Janaki Kalaganaledu 26 April Today Episode : రామా కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్న జ్ఞానాంబ.. జానకి తన నిర్ణయాన్ని విభేదిస్తుందా?

Authored By Varun G | The Telugu News | Updated on: April 26, 2022, 12:39 pm

Janaki Kalaganaledu 26 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 ఏప్రిల్ 2022, మంగళవారం ఎపిసోడ్ 287 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయం లేవగానే రామా గడ్డం గీసుకుంటూ ఉంటాడు. మిరపకాయలు ఏరుతున్న జానకిని అద్దంలో చూస్తుంటాడు. వద్దు అంటుంది జానకి. అక్కడ అందరూ ఉన్నారు వద్దు అన్నా కూడా వినడు రామా. ఇంతలో రామా తనకు కలిగించిన నమ్మకాన్ని గుర్తు చేసుకుంటుంది జానకి. ఒరేయ్ రామా.. పచ్చని చిలకలు తోడుంటే అంటూ గోవింద రాజు సంతోషంగా పాట పాడుతుంటాడు. దీంతో అందరూ నవ్వుతారు. ఈయన ఒకడు సమయం సందర్భం ఉండదు.. పాటలు పాడుతుంటాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది మల్లిక.

janaki kalaganaledu 26 april 2022 full episode

janaki kalaganaledu 26 april 2022 full episode

అందరూ సరదాగా పాట పాడుతూ ఉంటారు. మల్లికకు తెగ కోపం వస్తుంది. నా గొంతు ఘంటసాలలా ఉంటుందంటారు.. అంటాడు గోవిందరాజు. అందరికీ మల్లిక టీ ఇస్తూ ఉంటుంది. మామయ్య గారు తీసుకోండి అంటుంది. మొహమేంటి తేడాగా ఉంది అని అనుకుంటాడు గోవిందరాజు. పిల్లికి ఎలుక లోకువ అన్నట్టు ఈ ముసలాయనకు నేను లోకువయ్యాను అని అనుకుంటుంది మల్లిక. బావ గారు మీకు కావాలా అని అడుగుతుంది. జానకి అని ఇవ్వబోతూ వద్దులే బావ గారు తాగకపోతే నువ్వు తాగవు కదా. మీది అపారమైన ప్రేమ కదా అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది మల్లిక. తను కూడా ఓ కప్పు తీసుకొని టీ తాగుతూ ఉంటుంది.

ఒరేయ్ రాముడు.. గడ్డం లేకుండా నిన్ను ఒకసారి చూడాలని ఉందిరా అంటాడు గోవింద రాజు. దీంతో ఏం మాట్లాడాలో రామాకు అర్థం కాదు. ఒకసారి గడ్డం తీయొచ్చు కదరా అంటాడు గోవింద రాజు. నాన్నా అది అంటూ ఏదో చెప్పబోతాడు రామా.

అద్దంలో జానకి వైపు చూసి గడ్డం తీయాలా అని అడుగుతాడు. దీంతో తను వద్దు అంటుంది. బాగోదు అంటుంది. దీంతో సరే అంటాడు రామా. నాన్నా అది.. అంటుంటే.. ఏంట్రా రాముడు.. గడ్డం తీస్తుంటే బాగోదు అని కోడలు చెబుతోందా అంటాడు గోవింద రాజు.

దీంతో కోడలు చెబితే కరెక్ట్ గానే ఉంటుందిరా అంటాడు గోవింద రాజు. ఈ విషయంలో కోడలు చెప్పిందే ఒప్పేసుకో అంటాడు గోవింద రాజు. ఈ విషయంలోనే కాదు.. ఏ విషయంలో అయినా సరే.. కోడలు చెప్పినట్టే నడుచుకో అంటాడు గోవింద రాజులు.

కానీ.. వాళ్లిద్దరిని చూసి జ్ఞానాంబకు కోపం వస్తుంది. ఇంతకుముందు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నా కొడుకు ఈ అమ్మను అడిగే వాడు. ఇప్పుడు ప్రతి విషయం పెళ్లాన్ని అడుగుతున్నాడు. దీన్ని బట్టే అర్థం అవుతోంది. తను నా కొడుకును ఎలా కొంగున ముడేసుకుందో తెలుసుకోవడానికి అని అనుకుంటుంది.

Janaki Kalaganaledu 26 April Today Episode : జానకి మాయ నుంచి రామాను బయటపడేటాయని నిశ్చయించుకున్న జ్ఞానాంబ

మరోవైపు జానకి నువ్వులే. ఈ పనులన్నీ చేయడానికి నేనున్నాను కదా. నేను చేస్తానులే. నువ్వు వెళ్లు. మళ్లీ అత్తయ్య గారు నన్ను తిడతారు అంటుంది మల్లిక. పెళ్లాం మాటలు వింటూ నా కొడుకు పిచ్చివాడు అయ్యేలా ఉన్నాడు అని అనుకుంటుంది జ్ఞానాంబ.

ఎలాగైనా రెండో స్వీటు షాపు తన గుప్పిట్లో పెట్టుకోవాలని అనుకుంటుంది. అందుకే మరోసారి జ్ఞానాంబకు టీ తీసుకెళ్తుంది. దీంతో ఇప్పుడే కదా టీ తాగాను. మళ్లీ ఎందుకు తీసుకొచ్చావు అంటూ కోపగించుకుంటుంది జ్ఞానాంబ. ఇంతకీ నీకు ఏం కావాలి చెప్పు అంటుంది.

దీంతో ఇప్పటికే ఒక స్వీటు కొట్టు.. రామాకు ఇచ్చారు కదా. అంటే అది జానకికి ఇచ్చినట్టే కదా. చిన్నకోడలును పని మనిషిని చేశారని ఊళ్లో అందరూ అనుకుంటున్నారు అంటుంది మల్లిక. నేను నిన్ను పనిమనిషిని చేయడం ఏంటి. ఎవరు ఆ బుద్ధి లేని మాటలు మాట్లాడింది అంటుంది.

బావ గారికి అప్పగించిన ఒక స్వీటు షాపు ఒకరకంగా జానకికి అప్పగించినట్టే కదా. ఇప్పుడు కొత్తగా పెట్టాలనుకుంటున్న రెండో షాపు కూడా బావ గారికే అప్పగించాలని అనుకుంటున్నారు. దీంతో మీ చిన్న అబ్బాయి ప్రెషర్ కుక్కర్ లా లోలోపల కుమిలి పోతున్నారు అత్తయ్య గారు అంటుంది మల్లిక.

అవునా.. అంటుంది జ్ఞానాంబ. విష్ణు అంతలా బాధపడుతున్నాడా అంటుంది జ్ఞానాంబ. నా ముందు పాపం కంటతడి కూడా పెట్టుకున్నారు. ఈ స్వీటు షాపును అమ్మ నాకు అప్పగిస్తే బాగుంటుంది కదా మల్లిక అని కూడా అన్నారు.. అంటుంది మల్లిక.

సరే.. వెళ్లి ఒకసారి విష్ణును పిలుచుకొనిరా అంటుంది జ్ఞానాంబ. దీంతో ఎందుకు అత్తయ్య గారు అంటుంది. దీంతో వాడు బాధపడుతున్నాడన్నావు కదా. ఒకసారి నేను కూడా వింటాను అంటుంది. దీంతో ఆయనెందుకు అంటుంది మల్లిక. నేను చెబుతాను అంటుంది మల్లిక.

అంతేనంటావా అంటుంది జ్ఞానాంబ. చెప్పిన అబద్ధాలు.. వేసిన ఆటలు చాలు కానీ.. ఇక వెళ్లు అంటుంది జ్ఞానాంబ. అదేంటి అత్తయ్య అలా అనేశారు అంటుంది మల్లిక. కొత్త షాపు పెట్టాలనుకునే విషయం నాకు, రామాకు తప్పించి ఇంకెవరికీ తెలియదు. మరి ఈ విషయం విష్ణుకు ఎలా తెలిసింది అని అంటుంది.

మరోవైపు రామా స్నానం చేసి టవల్ మీద డైరెక్ట్ గా రూమ్ లోకి వస్తాడు. అప్పటికే జానకి వస్తుంది. దీంతో అతడిని చూసి సిగ్గు పడుతుంది జానకి. కాసేపు ఇద్దరూ రొమాన్స్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp