Janaki Kalaganaledu 24 March Today Episode : ఇంటి బయటే గుడారం వేసుకొని జ్ఞానాంబకు షాకిచ్చిన రామా, జానకి… దీంతో జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం  

Authored By Varun G | The Telugu News | Published on: March 24, 2022, 11:30 am

Janaki Kalaganaledu 24 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 మార్చి 2022, గురువారం ఎపిసోడ్ 264 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి, రామా ఇద్దరినీ జ్ఞానాంబ బయటికి పంపించేసి డోర్ వేస్తుంది. దీంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. మల్లిక మాత్రం చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత జ్ఞానాంబతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు గోవిందరాజు. ఎవరిది తప్పో.. ఎవరిది ఒప్పో నేను మాట్లాడను కానీ.. ఒక్క మాట మాత్రం చెబుతాను జ్ఞానం అంటాడు. ఇవి కేవలం మాటలు కాదు. నా గుండె తట్టుకోలేక బయటికి వస్తున్న మాట అంటాడు. వెళ్లిపోయింది జ్ఞానం. మన ఇంటి నుంచి కళ వెళ్లిపోయింది. ఇప్పుడు మన ఇల్లు చీకటితో నిండిపోయింది జ్ఞానం అంటాడు గోవిందరాజు.

janaki kalaganaledu 24 march 2022 full episode

janaki kalaganaledu 24 march 2022 full episode

నా కొడుకు.. ఈ అమ్మ మనసుకు ఎప్పుడో దూరం అయ్యాడు. వాడి పెళ్లాం ఈ అమ్మ నుంచి నా కొడుకును దూరం చేసింది. ఈ అమ్మ మాటను, గీతను దాటేలా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అమ్మ మీద నా బిడ్డకు ఉన్న ప్రేమను పూర్తిగా చంపేసింది అంటుంది జ్ఞానాంబ. నువ్వు అన్నది కరెక్టే కానీ.. నాకు ఎందుకో నా కోడలు జానకి అలా ప్రవర్తించదు అనిపిస్తోంది అంటాడు గోవిందరాజు. ఇన్నేళ్లలో నా కొడుకు ఏనాడైనా ఈ అమ్మ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడా అంటుంది. రామా మొదటి సారి ఈ అమ్మ గుండెకు గాయం చేశాడు. ఇదంతా ఆవిడ మాయ మాటల వల్లే అంటుంది జ్ఞానాంబ.

తను నా కొడుకును పూర్తిగా మార్చేసింది. ఈ అమ్మ కొంగు పట్టుకొని తిరిగే నా కొడుకును.. భార్య కొంగు పట్టుకొని తిరిగేలా చేసింది. నా కొడుకును నాకు కాకుండా చేసింది.. అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. దీంతో గోవిందరాజుకు ఏం చేయాలో అర్థం కాదు.

మరోవైపు ఎటు వెళ్లాలో తెలియదు రామా, జానకికి. ఈ బాధను భరించడం కంటే చచ్చిపోతే మేలు అనిపిస్తోంది అంటాడు రామా. దీంతో ఏంటండి ఈ మాటలు అంటుంది జానకి. అమ్మతో మాట్లాడకపోతేనే నేను తట్టుకోలను. అలాంటిది అమ్మకు దూరంగా ఉండటం అంటే నేను ఎలా తట్టుకోగలను అంటాడు రామా.

ఎలాగైనా అత్తయ్య గారిని, రామా గారిని కలపాలని ఆలోచిస్తుంది జానకి. వీళ్లు విడిపోవడానికి వీలు లేదు. వీళ్లు కలిసే ఉండాలి అనుకుంటుంది. కట్ చేస్తే తెల్లారుతుంది. ఉదయమే ముగ్గు వేయడానికి బయటికి వస్తుంది మల్లిక. చాలా సంతోషంగా ఉంటుంది.

Janaki Kalaganaledu 24 March Today Episode : జానకి, రామాను చూసి మల్లిక షాక్

ఇప్పుడు ఈ ఇంట్లో ఇక నాదే రాజ్యం అని అనుకుంటుంది. ఇంతలో ఇంటి బయట రామా, జానకి గుడిసె వేసుకొని ఉండటం చూసి షాక్ అవుతుంది మల్లిక. అమ్మ దీనమ్మమ్మ.. ఇది కలా నిజమా.. జానకి వెళ్లిపోయింది కాబట్టి రాత్రంతా ఆనంద పడ్డాను కాబట్టి ఇలా భ్రమ పడుతున్నానా ఏంటి అనుకుంటుంది మల్లిక.

వెంటనే జ్ఞానాంబను పిలుచుకొస్తుంది మల్లిక. చూడండి అత్తయ్య గారు మీరే చూడండి అంటుంది. జ్ఞానాంబ వాళ్లను చూసి షాక్ అవుతుంది. తర్వాత ఇంట్లో వాళ్లంతా బయటికి వస్తారు. జానకి, రామా.. ఇంటి ఎదురుగా గుడిసె వేసుకోవడం చూసి షాక్ అవుతారు.

నేను వెళ్లిపోవాలని చెప్పినా కూడా నా ఇంట్లోనే ఇంకా ఎందుకు ఉన్నారో.. అడగండి అని గోవిందరాజును ప్రశ్నిస్తుంది. దీంతో మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్లిపొమ్మని అమ్మ చెప్పింది కదా.. అయినా ఇక్కడే ఎందుకు ఉన్నారు సమాధానం చెప్పండి అని అడుగుతాడు.

దీంతో నిన్ను చూడకుండా నేను ఉండగలనా అమ్మ అంటాడు రామా. నిన్ను విడిచిపెట్టి నేను వెళ్లగలనా అంటాడు రామా. ఆ తర్వాత నానమ్మ ఇంటి స్థలంలోనే నేను ఉంటున్నాను అంటాడు రామా. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. నా అనే నీ మాటల వెనుక ఎవరు ఉన్నారో నాకు అర్థం అయింది అంటుంది జ్ఞానాంబ. ఆతర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp