Categories: EntertainmentNews

Janaki Kalaganaledu 25 July Today Episode : రామ సర్టిఫికెట్స్ తీసుకొస్తాడా.? జానకి అకాడమీలో సబ్మిట్ చేస్తుందా… ఈ విషయం మల్లికా జ్ఞానాంబకు చెప్తుందా…

Janaki Kalaganaledu 25 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా విడుదలైంది. 25 సోమవారం ఎపిసోడ్ 351 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం… గోవిందరాజు అల్మారా తాళం తీసుకొచ్చి నేను మీ అమ్మని మాటల్లో పెడతాను. నువ్వు వెళ్లి జానకి చదువు కాగితాలు తీసుకొని రా అనేసి అంటాడు. ఏంటి నాన్న నువ్వు చెప్పేది దొంగతనంగా తీసుకోవాలా, తప్పదు రా ఇప్పటికి ఈ పరిష్కారం కంటే ఇంకొకటి లేదు. అని గోవిందరాజు అంటాడు. వద్దు మావయ్య గారు వద్దు అత్తయ్య గారికి తెలియకుండా చదువుకుంటున్నామని అత్తయ్య గారిని మోసం చేస్తున్నామని ఇప్పటికే చాలా బాధపడుతున్నాం. ఇలా దొంగతనంగా సర్టిఫికెట్స్ తీసుకెళ్తే అత్తయ్య గారిని ఇంకా మోసం చేసినట్లు అవుతుంది. అంతకంటే పాపం మరోఒకటి ఉండదు. ఒక మంచి పని కోసం ఇది చేస్తుంటే అది మోసం ఎలా అవుతుంది. అమ్మ అది మోసం అవ్వదు. అని గోవిందరాజు అంటాడు.రేపటి రోజున అత్తయ్య గారికి తెలిస్తే నేను నమ్మిన వాళ్లు నన్ను మోసం చేశారు ఎంతో బాధపడతారు.

అవును జానకి గారు చెప్పింది.నిజం, మేము ఇలా చేసావంటే అమ్మ భరించలేదు నాన్న , మమ్మల్ని జీవితాంతం క్షమించదు నాన్న, అది కాదు రామూడు ఒక జీవితాన్ని నిలబెట్టేటప్పుడు అలాంటి దారిలో వెళ్లడం తప్పులేదు అని పురాణాలలోనే చెప్పారు. మంచిని బ్రతికించడం కోసమే తప్ప మోసం కాదు, ఇప్పుడు మీరు చేసేది కూడా అదే, మోసం కాదు, మీ అమ్మ అంటే నాకు ఎంతో ప్రేమ, నేనే చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. మీ అమ్మ గదిలోంచి జానకి చదువు కాగితాలు తీసుకొచ్చి అక్కడ చూపించి మళ్లీ తీసుకొచ్చి మీ అమ్మ గదిలో పెట్టేసేయ్, ఇంకేం ఆలోచించకండి అని రామా కి తాళం ఇస్తాడు. మల్లిక కిటికీలోంచి చూస్తూనే ఉంటుంది. రామ జానకి ఆ తాళాన్ని చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు. మల్లిక వీళ్లు ఏదో గూడు పుఠాణి చేస్తున్నారు. ఏంటో కనిపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. గోవిందరాజు జ్ఞానంబాని బయటికి తీసుకొచ్చేస్తాడు. గదిలో నుంచి, మల్లిక తొంగి తొంగి చూస్తూ ఉంటుంది.

