Janaki Kalaganaledu 28 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 జనవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 225 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు బాంబును డిఫ్యూజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది ఎంతో సాహసంతో కూడుకున్నది.. అని పోలీస్ జానకిని మెచ్చుకుంటాడు. మీ ధైర్య సాహసాల గురించి మాట్లాడే అవకాశం మా డిపార్ట్ మెంట్ కు ఇవ్వండి అని జానకిని అడుగుతాడు. దీంతో జ్ఞానాంబ పర్మిషన్ కోసం చూస్తుంది జానకి. జానకి కూడా ఓకే అనేసరికి వెంటనే జానకిని పోలీస్ పొగడ్తల్లో ముంచెత్తుతారు. ఇంత ధైర్యసాహసాలు ఉన్న అమ్మాయి ఈ ఊళ్లో ఉండటం ఈ ఊరి వాళ్లు చేసుకున్న అదృష్టం అంటాడు పోలీసు.
జ్ఞానం చూశావా మన కోడలును ఎలా పొగుడుతున్నారో అంటాడు గోవిందరాజు. వజ్రం భూమిలో ఉన్నంత సేపు దాని విలువ తెలియదు. దాన్ని బయటికి తీసి మెరుగు పెట్టాక దాని విలువ అర్థం అవుతుంది. ఇంత ధైర్యసాహసాలు ఉన్న జానకి గారు ఈ ఊళ్లోనే ఉండిపోకూడదు. మా పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరితే ఇలా ప్రజల ప్రాణాలను కాపాడొచ్చు అంటాడు పోలీస్. దీంతో జానకి ఉద్వేగానికి లోనవుతుంది. మీరు ఎలాగూ డిగ్రీ పూర్తి చేశారు కాబట్టి.. మిమ్మల్ని మా పోలీస్ ఫండ్స్ తో ఐపీఎస్ చదివించాలని అనుకుంటున్నాం. డీజీపీ గారితో మాట్లాడి మీ చదువుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తాం. ఓకేనా మేడమ్ అంటాడు పోలీస్.
కానీ.. జానకి ఆలోచిస్తూ ఉంటుంది. జ్ఞానాంబ కోసం ఎందుకో ఆలోచనలో పడుతుంది. అయితే వెనుక నుంచి ప్రజలంతా ఒప్పుకోవాలి.. ఒప్పుకోవాలి అని అంటారు. చూశావా జానకికి ఎంత ఫాలోయింగ్ పెరిగింది అని అంటుంది మల్లిక. మీరు ఐపీఎస్ అవ్వాలని వీళ్లంతా కోరుకుంటున్నారు. మీరు సరే అని చెప్పండి.. అంటాడు పోలీస్.
ఇప్పుడు నేను ఏం మాట్లాడినా అది అత్తయ్య గారికి బాధ కలిగిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి.. అని అనుకొని ప్లీజ్ అండి. ఇప్పటికి నేను నా నిర్ణయాన్ని ఏం చెప్పలేను అని అంటుంది జానకి. ఇంతలో లీలావతి వచ్చి చదువుకుంటా అని నువ్వు ఎలా చెప్పగలవు జానకి.
మీ అత్తగారికి వేలిముద్ర కోడలు కదా కావాల్సింది. నువ్వు ఎంత చదువుకుంటా అంటే మాత్రం మీ అత్తగారు ఒప్పుకుంటారా ఏంటి అంటుంది. ప్లీజ్ సార్ దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి అంటుంది జానకి. దీంతో సరేనమ్మా.. ప్రస్తుతం మీ నిర్ణయాన్ని ఇప్పుడు చెప్పకపోయినా పర్వాలేదు అంటాడు పోలీస్.
జానకి గారు.. మీకు అభ్యంతరం లేకపోతే మా డిపార్ట్ మెంట్ తరుపున సన్మానం చేయాలనుకుంటున్నాం అంటాడు పోలీస్. తనకు అందరూ సెల్యూట్ చేస్తారు. తనకు శాలువా కప్పుతారు. మళ్లీ సెల్యూట్ చేస్తారు. దీంతో జానకి కూడా వాళ్లకు సెల్యూట్ చేస్తుంది. తను చాలా సంతోషంతో ఉంటుంది.
జ్ఞానం.. నిజంగా మన కోడలు గ్రేటే. ఇంతమంది మనసు గెలుచుకుంది చూడు.. అని పొగుడుతాడు గోవిందరాజు. మరోవైపు సంక్రాంతి సంబురాలు పూర్తయ్యాక.. వెళ్లిపోతుండగా ప్రెస్ వాళ్లు వచ్చి.. జ్ఞానాంబను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు.
మీకోడలు ఐపీఎస్ చదవకూడదని మీరు నిర్ణయం తీసుకున్నారా? ఇక్కడ అందరూ అనుకుంటున్న దానిపై మీరేమంటారు అంటూ జ్ఞానాంబను ప్రశ్నిస్తారు. మీ నిర్ణయాలతో మీ కోడలును భయపెడుతున్నారా? మీ తమ్ముడు సూసైడ్ చేసుకొని చనిపోయాడని.. మీ కొడుకుకు కూడా అటువంటి పరిస్థితి ఎదురవుతుందని భయపడుతున్నారా? అని మీడియా వాళ్లు ప్రశ్నిస్తారు.
దీంతో లీలావతి కలుగజేసుకొని అవునయ్యా.. కొడుకుకు అక్షరం ముక్క రాని అమ్మాయిని కోడలుగా తీసుకురావాలని మా జ్ఞానాంబ అనుకుంది. దీంట్లో తప్పేముంది అని కావాలని అన్ని విషయాలు చెబుతుంది లీలావతి. ఎవ్వరు చెప్పినా వినకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది లీలావతి.
జానకిని పైచదువులు చదవనీయకుండా మా జ్ఞానాంబ మాట తీసుకుంది అనే కదా.. అవునయ్య మాట తీసుకుంది.. గట్టిగా శాసించింది.. అని చెబుతుంది లీలావతి. మీరు ఆగండి లీలావతి గారు అని జానకి వారించినా వినదు లీలావతి. చదువు రాని అమ్మాయి కోసం మా జ్ఞానాంబ తిరగని ఊరు లేదు. ఈ అమ్మాయి చదువుకోలేదని అబద్ధం చెప్పి పెళ్లి చేశారు అంటుంది లీలావతి.
రామా చెప్పినా వినదు. చదువు ఊసెత్తను అని జానకి చెప్పిన తర్వాత జ్ఞానాంబ తన ఇంట్లోకి రానిచ్చింది అని అంటుంది లీలావతి. మీరు మా కుటుంబ విషయంలో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అంటుంది జానకి. మా వాళ్లను అంటుంటే నేను ఊరుకుంటానా అంటుంది లీలావతి.
చివరకు జానకి.. విడాకులు కాగితాలు ఇవ్వడం విషయం గురించి కూడా చెబుతుంది లీలావతి. తల్లిగా మా జ్ఞానాంబ వైపు న్యాయం ఉంది. ఇందులో ఏం తప్పు ఉందని ఓ రాద్ధాంతం చేస్తున్నారు అంటుంది. దీంతో జ్ఞానాంబ గారు చెప్పండి.. ఒక వేళ మీ కోడలు ఐపీఎస్ చదువుకుంటా అంటే.. తనకు విడాకులు ఇప్పించి పంపించేస్తారా అని మీడియా వాళ్లు అడుగుతారు.
దీంతో ఏం మాట్లాడకుండా జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంటికి వస్తుంది జ్ఞానాంబ. ఆ విలేఖరులు ఏదో తెలియక మాట్లాడారు. వాళ్లు మాట్లాడింది పట్టించుకోకు అంటాడు గోవిందరాజు. దీంతో వాళ్లు ఊరికే ఎందుకు అడుగుతారు.. ఉన్నదే కదా అడిగింది అని అంటుంది మల్లిక.
అంటే ఏంటి.. జానకే వాళ్లతో అలా అడిగించారా.. ఏం మాట్లాడుతున్నావు అని రామా మల్లికను అంటాడు. ఈ విషయాలన్నీ మన ఇంట్లో తప్ప ఇంకెవరికీ తెలియవు. మరి.. అవన్నీ విలేఖరులకు ఎలా తెలిశాయి అని అడుగుతుంది మల్లిక. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.