యామిలీ మొత్తం సంక్రాంతి సంబురాల్లో పాల్గొంటుంది. జానకి, రామా కూడా ఉంటారు. అందరూ కలిసి భోగి మంటల్లో పాల్గొంటారు. సంక్రాంతి సంబురాల్లో పాల్గొని సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

56 minutes ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

1 hour ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

4 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

5 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

6 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

8 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

9 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

18 hours ago