janaki kalaganaledu 15 july 2022 full episode

గోవిందరాజు రామా జానకి మీరు ఇక్కడే ఉండండి నేను చెప్తాను అని అంటాడు. గోవిందరాజు జ్ఞానాంబకు గోరింటాకు పెడుతూ మాటల్లో పెడతాడు, గోవిందరాజు సైగ చేస్తూ ఉంటాడు. మల్లిక దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టు వీళ్ళ సైగల్ వెనక ఏదో గూడుపుఠాణి ఉంది. అనుకుంటుంది. గోవిందరాజు రామ నీ వెళ్ళమని సైగ చేస్తాడు. రామ గదిలోకి వెళ్లి అల్మారాలో నుంచి జానకి చదువు కాగితాలను తీసుకొని అమ్మ, నన్ను క్షమించమ్మా, జానకి చదువు కోసం నిన్ను మోసం చేయక తప్పట్లేదు అని బాధపడుతూ తీసుకొని వస్తాడు. మల్లికా మాత్రం రామని ఫాలో అవుతూనే ఉంటుంది. గోవిందరాజు సైగలతో అని అడుగుతాడు. అప్పుడు రామ ఓకే అని వేలిని చూపిస్తాడు. ఇక వెళ్ళండి అని గోవిందరాజు అంటాడు. సరే అని జానకి రామ ఇద్దరు వెళ్లిపోతారు. సర్టిఫికెట్స్ కాలేజీలో చూపించడానికి జానకి రామ వెళ్ళిపోతారు. జానకి సర్టిఫికెట్స్ ను రామ జానకికి ఇస్తాడు. అది మల్లిగా చూస్తుంది. జానకి, రామ బండిమీద వెళ్లిపోతారు. మల్లిక మాత్రం ఈ కుట్రని ఎలా బయట పెట్టాలి ఎలా బయటపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

మల్లిక వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి ఎక్కడున్నావురా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ తమ్ముడు అక్క నీ దగ్గరికి వస్తున్నా నిన్ను చూడ్డానికి దగ్గర దగ్గర మీ ఊరికి వచ్చేసాను అని అంటాడు. అప్పుడు మల్లికా నువ్వు రాకు అట్నుంచి రామ బావ జానకి ఇద్దరు వాళ్ళు చదువు కాగితాలు తీసుకుని వెళ్తున్నారు. నువ్వు వాళ్లని ఫాలో చేస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు? అన్ని తెలుసుకో అని చెప్తుంది. ఆ కాగితాలు ఎవరికి ఇవ్వడానికి వెళ్తున్నారు. ఆ విషయం నాకు చెప్పు ఆ బ్రహ్మ ఆస్త్రంతో ఇక్కడ భూమి బద్దలయ్యేలా నేను విశ్వరూపం చూపిస్తా అని అంటుంది. మల్లికా, అలాగే అక్క అని వాళ్ళని ఫాలో అవుతాడు. ఇన్ని రోజులు నన్ను కామెడీ విలన్ లాగా లెక్క కట్టారా.. ఇప్పుడు మాత్రం దీంతో జానకికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. అని అంటుంది.

మల్లిక వాళ్ళ తమ్ముడు రామా, జానకిని ఫాలో అవుతూ ఉంటాడు. జానకి రామ అకాడమీలోకి వెళ్తారు. అక్కడికి కూడా మల్లికా వాళ్ళ తమ్ముడు వాళ్ళ వెనకనే వెళుతూ ఉంటాడు. జానకి గారు ఆగండి. ఒక్కసారి మీ కాగితాలు అన్నీ ఉన్నాయా, ఒకసారి చూసుకోండి అని రామా అంటాడు. ఆ ఉన్నాయండి రామ గారు, మీరేం కంగారు పడకండి వెళ్లి సర్టిఫికెట్స్ ని లోపల చూపించేసి రండి అని అంటాడు. రామా, రామ గారు ఈ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత బెస్ట్ స్టూడెంట్ కి షీల్డ్ ప్రజెంటేషన్ ఉంటుంది. మనం మళ్లీ అక్కడికి వెళ్లాలి అని చెప్తుంది జానకి, అలాగేనండి మీరు ఇప్పుడు వెళ్ళండి. అని రామ అంటాడు. మల్లిక వాళ్ళ తమ్ముడు అంతా చూస్తూ ఉంటాడు. మల్లిక వాళ్ళ తమ్ముడు మల్లికకు ఫోన్ చేస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Recent Posts

Affair : చెల్లెలు భ‌ర్త‌తో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. ఆ హీరోని కూడా వ‌ద‌ల్లేదుగా..!

Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…

9 hours ago

TSRTC : రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC

TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…

9 hours ago

Rakhi Festival : రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన రాష్ట్రాలు!

Rakhi Festival :  రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…

11 hours ago

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…

12 hours ago

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…

13 hours ago

Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?

Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…

14 hours ago

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

15 hours ago

Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?

Nara Lokesh  : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…

16 hours ago