Janaki Kalaganaledu 27 Oct Today Episode : మల్లిక గర్భవతి కాదు అనే నిజం తెలుసుకున్న జానకి.. జ్ఞానాంబ బాధపడుతుందని జానకి ప్రెగ్నెంట్ అవ్వాలని నిర్ణయించుకుంటుందా?

Authored By Varun G | The Telugu News | Published on: October 27, 2022, 9:30 am

Janaki Kalaganaledu 27 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 అక్టోబర్ 2022, గురువారం ఎపిసోడ్ 419 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జెస్సీని వచ్చి చెక్ చేసిన డాక్టర్.. జెస్సీ పరిస్థితి మీకు ముందే చెప్పాను కదా అంటుంది. దీంతో జానకి షాక్ అవుతుంది. జ్ఞానాంబ ముందే డాక్టర్ అలా చెప్పేసరికి ప్లీజ్ అండి.. అందరి ముందు అలా చెప్పకండి అని చిన్నగా చెబుతుంది జానకి. దీంతో అయ్యయ్యో చెప్పేశానా అని అనుకుంటుంది డాక్టర్. వెంటనే మల్లిక అందుకొని ఏమన్నారు.. తను ఎప్పుడు ఆసుపత్రికి వచ్చింది అంటుంది మల్లిక. దీంతో వద్దు అని దండం పెడుతుంది జానకి. ఐయామ్ సారీ నేను పొరపాటు పడ్డాను. వేరే అమ్మాయికి ఈ విషయం చెప్పాను. అదే మూడ్ లో ఉండి జెస్సీకి చెప్పాను అనుకున్నాను అంటుంది డాక్టరమ్మ. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. నేను బయటపడటానికి ఇదే కరెక్ట్ టైమ్. తప్పించుకోవాలి అని అనుకుంటుంది మల్లిక. మరోవైపు మల్లిక చిన్నగా అక్కడి నుంచి బయటికి వెళ్తుంది.

janaki kalaganaledu 27 october 2022 full episode

janaki kalaganaledu 27 october 2022 full episode

డాక్టర్.. జెస్సీకి ట్యాబ్లెట్లు రాసి ఇస్తుంది. ఈ మెడిసిన్స్ అన్నీ వాడండి అంటుంది డాక్టర్. ఎలాగూ వచ్చారు కదా.. మా మల్లిక కూడా ప్రెగ్నెంటే. తనకు కూడా ఒకసారి చెకప్ చేయండి అంటుంది జానకి. దీంతో సరే అంటుంది డాక్టరమ్మ. ఇంతలో మల్లిక అక్కడ కనిపించదు. చికిత.. తనను వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. మల్లికమ్మ గారు ఎక్కడున్నారండి అని అంటుంది. విష్ణు కూడా మల్లికను వెతుకుతుంటాడు. ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటుంది. ఇంతలో తనకు ఒక ఐడియా వస్తుంది. సున్నం వేసే పెద్ద స్టాండ్ ను తీసుకొని దాన్ని చెట్టు ముందు పెట్టి అది ఎక్కి కూర్చొంటుంది. మల్లిక అంటూ వెతుక్కుంటూ వచ్చిన విష్ణు, చికిత మల్లిక కోసం అటూ ఇటూ వెతుకుతుంటారు. తను పైనే ఉన్నది చూడరు. ఇద్దరూ తిరిగి వచ్చి మల్లిక కనిపించలేదు అంటారు.

ఒకసారి మల్లికకు ఫోన్ చేయి ఎక్కడుందో తెలుస్తుంది కదా అంటాడు రామా. దీంతో ఫోన్ చేస్తాడు విష్ణు. కానీ.. ఫోన్ ఇంట్లోనే ఉంటుంది. మరోవైపు డాక్టర్ తనకు లేట్ అవుతోంది అంటుంది. నేను మరోసారి వచ్చినప్పుడు టెస్ట్ చేస్తానులే.. అని డాక్టరమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఇంతలో గోవిందరాజు అక్కడికి వచ్చి ఆ స్టాండ్ ను తీసి దూరం పెడతాడు. దీంతో తను చెట్టు ఎక్కి కూర్చొంటుంది. తనకు ఎలా దిగాలో అర్థం కాదు. మరోవైపు జానకి వెళ్లి తన పుస్తకాలను తీసుకొని అక్కడ కూర్చొని చదువుతూ ఉంటుంది. మల్లిక ఎటు వెళ్లి ఉంటుంది అని అనుకుంటుంది.

Janaki Kalaganaledu 27 Oct Today Episode : చెట్టు మీద ఉన్న మల్లికను చూసి షాక్ అయిన జానకి

ఉన్నట్టుండి మాయం అయిపోయింది ఏంటి అని అనుకుంటుంది జానకి. ఎలుక కోసం కలుగు దగ్గర పిల్లి కాచుకొని ఉన్నట్టు జానకి ఏంటి ఇక్కడ కూర్చొని చదువుతోంది అని అనుకుంటుంది మల్లిక. ఏదో ఒకటి చేసి దిగాలి అని అనుకుంటుంది మల్లిక. కానీ.. కిందికి చూస్తే భయం వేస్తుంది అని అనుకొని అరుస్తుంది. దీంతో తన అరుపును వింటుంది జానకి.

చెట్టు మీద తనను చూసి షాక్ అవుతుంది జానకి. తన దగ్గరికి వచ్చి ఇక్కడున్నావా?.. చెట్టు పైకి ఎక్కి ఏం చేస్తున్నాను. కిందికి రా అంటుంది జానకి. దీంతో ఎలా రావాలి జానకి. నేను పైకి ఎక్కాక ఎవరో నిచ్చన తీసేశారు అంటుంది మల్లిక. దీంతో నిచ్చెనను తీసుకొని వచ్చి దిగు అంటుంది.

దీంతో టకటాకా దిగి అక్కడి నుంచి వెళ్లిపోబోతుంది మల్లిక. దీంతో తనను పిలిచి చెట్టు పైకి ఎందుకు ఎక్కావు అని అడుగుతుంది జానకి. దీంతో అంటే జానకి.. వేపాకులు కోద్దామని ఎక్కాను అంటుంది మల్లిక. దీంతో వేపాకులు కోయమని నిన్ను ఎవరు అన్నారు అంటుంది జానకి.

దీంతో నాకే వేపరసం తాగాలని అనిపించింది అంటుంది మల్లిక. దీంతో ఒకప్పుడు నాకు వేప రసం ఇష్టం లేదు అన్నావు కదా అంటే.. అప్పుడు ఇష్టం లేదు కానీ.. తర్వాత ఆలోచిస్తే నువ్వు చెప్పింది నిజమే అని అనిపించింది అంటుంది మల్లిక. మరి.. పైకి ఎక్కిన దానికి వేపాకులు ఎందుకు కోయలేదు. కిందికి దించడానికి ఎవ్వరినీ ఎందుకు పిలవలేదు అంటుంది జానకి.

దీంతో జానకి.. బాగా దాహంగా ఉంది. వచ్చాక చెబుతాను.. అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది మల్లిక. దీంతో మల్లికకు కడుపు లేదనే డౌట్ వస్తుంది జానకికి. దీంతో వెంటనే నీలావతికి ఫోన్ చేసి అర్జెంట్ గా రా మాట్లాడాలి అంటుంది. దీంతో ఇంటికి వచ్చిన నీలావతిని చూసి మల్లిక నువ్వెందుకు వచ్చావు అని అడుగుతుంది.

దీంతో నీకు కడుపు వచ్చిందని నాటకం ఆడుతున్నామని జానకికి తెలిసిపోయిందేమో అంటుంది నీలావతి. వాళ్లు మాట్లాడుకోవడం విన్న జానకి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp