Janaki Kalaganaledu 28 Dec Today Episode : తన ప్రేమ విషయం జానకికి చెప్పి బోరున ఏడ్చిన వెన్నెల.. దీంతో వెన్నెల, దిలీప్ కు జానకి పెళ్లి చేస్తుందా?

Authored By Varun G | The Telugu News | Updated on : 28 December 2021, 3:00 pm

Janaki Kalaganaledu 28 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 డిసెంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 202 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెన్నెలకు పెళ్లి సంబంధం చూశామని.. అందరినీ పిలిచి వాళ్ల అభిప్రాయం అడుగుతారు జ్ఞానాంబ, గోవింద రాజు. అందరూ ఓకే అంటారు కానీ.. మల్లిక మాత్రం నాకు ఇష్టం లేదు అంటుంది. అసలు.. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని వదిలేసి మమ్మల్ని అడుగుతారేంటి అని అంటుంది మల్లిక. ఈరోజుల్లో పిల్లలు ప్రేమ దోమ అంటూ తిరుగుతున్నారు. ముందు వెన్నెలను అడగండి.. అని అంటుంది మల్లిక. దీంతో నోర్మూయ్.. ఏం మాట్లాడుతున్నావు. నేను చెబితే గానీ వెన్నెల నిద్రపోదు.. అలాంటిది ప్రేమ దోమ అంటావా.. అంటూ మల్లికపై సీరియస్ అవుతుంది.

janaki kalaganaledu 28 december 2021 full episode

janaki kalaganaledu 28 december 2021 full episode

ఇవన్నీ పక్కనే ఉండి వెన్నెల వింటూ ఉంటుంది. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. ఇంకోసారి ఇలా పిచ్చిపిచ్చిగా వాగావాంటే అస్సలు బాగుండదు అంటుంది జ్ఞానాంబ. దీంతో అలాగే అత్తయ్య గారు అంటుంది మల్లిక. దీంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. వెన్నెలకు మాత్రం ఏం చేయాలో అర్థం కాదు. తన ప్రేమ విషయం ఎలా తన తల్లికి చెప్పాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. కానీ.. తనకు ఏం తోచదు. తన వదిన జానకి దగ్గరికి వెళ్తుంది. అఖిల్ విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం గొప్పది. నువ్వు ఈ విషయంలో చాలా గ్రేట్ వదిన అంటుంది వెన్నెల. అది నా గ్రేట్ కాదు.. కొడుకు భవిష్యత్తు గురించి మీ అమ్మగారు చాలా కలలు కన్నారు. అఖిల్ ను అత్తయ్య గారు పనిలో పెట్టారన్న మాటే కానీ.. మనసులో మాత్రం తన కొడుకు భవిష్యత్తు గురించి తపన పడుతూనే ఉన్నారు అంటుంది. ఇంతలో రామా వచ్చి అన్ని వింటాడు.

నీలో ఉన్న గొప్పదనం అదే వదిన. నువ్వు ఎంత హెల్ప్ చేసినా సరే.. క్రెడిట్ మాత్రం అస్సలు తీసుకోవు అంటుంది వెన్నెల. వదిన నీతో ఒక విషయం చెప్పాలి అంటుంది. అది.. నేను అంటూ ఏదో చెప్పబోతుంటే అప్పుడే రామా వస్తాడు. ఇందాక చాలా కరెక్ట్ గా చెప్పావు వెన్నెల అంటాడు రామా.

మీ వదిన అంతే.. చేసిన సాయానికి పొగిడినా అస్సలు పట్టించుకోదు. థ్యాంక్స్ చెబితే కూడా తీసుకోదు.. గొప్ప మనసు తనది. బంగారం తను అంటుంది. ఆ తర్వాత వెన్నెల అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నా ముద్దుల భార్య కోసం ఓ చిన్న బహుమతి అని ఇస్తాడు రామా.

