Janaki Kalaganaledu 27 August 2022 Episode : జానకిని పొగుడుతున్న కుటుంబ సభ్యులు… మండిపోతున్న మల్లిక..
Janaki Kalaganaledu 27 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. 376 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. మల్లిక తప్పుచేసి జానకిపై నెట్టాలి అని చూస్తూ ఉండగా… మల్లిక చేసిన తప్పు అని తెలుసుకొని ఆ తప్పుని విష్ణుపై వేసుకుంటాడు. దాంతో మల్లిక అవాక్కవుతుంది. విష్ణుని తిడుతూ ఉంటుంది. విష్ణు మల్లికకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంకొక్కసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నేను అమ్మకి చెప్పేస్తాను అని బెదిరిస్తాడు. అప్పుడు మల్లికా తనలో నువ్వు ఇలాంటి ఎన్ని బెదిరింపులు, బెదిరించిన నేను మాత్రం జానకిని ఏదో ఒక విధంగా బుక్ చేయాలని చూస్తూనే ఉంటా అని మనసులో అనుకుంటుంది.
కట్ చేస్తే జానకి ఇంట్లో పనులన్నీ చకచకా చేసుకొని ఇంకొకపక్క మల్లికను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ తనకి కావాల్సినవన్నీ చూస్తూ ఉంటుంది. తనని చూసి ఇంట్లో ఉన్న వాళ్లంతా జానకిని పొగుడుతూ ఉంటారు. అది తట్టుకోలేక మల్లిక తనపై ఏదో ఒక ప్లాను వేస్తూనే ఉంటుంది. కానీ తన ప్లాను ఎప్పుడు వర్కౌట్ అవ్వడం లేదు. ఎప్పుడు జానకిని ఇరికించాలని చూస్తూ ఉంటుంది. కానీ తనే అందరి ముందు బదనమవుతూ ఉంటుంది. కట్ చేస్తే జెసి కాలేజీలో అఖిల్ లేకపోతే నేను బ్రతకలేను నేను మారాను అక్క అంటూ జానకిని బ్రతిమిలాడుతూ ఉంటుంది. నేను అఖిల్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధమే అక్క నేను మీ అత్తయ్య గారి దగ్గరికి వచ్చి సారీ చెప్తాను.

Janaki Kalaganaledu 27 August 2022 Full Episode
నేను మారతాను అని చెప్తాను మా పెళ్లి జరిగేలా నువ్వే చేయాలి.. అక్క అంటూ జానకిని బ్రతిమిలాడుతూ ఉంటుంది. లేకపోతే మేమిద్దరం చనిపోతాం అంటుంది. అప్పుడు జానకి జెసికి కొన్ని వేదాంతాలు చెప్తుంది. అయినా సరే వినిపించుకోదు. మా పెళ్లి జరగపోతే ఇక మాకు చావే దిక్కు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు జానకి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి కూడా జెసి, అఖిల్ వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ పరధ్యానంలో ఒకటి చెయ్యబోయి ఇంకొకటి చేస్తూ ఉండగా.. అదంతా జ్ఞానాంబ చూస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలియాలి అంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..