Guppedantha Manasu 27 Aug Today Episode : రిషిని వసుకు దూరం చేసేందుకు సాక్షి, దేవయాని మరో ప్లాన్.. రిషి, వసు ప్రేమ గురించి వాళ్లకు తెలుస్తుందా?

Authored By Varun G | The Telugu News | Updated on: August 27, 2022, 9:36 am

Guppedantha Manasu 27 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 ఆగస్టు 2022, శనివారం ఎపిసోడ్ 540 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ కారులో వెళ్తుంటారు. తమ మనసులతో మాట్లాడుకుంటారు వసుధర, రిషి. వసుధర.. వెళ్లు రెస్ట్ తీసుకో అంటాడు రిషి. అప్పుడేనా అంటుంది వసు. ఈరోజుకు రెస్ట్ తీసుకో. రేపటి నుంచి నీ ధ్యాస మొత్తం ఒకేదాని మీద ఉండాలి అంటాడు రిషి. బెస్ట్ ఆఫ్ లక్ అంటాడు రిషి. థాంక్స్ చెప్పమంటారా? మీరు నా ఆశయం కోసం నన్ను అంటూ చెప్పకుండా వద్దులేండి అంటుంది. గుడ్ నైట్ అంటుంది వసు. తన చేయి పట్టుకున్న రిషిని విదిలించుకొని వెళ్లిపోబోతుంది. పొగరు చెప్పొచ్చుగా అని రిషి అనుకుంటుండగా పిలిచారా అని అంటుంది వసు. ఏం లేదు.. నీ మనసు నాకు అర్థం అయింది కానీ.. ఈ దూరం అవసరం వసుధర అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి.

guppedantha manasu 27 august 2022 full episode

guppedantha manasu 27 august 2022 full episode

కారులో వెళ్తుంటాడు రిషి. మధ్యలో కారును ఆపేస్తాడు. కారు దిగుతాడు. కారు బానెట్ మీద నిలబడి చాలా సంతోషంగా ఉంటాడు. థాంక్స్ టు ద డివైన్. ఈ రాత్రి బాగుంది. ఈ ఆనందం ఇంకా బాగుంది. రిషీంద్ర భూషణ్. నీ లైఫ్ ఇప్పుడు నీకు చాలా బాగుంది. లైఫ్ చాలా పాఠాలు నేర్పిస్తుంది నాకు. నా లైఫ్ కు బిగ్ థాంక్స్ అని అంటూ తన నీడను చూసుకుంటాడు. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండు. ఇలాగే నిబ్బరంగా సహనంగా నిలబడు. సమస్యలు వచ్చినా.. ఒప్పుకో. వసుధర నీది. నువ్వు తన ప్రాణం. తన ఆశయం నువ్వే నిలబెట్టు.. అని అనుకుంటాడు రిషి. కట్ చేస్తే మహీంద్రా, గౌతమ్ ఇద్దరూ మెట్ల మీద కూర్చొని మాట్లాడుకుంటారు. ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు మహీంద్రా. దీంతో రిషి గురించి ఆలోచిస్తున్నాను. కానీ.. నాకు ఏం అర్థం కావడం లేదు అంటాడు గౌతమ్. ఇంతలో రిషి కారులో ఇంటికి వస్తాడు.

వాడు వచ్చినట్టున్నాడు. ఇప్పుడే అడిగేద్దాం అంటాడు గౌతమ్. ముందు నువ్వు అడుగుతావా.. లేక నన్ను అడగమంటావా అంటాడు మహీంద్రా. దీంతో పెద్దవారు కదా.. మీరే అడగండి అంటాడు. రారా.. కాసేపు సరదాగా మాట్లాడుకుందాం అంటాడు గౌతమ్.

దీంతో నేను బాగా అలసిపోయాను. నా వల్ల కాదు. నేను రెస్ట్ తీసుకోవాలి అని వెళ్లబోతుండగా జగతి కనిపిస్తుంది. జగతి వెనుక వసుధర ఉన్నట్టు ఊహించుకుంటాడు జగతి. ఆ తర్వాత థాంక్యూ మేడమ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. ఏమైంది వీడికి అని అనుకుంటుంది జగతి.

Guppedantha Manasu 27 Aug Today Episode : రిషి గురించే ఆలోచించిన గౌతమ్, మహీంద్రా

మరోవైపు వసుధర చాలా సంతోషంగా ఉంటుంది. ఇంటికి వెళ్లాక కూడా రిషి ఫోటోనే చూస్తూ టైమ్ పాస్ చేస్తుంది. రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. రిషి కూడా వసుధర ఫోటోను చూస్తూ ఉంటాడు. వసుధర ఏం చేస్తుందో నేను మాట్లాడలేదు. తనైనా ఫోన్ చేయాలి కదా అని అనుకుంటాడు రిషి.

ఏంటి రిషి సార్.. ఏం చేస్తున్నారు. తిన్నావా లేదా అని అడగాల్సిన బాధ్యత లేదా. మీరు ఫోన్ చేయరా.. మాట్లాడరా అని అనుకుంటుంది వసు. తనే ఫోన్ చేయాలని నేను ఎందుకు ఎదురు చూడాలి. నేనే చేస్తాను. హలో వసుధర ఎలా ఉన్నావు అని మెసేజ్ చేయబోతాడు.

నేనెందుకు మెసేజ్ చేయకూడదు. సార్ కంటే ముందే నేను మెసేజ్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటుంది వసు. అయినా.. ఎగ్జామ్స్ అయిపోయేదాకా నేనే కలవకూడదని చెప్పా కదా. మళ్లీ నేనే మెసేజ్ చేస్తే ఏం బాగుంటుంది అని అనుకుంటాడు రిషి.

సార్ కలవొద్దు.. మాట్లాడొద్దు అని చెప్పారు కదా. ఆ రూల్ ను నేను బ్రేక్ చేయడం ఎందుకు అని అనుకుంటుంది వసు. మరోవైపు సాక్షి, దేవయాని.. వసు, రిషి గురించి మాట్లాడుకుంటారు. రిషి నన్ను ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు అంటుంది రిషి.

ఈ పరీక్షలు అయిపోనీ.. ఆ తర్వాత రిషి, వసుధర ఇద్దరూ దూరం అవుతారు. అప్పుడు రిషిని మన వైపునకు ఎలా తిప్పుకోవాలో నాకు తెలుసు అంటుంది దేవయాని. ఆ తర్వాత తెల్లవారుతుంది. జగతి కాఫీ పట్టుకొని రిషి రూమ్ కు వెళ్తుంది కానీ.. రిషి ఇంకా లేవడు.

గౌతమ్, మహీంద్రా ఇద్దరూ రిషితో మాట్లాడుదామని అనుకున్నా రిషి ఇంకా లేవడు. ఇంతలో దేవయాని వచ్చి ఏం గూడు పుఠాని చేస్తున్నారు అని అడుగుతుంది. దీంతో ఏం లేదు అని చెప్పి మహీంద్రా, గౌతమ్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు వసుధర నిద్రలేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp