Janaki Kalaganaledu 24 June Today Episode : తనను క్షమించమంటూ జానకిని వేడుకున్న జ్ఞానాంబ.. జానకి తలకు గాయం అవడానికి అసలు కారణం ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 24 June Today Episode : తనను క్షమించమంటూ జానకిని వేడుకున్న జ్ఞానాంబ.. జానకి తలకు గాయం అవడానికి అసలు కారణం ఏంటి?

 Authored By gatla | The Telugu News | Updated on :24 June 2022,11:30 am

Janaki Kalaganaledu 24 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 జూన్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 330 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకిని ఇంటికి తీసుకొస్తారు. డాక్టర్ వచ్చి చూసి ప్రాణానికి ప్రమాదం ఏం లేదు అని చెబుతుంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ప్రాణం పోయే క్షణంలో బాధ ఎలా ఉంటుందో తెలియదు కానీ.. మిమ్మల్ని ఆ పరిస్థితలో చూసినప్పుడు నేను అంతకంటే ఎక్కువ నరకాన్ని చూశాను జానకి గారు అంటాడు రామా. ఇప్పటికీ ఆ భయం పోవడం లేదు అంటాడు. మరోవైపు జానకి ప్రాణాలతో బయటపడిందంటే దానికి కారణం నేనే. నేను శివుడికి నీళ్లతో అభిషేకం చేయడం వల్లే అంటుంది మల్లిక. అసలు.. జానకికి కరెంట్ షాక్ ఎందుకు తగిలింది అని అంటాడు గోవిందరాజు. దీంతో అది కూడా మల్లిక వల్లనే అంటాడు విష్ణు. చాల్లే ఆపండి.. ముందు తనను విశ్రాంతి తీసుకోనివ్వండి.. అందరూ బయటికి పదండి అని చెప్పి అక్కడి నుంచి అందరినీ పంపించేస్తుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 24 june 2022 full episode

janaki kalaganaledu 24 june 2022 full episode

ఆ తర్వాత జరగరానిది మీకు ఏదైనా జరిగి ఉంటే నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు అని రామా అనబోతుంటే వద్దు రామా గారు అలా మాట్లాడకండి అంటుంది. ఊపిరి తీసుకోకుండా అయినా బతకగలనేమో కానీ.. మీరు లేకుండా బతకలేను జానకి గారు. మీరు లేని బతుకు నాకు నరకం మాత్రమే కాదు.. శాపం కూడా అని చెప్పి తనతో జ్యూస్ తాగిపిస్తాడు రామా. అయినా నా ప్రాణమే ఇక్కడ ఉంటే.. వదిలేసి నేను వెళ్లగలనని ఎలా అనుకుంటున్నారండి.. పడుకోండి అంటాడు రామా. కాసేపు విశ్రాంతి తీసుకోండి అంటాడు రామా. దీంతో తను నిద్రపోతుంది. దీంతో జానకి కాళ్లు పడతాడు. ఇంతలో జానకి లేచి తప్పండి అంటుంది. దీంతో తప్పేం కాదు.. భార్యాభర్తలు అంటూ ఒకరి కష్టాన్ని ఇంకొకరు పంచుకోవడం. మీరు పడుకోండి ఏం కాదు అంటాడు రామా. తర్వాత తన కాళ్లు పడతాడు.

కట్ చేస్తే మల్లిక.. 108 బిందెల నీళ్లతో శివుడికి అభిషేకం చేయడంతో తన కాళ్లు బాగా నొప్పి పుడతాయి. మరోవైపు రాత్రి అవుతుంది. వచ్చి జానకితో మాట్లాడుతుంది జ్ఞానాంబ. నువ్వు క్షమించడం కావాలి అంటుంది జ్ఞానాంబ. మీరేం అంటున్నారో నాకు అర్థం కావడం లేదు అంటుంది జానకి.

నువ్వు నన్ను క్షమిస్తావా అని అంటుంది జ్ఞానాంబ. దీంతో మీరు నన్ను క్షమాపణలు అడగడం ఏంటి అంటుంది జానకి. నీ విషయంలో నేను పొరపాటు చేశాను అంటుంది జ్ఞానాంబ. దీంతో లేదు అత్తయ్య గారు మీరు ఎప్పటికీ పొరపాటు చేయరు అంటుంది జానకి.

Janaki Kalaganaledu 24 June Today Episode : జానకికి అన్నం తినిపించిన జ్ఞానాంబ

నేను నిన్ను చాలా బాధపెట్టాను అంటుంది జ్ఞానాంబ. నువ్వు నాతో మాట్లాడుతుంటే చీదరించుకున్నాను. నిన్ను ఒక పురుగులా చాలా చిన్నచూపు చూశాను. ఇదంతా నిన్ను బాధపెట్టడం కాక ఇంకేంటి.. అంటుంది. కాదు మూర్ఖత్వం ఉంది. నేను అనుకున్నదే నిజం అని అనుకున్నా.

నా కొడుకును నువ్వు గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్నావని నీ మీద కోపం పెంచుకున్నాను. నీ చదువుకున్న తెలివితేటలతో నా కొడుకును నాకు దూరం చేసి నా కుటుంబాన్ని ముక్కలు చేస్తున్నావని నమ్మాను. అసలు నాకోడలు ఇలా చేస్తుందా.. చేసే వ్యక్తేనా అని కనీసం ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాను అంటుంది జ్ఞానాంబ.

నువ్వేంటో తెలుసుకున్నాను. నీ మంచితనం ఏంటో కళ్లారా చూశాను. ఆరోజు నీ పొరపాటు లేకపోయినా.. నీ తోటికోడలు కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లావు. స్వీట్ల ఆర్డర్ ను చేసి చూపించావు. మరిదికి చదువు నేర్పించావు. నువ్వు అంత చదువుకున్నా సరే.. నీ భర్తను ఎక్కడా చిన్నచూపు చూడలేదు. నీ భర్తను మీ అన్నయ్య అవమానిస్తే నువ్వు తట్టుకోలేకపోయావు. వంటల పోటీల్లో గెలిపించి మీ ఆయన్ను అవమానించిన వాళ్ల నోళ్లు మూయించావు అంటుంది జ్ఞానాంబ.

నీ గురించి చెప్పిన అబద్ధాలను నిజం అని నమ్మిన నేను.. కళ్ల ముందు జరిగిన ఎన్నో నిజాలను నమ్మలేకపోయాను. నిన్ను బాధపెట్టినందుకు నా మీద నాకే కోపంగా ఉంది. నన్ను క్షమించమ్మా అని వేడుకుంటుంది జ్ఞానాంబ. తప్పండి.. అమ్మ చేతులు ఆశీర్వదించాలి తప్ప క్షమించమని వేడుకోవద్దు. ఇంకోసారి నాకు ఇలా క్షమాపణలు చెప్పి నన్ను బాధపెట్టకండి అత్తయ్య గారు అంటుంది జానకి.

తర్వాత జానకి కోసం రామా అన్నం తీసుకొస్తాడు. దీంతో తనకు అన్నం తినిపిస్తుంది జ్ఞానాంబ. మల్లిక చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది