Janaki Kalaganaledu 25 Oct Tomorrow Episode : జానకి తనకు విడాకులు ఇస్తోందని తెలుసుకున్న రామా ఏం చేస్తాడు?
Janaki Kalaganaledu 25 Oct Tomorrow Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ప్రసారం కాదు. శనివారం, ఆదివారం ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. శుక్రవారం ఎపిసోడ్ లో జానకి, రామా చేసిన మోసాన్ని తెలుసుకుంటుంది జ్ఞానాంబ. జానకిని చెప్పొద్దని నేనే చెప్పానంటూ అసలు విషయం రామా చెప్పడంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఇన్నాళ్లు జానకి నన్ను మోసం చేసిందని అనుకున్నా కానీ.. నా కొడుకే నన్ను మోసం చేశాడని తెలుసుకోలేకపోయా అని జ్ఞానాంబ చాలా బాధపడుతుంది.

janaki kalaganaledu 24 october 2021 episode highlights
నన్ను మోసం చేసిన నా కొడుకు నాతో మాట్లాడటానికి వీలు లేదు అని ఖరాఖండిగా చెప్పేస్తుంది జ్ఞానాంబ. దీంతో రామా షాక్ అవుతాడు. అమ్మా.. అలా చేయకమ్మా అంటాడు రామా. నువ్వు నన్ను అమ్మా అని పిలవకు. నా కన్న కొడుకే నన్ను మోసం చేస్తే ఇక నేను ఏం చేస్తాను.. అంటూ జ్ఞానాంబ బాధపడుతూ.. తన రూమ్ కు వెళ్లి తన తమ్ముడి ఫోటోను చూస్తుంది.
ఇంతలో జానకి వచ్చి అత్తయ్య గారు అలా మాట్లాడకండి. నేను తప్పు చేస్తే రామాకు ఎందుకు శిక్ష వేస్తున్నారు. ఆ శిక్ష ఏదో నాకే వేయండి. నేను చేసింది తప్పే. నేను, మా అన్నయ్య కలిసి చేసిన తప్పుకు రామా గారిని శిక్షించకండి అని జానకి రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో జ్ఞానాంబ అస్సలు కనికరించదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో. నాతో అస్సలు మాట్లాడకు.. అంటుంది జ్ఞానాంబ.
Janaki Kalaganaledu 25 Oct Tomorrow Episode : జానకి ఇంట్లో లేకపోవడంతో టెన్షన్ పడ్డ రామా
తెల్లారుతుంది. రామా.. భయపడుతూ కొట్టు ఓపెన్ చేస్తాడు. ఉదయం లేవగానే జానకి కూడా సీరియస్ గా బయటికి వెళ్తుంది. ఎవ్వరికీ చెప్పకుండా నడుచుకుంటూ వెళ్లిపోతుంది జానకి. ఇంతలో యోగి ఫోన్ చేసి జానకి ఎక్కడికి వెళ్లింది అని అడుగుతాడు. జానకి గారు ఉదయం నుంచి కనిపించడం లేదు అని చెబుతాడు రామా. దీంతో యోగి షాక్ అవుతాడు. జానకి ఏదైనా నిర్ణయం తీసుకుందా? అని భయపడతాడు. జానకికి ఏమైందో అని తెగ టెన్షన్ పడతాడు.

janaki kalaganaledu 24 october 2021 episode highlights
ఇంతలో జానకి నడుచుకుంటూ అడ్వకేట్ దగ్గరికి వెళ్తుంది. నేను నా భర్తతో విడాకులు కావాలని కోరుకుంటున్నాను. నా భర్తతో నాకు విడాకులు ఇప్పించండి.. అని జానకి లాయర్ ను కోరుతుంది. దానికి సంబంధించిన నోటీసులు ఇవ్వండి అంటుంది. దీంతో జానకికి లాయర్ నోటీసులు అందజేస్తాడు. ఆ నోటీసుల మీద జానకి ఏడుస్తూ సంతకం పెడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.