దాంట్లో నేను చేసిందేముందండి అంటుంది జానకి. ఆ బహుమతిని ఓపెన్ చేస్తుంది. అది చీర. రామా గారు నా భర్త నా కోసం ప్రేమగా చీర తీసుకొచ్చాక ఇంకా ఎలా ఉంది అని అడగాలా. మీ ప్రేమ అంతా ఇందులో కనిపిస్తుంది. మీ మనసు అంత అందంగా ఈ చీర ఉంది.. అంటుంది జానకి.

Janaki Kalaganaledu 28 Dec Today Episode : తన బాధను జానకికి చెప్పిన వెన్నెల

ఈ చీర మీకు ఎలా ఉంటుందో ఇప్పుడే చూసేయాలి అంటాడు. అయితే మీరు బయటికి వెళ్లండి నేను కట్టుకుంటాను అంటే.. కాదు కాదు.. నేనే కడతాను అంటాడు. డోర్ మూసేసి.. ఆ చీర మీదనే మరో చీర కడతాడు రామా. చీర కట్టాక అలాగే జానకిని చూస్తూ ఉంటాడు.

ఏంటండి అలా చూస్తున్నారు అంటుంది. మనం ఏదైనా అద్భుతాన్ని చూసినప్పుడు.. ఆ అద్భుతం తప్ప చుట్టూ ఉన్న ప్రపంచం స్థంభించిపోయినట్టు అనిపిస్తుందండి అంటాడు రామా. దేవలోకం దిగివచ్చిన దేవకన్యలా నా కళ్లకు కనిపిస్తున్నారు అని జానకిని తెగ పొగిడేస్తుంటాడు రామా.

ఉదయం వెన్నెల ఒంటరిగా కూర్చొని తనకు తానే ఏడుస్తూ ఉంటుంది. జానకి చూసి తన దగ్గరికి వస్తుంది. ఏమైంది వెన్నెల ఇక్కడ కూర్చున్నావు అంటుంది. ఖార్ఖానాలో పూజకు రావడం లేదా.. అంటుంది. నాకు రావాలని లేదు వదిన.. నువ్వు వెళ్లు వదిన అంటుంది వెన్నెల.

వెన్నెల ఏంటి సమస్య.. అని అడుగుతుంది జానకి. ఎందుకు అలా ఉన్నావు. ఏమైంది చెప్పు అంటుంది. నాకేం సమస్య వదిన నేను బాగానే ఉన్నాను కదా అంటుంది. మా వెన్నెల గురించి నాకు తెలియదా.. అంటుంది. చెప్పు ఏమైందో అంటుంది జానకి. చెప్పు నీ బాధకు కారణం ఏంటో చెప్పు అంటుంది.

దీంతో వెన్నెల.. ఏదో చెప్పబోతుంది మళ్లీ ఆగిపోతుంది. ఏదో చెప్పాలనుకుంటున్నావు కానీ.. భయం నిన్ను ఆపేస్తోంది అని నాకు అర్థం అవుతోంది. చూడు వెన్నెల.. వదిన అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది. అమ్మతో చెప్పుకోలేని కొన్ని సమస్యలను వదినతో చెప్పుకోవచ్చు. నీలో ఉన్న బాధేంటో చెప్పు.. నేను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను అంటుంది జానకి.

దీంతో వదిన అంటూ తన మీద పడి బోరున ఏడుస్తుంది వెన్నెల. ఏమైంది.. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఏంటి సమస్య అంటుంది. నాకు పెళ్లి ఇష్టం లేదు అని చెబుతుంది. తను దిలీప్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు చెబుతుంది. వాళ్ల ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ. నేను, దిలీప్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అంటుంది వెన్నెల.

నేను అమ్మకు ఈ విషయం చెబుదామనుకున్నా కానీ.. ఇంతలో అమ్మ వాళ్లు నాకు సంబంధం చూశారు. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు.. అంటుంది. మరోవైపు జానకికి పుస్తకాలు ఇవ్వడానికి తన క్లాస్ మెట్ అభిరామ్ ఇంటికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి